మీ ఫ్లాట్ యూడీఎస్ ఎంత? | how much is your plot uds? | Sakshi
Sakshi News home page

మీ ఫ్లాట్ యూడీఎస్ ఎంత?

Published Fri, Sep 9 2016 11:14 PM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

మీ ఫ్లాట్ యూడీఎస్ ఎంత? - Sakshi

మీ ఫ్లాట్ యూడీఎస్ ఎంత?

అన్‌డివెడైడ్ షేర్‌తోనే ఇంటి విలువ లెక్కింపు
స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్‌హౌజ్ వంటి ఆధునిక వసతుల వల్ల కొందరు.. నాణ్యమైన నిర్మాణం, నిర్వహణ, భద్రతల వల్ల ఇంకొందరు.. .. ఏదేమైనా మనలో చాలా మంది బహుళ అంతస్తుల్లో నివాసానికి కారణాలివే. అలా అని అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనడంతోనే కోరిక తీరినట్టు కాదండోయ్. మీ ఇంటి అన్‌డివెడైడ్ షేర్ (యూడీఎస్) ఎంతనేది ముందే తెలుసుకోవాలి. అగ్రిమెంట్‌లో యూడీఎస్‌ను ప్రస్తావించారో లేదో పరిశీలించాలి కూడా. ఎందుకంటే మీ ఇంటి విలువను లెక్కించేది, ఇంటి విలువ పెరిగేది కూడా యూడీఎస్‌తోనే మరి!!  
- సాక్షి, హైదరాబాద్

ఫ్లాట్ కొనేముందు విస్తీర్ణం, వసతులు, లొకేషన్, వాస్తు వంటి వాటిపై శ్రద్ధ చూపినంతగా.. యూడీఎస్ మీద శ్రద్ధ చూపించరు కొనుగోలుదారులు. వాస్తవానికి స్థిరాస్తి కొనుగోళ్లలో యూడీఎస్ అనేది చాలా ముఖ్యమైంది. భూకంపాలు, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు (లేదా) ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం మీ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు మీకిచ్చే పరిహారం యూడీఎస్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అగ్రిమెంట్‌లో మీ ఇంటి యూడీఎస్ ఎంతనేది స్పష్టంగా ఉండాలన్నమాట.

 యూడీఎస్ అంటే..
అపార్ట్‌మెంట్‌లోని ఒక్కో ఫ్లాట్‌కు కేటాయించిన స్థలమే యూడీఎస్. అపార్ట్‌మెంట్ నిర్మించిన స్థలంలోని అవిభాజ్య వాటానే యూడీఎస్ అన్నమాట. ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి యూడీఎస్ కూడా మారుతుంది. యూడీఎస్ అనేది ఫ్లాట్ యజమాని పేరు మీద రిజిస్టరై ఉంటుంది. అయితే కొన్ని నిర్మాణాల్లో భవనం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)ని బట్టి కూడా యూడీఎస్ మారుతుందండోయ్.
ఎవరైనా.. ఎక్కడైనా సరే ఫ్లాట్ కొనుగోలు చేసేముందు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి.

1. ప్రాజెక్ట్ మొత్తం స్థలం ఎంత? ఎంత భాగంలో భవనాన్ని నిర్మించారు?

2. ప్రాపర్టీ ధర పెరిగిందంటే అది ల్యాండ్ విలువ పెరిగిందని అర్థం. అంతే తప్ప బిల్డింగ్ విలువ పెరిగిందని కాదు. అంటే ప్రాపర్టీ పెరుగుదల అనేది యూడీఎస్ మీద ఆధారపడి ఉంటుం దన్నమాట.

యూడీఎస్‌ను ఎలా లెక్కిస్తారు?
యూడీఎస్ లెక్కింపు అనేది అపార్ట్‌మెంట్ సూపర్ బిల్టప్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. అంటే అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్ల సూపర్ బిల్టప్ ఏరియాలూ లెక్కలోకొస్తాయన్నమాట. ఉదాహరణకు 2,400 చ.అ. స్థలంలో 4 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారనుకుందాం. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 1,000 చ.అ.లనుకుందాం. ఇప్పుడీ నాలుగు ఫ్లాట్ల యూడీఎస్ ఎంతంటే?

యూడీఎస్ = ఒక్కో ఫ్లాట్ సూపర్ బిల్టప్ ఏరియా/ అన్ని ఫ్లాట్ల సూపర్ బిల్టప్ ఏరియా 6

మొత్తం ల్యాండ్ ఏరియా
యూడీఎస్ = 1,000 6 2,400/4,000
యూడీఎస్ = ఒక్కో ఫ్లాట్ యూడీఎస్ 800 చ.అ.

కార్పెట్ ఏరియా
ఫ్లాట్‌లోని గోడలున్న స్థలం కాకుం డా నికరంగా మనం ఉపయోగించే స్థలాన్ని కార్పెట్ ఏరియా అంటా రు. అంటే ఫ్లాట్‌లో కార్పెట్ పరిచి ఉండే స్థలమన్నమాట.

బిల్టప్ ఏరియా
ఫ్లాట్‌లోని గోడలున్న స్థలాన్ని కూడా కలిపి బిల్టప్ ఏరియా అంటారు. అంటే కార్పెట్ ఏరియా కంటే 10-15 శాతం స్థలం ఎక్కువుంటుందన్నమాట.

సూపర్ బిల్టప్ ఏరియా
లాబీ, లిఫ్టు, మెట్లు, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, క్లబ్ హౌజ్ వంటి అన్ని రకాల వసతులకు కేటాయించే స్థలాన్ని మొత్తం కలిపి సూపర్ బిల్టప్ ఏరియా అంటారు.

ఫ్లాట్లు, ప్లాట్లు, లోన్లు, నిర్మాణాలు, న్యాయకోణాలు, పన్నులు, వాస్తు ఇలా స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.
realty@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement