సుచిరిండియా ‘ది టేల్‌ ఆఫ్‌ గ్రీక్‌’ | Actress Samantha Akkineni Launches The Tales of Greek Luxury Suits by Suchir India | Sakshi
Sakshi News home page

సుచిరిండియా ‘ది టేల్‌ ఆఫ్‌ గ్రీక్‌’

Published Tue, Aug 17 2021 1:02 AM | Last Updated on Tue, Aug 17 2021 1:02 AM

Actress Samantha Akkineni Launches The Tales of Greek Luxury Suits by Suchir India - Sakshi

ప్రాజెక్ట్‌ను లాంచ్‌ చేస్తున్న సమంతా, కిరణ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్, హాస్పిటాలిటీ కంపెనీ సుచిరిండియా ‘ది టేల్‌ ఆఫ్‌ గ్రీక్‌’ పేరిట లగ్జరీ, స్టూడియో అపార్ట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను హీరోయిన్‌ సమంతా అక్కినేని లాంఛనంగా ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. శంషాబాద్‌లో 2.55 ఎకరాలలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో 6 లక్షల చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాలో మొత్తం 398 గృహాలుంటాంటాయని సుచిరిండియా చైర్మన్‌ డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు. 800–945 చదరపు అడుగుల మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. మూడంతస్తులలో క్లబ్‌ హౌస్‌తో పాటు స్విమ్మింగ్‌ పూల్, జిమ్, చిల్ట్రన్స్‌ ప్లే ఏరియా, ఫార్మసీ వంటి వసతులుంటా యి. బెంగళూరు హైవేలోని కొత్తూరులో గిజాపొలీస్, అల్వాల్‌లో ఆర్యవర్త నగరి ప్రాజెక్ట్‌లను నిర్మి స్తుంది. మరొక 12 ప్రాజెక్ట్‌లు పైప్‌లైన్‌లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement