
సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
న్యూయార్క్:అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ వెస్ట్ బ్రోంక్స్‌లోని 19 అంతస్తుల అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులతో పాటు 19 మంది మృతి చెందారు. 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ స్పందిస్తూ.. గత 30 ఏళ్లలో నగరంలో అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదమని తెలిపారు. అపార్టుమెంట్‌లోని ప్రతి అంతస్తులోనూ బాధితులు ఉన్నారని చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది. చెలరేగిన దట్టమైన పొగ పీల్చడం వల్ల చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
చదవండి: డ్రైవర్ అక్కర్లేని ట్రాక్టర్
Comments
Please login to add a commentAdd a comment