
అపార్‌టమెంట్‌పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
మానసిక వ్యాధితో ఓ మహిళ అపార్‌టమెంట్‌పై నుంచి దూకి మృతి చెందిన ఘటన బుధవారం భీమవరంలో జరిగింది.
భీమవరం అర్బన్ : మానసిక వ్యాధితో ఓ మహిళ అపార్‌టమెంట్‌పై నుంచి దూకి మృతి చెందిన ఘటన బుధవారం భీమవరంలో జరిగింది. టూటౌ పోలీసుల కథనం ప్రకారం భీమవరం రెండో పట్టణ పరిధిలోని వంశీకృష్ణనగర్‌లో, కాట్రేనిగుంట సత్యం టవర్స్ మూడో ఫ్లోర్‌లోని బీ1 ప్లాట్‌లో నంబూరి వీర వెంకట సత్యనారాయణ కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.
ఆయన భార్య నెహర్ మణిమాల (40) కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెను చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరుచూ తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మణిమాల బుధవారం మూడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త వీర వెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై సురేంద్రకుమార్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మణిమాలకు ఒక పాప, బాబు ఉన్నారు.