న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం హార్లెమ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఎగిసిపడ్డ మంటల్లో భారత్‌కు చెందిన యువకుడు ఫజిల్ ఖాన్(27) మృతి చెందాడు. చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటరే మంటలకు కారణమని అధికారులు తెలిపారు. మంటల్లో గాయాలపాలైన ఫజల్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొలంబియా జర్నలిజం స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఫజల్‌ఖాన్ మృతి పట్ల న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.
ఫజల్‌ఖాన్ తల్లిదండ్రులను సంప్రదించామని, అతడి మృతదేహాన్ని భారత్ పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. మంటలు తొలుత పై అంతస్తుల్లో ప్రారంభమయ్యాయని, దీంతో అపార్ట్‌మెంట్‌లో పై అంతస్తుల్లో ఉన్నవారు కిటికీల్లో నుంచి దూకారని అఖిల్ జోన్స్ అనే స్థానికుడు తెలిపాడు. తాను, తన తండ్రి ప్రమాదం నుంచి తప్పించుకున్నామన్నాడు. ఫోన్, తాళాలు తప్ప తాము తమ వెంట ఏమీ తెచ్చుకోలేదని చెప్పాడు. అగ్ని ప్రమాదం కారణంగా అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి.. పుతిన్ ప్రత్యర్థి హత్య.. వెలుగులోకి సంచలన విషయం
Comments
Please login to add a commentAdd a comment