ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు హెచ్చరిక
9 వేల డాలర్ల జరిమానా
న్యూయార్క్: హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్‌కు కోర్టు గట్టి వార్వింగిచ్చింది. తాము ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులను 9 పర్యాయాలు ఉల్లంఘించినందుకు 9 వేల డాలర్ల జరిమానా విధించింది. సాక్షులు, జడ్జీలతోపాటు ఈ కేసుకు సంబంధించి మరికొందరిపై మరోసారి ఇలా వ్యాఖ్యలు చేస్తే జైలుకు పంపక తప్పదని హెచ్చరించింది.
న్యూయార్క్ జడ్జి జువాన్ ఎం మెర్చన్ ఈ మేరకు తీర్పు చదువుతున్న సమయంలో ట్రంప్ తలదించుకుని నేల చూపులు చూస్తూ ఉండిపోవడం గమనార్హం. శుక్రవారం కల్లా జరిమానా చెల్లించాలని, ట్రంప్ సొంత ‘ట్రూత్ సోషల్’వేదికపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించారు. గ్యాగ్ ఉత్తర్వుపై ట్రంప్ మరో ఉల్లంఘన ఆరోపణలపై గురువారం విచారణ జరగనుంది. ఓ∙పోర్న్ నటితో బంధం బయటికి పొక్కనివ్వరాదంటూ ఆమెకు మాజీ లాయర్ ద్వారా డబ్బులు ముట్టజెప్పిన ఆరోపణలపై కోర్టు విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment