భార్యను ట్రాప్ చేసిన టెకీ: విడాకులకు ఓకే
బెంగళూరు: భార్యపై తనకున్నది అనుమానం కాదని, ఆమె మోసకారేనని కోర్టుకు నిరూపించి విడాకులు పొందాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో టెకీ భర్త టెక్నాలజీ సాయంతో భ్యార్య మోసాన్ని వెలుగులోకి తెచ్చాడు. వివరాల్లోకి వెళితే..
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 31ఏళ్ల యువకుడు భార్య, మూడేళ్ల కూతురితో కలిసి బెంగళూరు సిటీలోని ఓ ఫ్లాట్ లో ఉంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతనికి మెదటిసారి భార్యపై అనుమానం వచ్చింది. సిగరెట్ తాగేవాళ్లెవ్వరూలేని తన ఇంట్లో ఒక మూలన కాల్చిపారేసిన సిగరెట్ పీకను గుర్తించిన టెకీ.. భార్యను అడగ్గా, తనకేమీ తెలియదని బుకాయించిందామె. పెరిగిన అనుమానంతో భార్యపై నిఘా పెట్టిన టెకీ ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదుచోట్ల కెమెరాలు ఏర్పాటుచేశాడు. అప్లికేషన్లను వినియోగించి భార్య ఫోన్ ను తన లాప్ టాప్ కు అనుసంధానం చేశాడు. దాదాపు నాలుగు అనుమానాన్ని నివృత్తిచేసే ఆధారాలేవీ దొరకలేదు.
కానీ జులైలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భనిరోదక మాత్రలు తెమ్మని చెప్పిన మాటలు టెక్కీ చెవినపడ్డాయి. ఇక కెమెరాలు వాటిపని అవి చేసుకుపోయాయి. లివింగ్ రూమ్ లో, బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె సాగించిన లీలలన్నీ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలను చేతబట్టుకుని నేరుగా కోర్టుకు వెళ్లిన టెక్కీ తనకు విడాకులు కావాలని అభ్యర్థించాడు. కోర్టు ఆదేశానుసారం వీడియో రికార్డులను పరీక్షించిన బెంగళూరు మీడియేషన్ సెంటర్ (బీఎంసీ) అధికారులు అవి నిజమైనవేనని, ఎలాంటి మార్పులు చేయలేదని నిర్ధారించాయి. దీంతో కోర్టు ఆ టెకీకి విడాకులు మంజూరుచేసింది. పాప సంరక్షణ బాధ్యతలు కూడా తండ్రికే అప్పగించింది.