‘ఛీ.. మేం కాపురం చేయలేం.. తీసేయండి’ | Trump's name to be removed from 3 New York buildings | Sakshi
Sakshi News home page

‘ఛీ.. మేం కాపురం చేయలేం.. తీసేయండి’

Published Thu, Nov 17 2016 8:31 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

‘ఛీ.. మేం కాపురం చేయలేం.. తీసేయండి’ - Sakshi

‘ఛీ.. మేం కాపురం చేయలేం.. తీసేయండి’

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైనప్పటికీ డోనాల్డ్ ట్రంప్కు కొంతమంది అమెరికా ప్రజల నుంచి అవమానం తప్పడం లేదు.

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైనప్పటికీ డోనాల్డ్ ట్రంప్కు కొంతమంది అమెరికా ప్రజల నుంచి అవమానం తప్పడం లేదు. ఆయన పేరు ఉన్న నివాసాల్లో తాము ఉండలేమని, ఆ పేరైనా తీసేయాలని లేదంటే మరో ఇళ్లయినా ఇవ్వాలని న్యూయార్క్ నగరంలోని పలు చోట్ల కొందరు నివాసులు డిమాండ్ చేశారు. దీంతో ఓ మూడు బహుళ అంతస్తులకు ఉన్న ట్రంప్ ప్లేస్ అనే పేరును తొలగించేందుకు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మొత్తం 1,325మంది ఉండగా వారిలో దాదాపు 669మందికి పైగా ట్రంప్ పేరు వాటికి ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఆన్ లైన్ లో పిటిషన్ వేశారు.

దీంతో మన్ హట్టన్ లోని హడ్సన్ నదీ ఒడ్డున ఉన్న భారీ అంతస్తులకు బంగారు అక్షరాలతో అమర్చిన ట్రంప్ ప్లేస్ అనే పేరును తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ కు మహిళలంటే గౌరవం లేదని, ఆయన వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారని, కన్న కూతురుని కూడా తక్కువ చేసి మాట్లాడాడంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వీడియోలు లీకులు చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత మహిళలపై ఇంతటి చిన్నచూపు ఉన్న ట్రంప్ పేరిట ఉన్న ఈ నివాసాల్లో తాము కాపురం చేయలేమంటూ అక్టోబర్ లోనే వారు ఆందోళన మొదలుపెట్టారు. చివరకు పేర్లు మార్చేందుకు నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement