
భార్య, ఆమె ప్రియుడ్ని చితకబాదేశాడు..
ఓ యువకుడు తన భార్యను చూడకూడని స్థితిలో చూశాడు. అంతే ఆవేశం కట్టలు తెంచుకుంది. భార్యను, ఆమె ప్రియుడ్ని పట్టుకుని ఇంట్లోనే వరండాలో రెండు స్తంభాలకు వేర్వేరుగా తాడుతో కట్టేశాడు. అతను కట్టె, తాడు తీసుకుని ఇద్దరిని చితకబాదాడు. పిల్లలు, చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే అతను ఆవేశంతో పలుమార్లు కొట్టాడు. దెబ్బల నుంచి తప్పించుకునేందుకు స్తంభం చుట్టు తిరిగినా అతను వెంటబడి కొట్టాడు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు కచ్చితంగా తెలియవు. అయితే బిహార్ రాష్ట్రంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె చీర కట్టుకుని భారత సంప్రదాయ దుస్తుల్లో ఉండగా, ఆమె ప్రియుడు ఫ్యాంట్, టీ షర్ట్ ధరించి ఉన్నాడు.
ఈ దృశ్యాలను ఎవరు వీడియో తీశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఇదో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది బాధిత భర్తకు మద్దతు తెలపగా, మరికొందరు గృహహింస కింద అతణ్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబం పరువు కోసమే భర్త.. తన భార్య, ఆమె ప్రియుడ్ని కొట్టాడని, దీన్ని గృహహింసగా పరిగణించరాదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా అతని హింసాత్మక చర్యలను ఎలా సమర్థిస్తారంటూ మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.