సిడ్నీ : ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన శైలిలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటారు. అలాగే ప్రతి గదిని ప్రత్యేకంగా కట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంటిని వినూత్నంగా నిర్మించాడు. కిచెన్‌లో గోడలు లేకుండా బాత్‌రూమ్‌ను నిర్మించుకున్నాడు. ఈ వింత నిర్మాణం ఆస్ట్రేలియాలో జరిగింది. సాధారణంగా సిడ్నీ నగరం ఖరీదైన రియల్ ఎస్టేట్‌కు మారుపేరు. అక్కడ స్థలాన్ని ఆదా చేసేలా భవనాలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం ఉంటుంది. కానీ సర్రిహిల్స్‌లో అపార్ట్‌మెంట్‌లో మాత్రం ఇంటిని వినూత్నంగా కట్టించాడు. వంట గదిలో గోడలు లేకుండా గాజు గ్లాస్‌తో బాత్‌రూమ్‌ను(టాయిలెట్, షవర్) నిర్మించారు. ఇక వంటగదిని బాత్‌రూమ్‌ను కేవలం గాజు గ్లాస్ మాత్రమే వేరుచేస్తుంది. ఇటాలియన్ డిజైనర్ ‘మాడ్రన్ కిచెన్’గా రూపొందించిన ఈ ఫ్లాట్‌ను ప్రస్తుతం అద్దెకు పెట్టారు. ఒకవేళ ఇది ఎవరికైనా నచ్చితే వారానికి దాదాపు రూ.18 వేల చెల్లించి అద్దెకు ఉండొచ్చు. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ )
అయితే దీనికి సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇవి చూసిన నెటిజన్లు ‘టాయిలెట్ ఇన్ ది కిచెన్ లే అవుట్’ భయంకరంగా ఉందంటున్నారు. బాత్‌రూమ్ ఎవరికైనా వ్యక్తిగత ప్రదేశమని, అయితే కిచెన్‌లో బాత్‌రూమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర్మించిన వారిని, ఇంటి యాజమానిని జైలులో వేయాలని మండిపడుతున్నారు. కాగా ఈ ఇంటిపై అనేక ప్రతికూల కామెంట్లు వచ్చినప్పటికీ దీనిపై యాజమాని మాట్లాడుతూ.. ఈ ఇంటిపై అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. ఒంటరి వ్యక్తులు, ప్రేమికులు, ఇద్దరు అబ్బాయిలు వంటి వారు అపార్ట్‌మెంట్ను అద్దెకు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. (వినూత్నం: గోడలు లేని బాత్‌రూమ్)
Comments
Please login to add a commentAdd a comment