వాషింగ్టన్: అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో.. భూమి లోపల, కప్బోర్టుల వెనక రహస్య గదులు ఉండే సన్నివేశాలను చాలానే చూశాం. కానీ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్‌మెంట్ బయటపడిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా.. కనీసం చూశారా.. లేదా ఇది చదవండి. ఇలాంటి సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. న్యూయార్క్‌కు చెందిన టిక్‌టాక్ యూజర్ సమంతా హార్ట్‌సో అనే మహిళ తన బాత్రూమ్ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్‌మెంట్‌ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేశారు. దీన్ని ఇప్పటికే 7 మిలియన్ల మంది చూశారు.
ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.. ‘‘గత కొద్ది రోజులుగా నా బాత్రూమ్‌లోకి చల్లటి గాలి వీస్తుంది. అక్కడ కిటికీ, వేరే కూలింగ్ పరికరాలు ఏం లేవు. ఎంత బలమైన గాలి అంటే అది నా జుట్టును వెనక్కి నెడుతుంది. ఈ గాలి ఎక్కడి నుంచి వీస్తుందా అని వెతకడం ప్రారంభించాను. ఈ క్రమంలో బాత్రూమ్ సింక్‌కు అతికించిన అద్దం వెనక నుంచి ఈ గాలి వస్తుందని అర్థం అయ్యింది. దాంతో అద్దం జరిపి చూశాను. అక్కడ పెద్ద రంధ్రం కనిపించింది. అసులు నా బాత్రూమ్ వెనక ఏం ఉందో తెలుసుకోవాలని భావించాను’’ అన్నారు.
బాత్రూమ్ వెనక ఏం ఉందో తెలుసుకోవడం కోసం అక్కడకు వెళ్లాలని భావించింది సమంతా. ఈ క్రమంలో ఫేస్‌మాస్క్ పెట్టుకుని.. చేతికి గ్లౌవుజులు ధరించి బయలు దేరడానికి సిద్ధమయ్యింది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తం చర్యగా ఓ సుత్తిని కూడా తనతో పాటు తీసుకెళ్లింది. ఆ తర్వాత బాత్రూమ్ వెనక తనకు కనిపించిన పెద్ద రంధ్రం గుండా లోపలికి ప్రవేశించింది. మొదట అదేదో సీక్రెట్ రూమ్‌గా భావించిన సమంతా ఆ తర్వాత అక్కడ మొత్తం అపార్ట్‌మెంట్‌ని చూసి షాకయ్యింది.
అపార్ట్‌మెంట్ చూసి ఆశ్యర్యంతో గట్టిగా కేకలు వేశారు సమంతా. ఇక ఆ అపార్ట్‌మెంట్ అంతా చెత్త బ్యాగులు.. వాడేసిన వాటర్ బాటిళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.. ‘‘లోపలికి అడుగుపెట్టిన నేను అక్కడ ఎవరైనా ఉంటారని భావించాను. కానీ అద్దం వెనక ఏకంగా అపార్ట్‌మెంట్ ఉండటం నిజంగా వింతే’’ అన్నారు.
చదవండి:
టిక్‌టాక్ ఛాలెంజ్‌లో అపశ్రుతి.. బాలిక మృతి
వైరల్: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి
Comments
Please login to add a commentAdd a comment