కలకలం రేపిన ట్రంప్ విగ్రహం! | unimpressed Naked Trump statue in New York | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన ట్రంప్ విగ్రహం!

Published Fri, Aug 19 2016 10:21 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

కలకలం రేపిన ట్రంప్ విగ్రహం! - Sakshi

కలకలం రేపిన ట్రంప్ విగ్రహం!

డొనాల్డ్ ట్రంప్ విగ్రహం ఒకటి కలకలం రేపింది.

న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహం ఒకటి న్యూయార్క్‌లో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిన ఈ ట్రంప్ నగ్న విగ్రహాన్ని చూసి జనం బిత్తరపోయారు. కొందరు మాత్రం ఎప్పటిలాగే ఫోన్లు తీసి విగ్రహంతో సెల్ఫీల పనిలో పడ్డారు. ఉదయాన్నే ఆ మార్గం గుండా వెళ్తూ.. బెల్లీ ఫ్యాట్, ఎల్లో హెయిర్‌తో కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని చూసిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు.

కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తన వెబ్‌సైట్‌లో ట్రంప్ విగ్రహ తయారీకి సంబంధించిన వీడియోను ఉంచింది. అయితే ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం సీరియస్‌గా ఉన్నారు. న్యూయార్క్ నగరంలోని సిటీ స్క్వేర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అధికారులు వెంటనే తొలగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement