
చెట్లపై కూలిన విమానం
ట్యుస్కలూసా: అలబామాలో ఓ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న విమానం చెట్లపై కూలిపోవడంతో అందులోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. సరిగ్గా విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఇబ్బందులు తలెత్తి కూలిపోయినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.
సెంట్రల్ ఫ్లోరిడా నుంచి ఆక్స్ ఫర్డ్కు బయలుదేరిన విమానం ట్యుస్కలూసాలోని ప్రాంతీయ విమానాశ్రయంలో రన్ వేపై దిగే క్రమంలో ప్రమాదానికి గురైంది. పీఏ-31 అనే ఈ చిన్న విమానం కిస్సిమ్మీ గేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ట్యుస్కలూసాలోని ఎయిర్ పోర్ట్ రన్ వేపై దిగే ప్రయత్నంలో చెట్లపై కూలిపోయిందని, అందులోని ఆరుగురు చనిపోయారని ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ఈ విమానం కూలిపోయినట్లు చెప్పారు.