న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బ్రాంక్స్ బరోలిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న మరో 12 మందిని అగ్నిమాపక అధికారులు రక్షించారు. 160 ఫైరింజన్లు.. అపార్ట్‌మెంట్‌లోని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మృతిచెందిన వారిలో ఏడాదిన్నర పసిపాప ఉన్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ డే చెప్పారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా.. అమెరికా ఆర్థిక రాజధానిలో ఈ అపార్ట్‌మెంట్ టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అపార్ట్‌మెంట్‌లో మంటలు ఎలా వ్యాపించాయన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగింది. మంటలు వ్యాపించిన సమయంలో స్థానికులు గట్టిగా కేకలేశారని..అందువల్ల కొంత ప్రాణనష్టం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. పై అంతస్తుల్లో ఉన్నవారు.. బయటకు వచ్చేలోపే.. మంటలు, పొగ విస్తరించడంతో.. బయటకు రాలేకపోయారని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment