దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అద్దె ఇంటి బాధలు అందరివీ ఒకటే. ఇక ఖరీదైన ఏరియాలో అద్దె ఇల్లు అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఈ కష్టాల కత వేరే ఉంటది. కానీ ఖరీదైన బాల్కనీ అద్దె గురించి ఎపుడైనా విన్నారా? ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పట్టుమని పది అడుగులు కూడా ఉండని ఒక బాల్కనీ అద్దె వింటే షాకవ్వాల్సిందే. స్టోరీ ఏంటంటే..
ఒక విచిత్రమైన ఫేస్‌బుక్ ప్రకటన ఇది. సిడ్నీలోని ఒక ఇంట్లో ఒక బాల్కనీ అద్దెకు ఉందని ఒక యజమాని ప్రకటించాడు. ఒక మనిషికి ఉండేందుకు అవకాశం. దీని అద్దె నెలకు 969 డాలర్లు (రూ. 81,003)అంటూ ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ లిస్టింగ్‌లో వెల్లడించాడు. ఇందులో బెడ్, అద్దం కూడా ఉంటుంది. మంచి వెలుతురు, ఎటాచ్డ్‌గా ఉన్న గదిలోపల బాత్రూమ్ వాడుకోవచ్చని, ఇక కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అదనమని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.
దీంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందించారు. బాల్కనీకి ఇంత అద్దా? ఈ బాల్కనీని ఎంచుకునే వాళ్లుంటారా అని మరొకరు వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవలికాలంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గృహాల అద్దె ధరలలో గణనీయమైన పెరుగుదల నమోద వుతోంది. తాజా లెక్కల ప్రకారం 2024 జూన్ త్రైమాసికంలో సిడ్నీ సగటు అద్దె వారానికి 750 డాలర్ల మేర రికార్డు స్థాయిలో ఉంది.అద్దె ఇళ్లకు పోటీ నేపత్యంలో ఆక్షన్ ద్వారా అద్దెను కేటయిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment