బహుదూర్‌పురా: హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పక్కకు ఒరిగిపోయింది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ బహుళ అంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. దాంతో భయాందోళన చెందిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో సంఘటనా స్థలికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు అధికారులు. ఆ భవనం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భవనం పక్కకు ఒరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment