సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించి సామాన్యుల సొంతింటి కలను నిజం చేస్తున్న ఆర్క్ గ్రూప్.. ఆదిభట్లలో 2.80 లక్షల చ.అ.ల్లో అపార్ట్‌మెంట్‌ను నిర్మించనుంది. సూర్యాపేటలో 2 వేల గజాల్లో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తోంది. 40 ఫ్లాట్లుండే ఈ ప్రాజెక్ట్‌ను 2 నెలల్లో ప్రారంభిస్తామని ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు.
►కర్మన్‌ఘాట్‌లో 92 వేల చ.అ.ల్లో ఆప్తా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. 70 యూనిట్లు. కొంగరకలాన్‌లో లే అవుట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. గాజులరామారంలోని ఉషాముళ్లపూడి రోడ్‌లో 1.45 లక్షల చ.అ.ల్లో హేమ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 7 అంతస్తుల్లో మొత్తం 108 గృహాలుంటాయి. 1000 నుంచి 1700 చ.అ.ల్లో 2, 2.5 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3900. ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.
► బొల్లారంలో ఆర్క్ హోమ్స్ ఫేజ్–2ను ప్రారంభించనున్నాం. మొత్తం 560 గృహాల ప్రాజెక్ట్ ఇది. ఫేజ్–1లో 420 ఫ్లాట్లను నిర్మించేశాం. 24 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల వసతుల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కొనుగోలుదారులు నివాసముంటున్నారు కూడా. ఫేజ్–2లో 140 గృహాలను నిర్మించనున్నాం. 1075–1510 చ.అ.ల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3700.
ఆదిభట్లలో ఆర్క్ ప్రాజెక్ట్
Published Sat, May 18 2019 12:03 AM | Last Updated on Sat, May 18 2019 12:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment