యువకుడికి దేహశుద్ధి
నెల్లూరు (క్రైమ్) : కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ యువకుడు చిన్నారులపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన మాగుంట లేఅవుట్ వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి జరిగింది. దీంతో స్థానికులు ఆ యువకుడికి దేహశుద్ధి చేసి నాల్గోనగర పోలీసులకు అప్పగించారు. కొడవలూరు మండలం తలమంచికి చెందిన కె. అశోక్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. అతను మాగుంట లేఅవుట్‌లోని వెంకటేశ్వరస్వామి గుడికి వస్తూ సమీపంలోని అపార్ట్‌మెంట్ల వద్ద బయట ఆడుకుం టున్న చిన్నారులకు చాకెట్లు, బిస్కెట్లు ఇచ్చి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.
ఇటీవల అతని చేష్టలను గమనించిన స్థానికులు పట్టుకునేలోపే అశోక్ పరారయ్యాడు. శని వారం అశోక్ గుడి సమీపంలో ఉన్న బాలాజీ నిలయం వద్దకు వచ్చాడు. అపార్ట్‌మెంట్ బయట ఆడుకుం టున్న ఆరేళ్లు, ఏడేళ్లు వ యస్సు ఉన్న ఇద్దరు చిన్నారులుకు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని బాత్‌రూమ్ వద్దకు తీసుకెళ్లి వారిపై లైంగిక దాడికి యత్నించాడు. గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు కేకలు వేయడంతో అక్కడ నుంచి తప్పించుకున్నాడు.
ఈ క్రమంలో తాను తీసుకువచ్చిన బైక్‌ను మరి చిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బైక్ కోసం రాగా స్థానికులు కాపు కాసి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు తన తండ్రి శ్రీనివాసులు సొసైటీ అధ్యక్షుడని, తనపై చేయివేస్తే అంతు చూస్తామని బెది రించారు. దీంతో స్థానికులు అతన్ని నాల్గోనగర పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అశోక్ కుటుంబం నెల్లూరులోనే ఉంటున్నట్లు సమాచారం. గతంలోనూ అశోక్ ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేసి ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
చిన్నారులపై లైంగిక దాడికి యత్నం
Published Sun, Jun 26 2016 3:58 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM
Advertisement
Advertisement