
రూ. 34 కోట్లతో ఇల్లు కొన్న కోహ్లి
విరాట్ కోహ్లి ముంబైలో ఒక ‘ఇంటి’వాడయ్యాడు. ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన వర్లీలో అతను 7,171 గజాల ఫ్లాట్ కొన్నాడు.
ముంబై: విరాట్ కోహ్లి ముంబైలో ఒక ‘ఇంటి’వాడయ్యాడు. ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన వర్లీలో అతను 7,171 గజాల ఫ్లాట్ కొన్నాడు. దీని విలువ ఏకంగా రూ. 34 కోట్లు కావడం విశేషం. అరేబియా సముద్రానికి ఎదురుగా విలాసవంతమైన ఈ ఫ్లాట్... ఒక రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లోని 35వ అంతస్తులో ఉంది. ఇదే భవనంలోని 29వ అంతస్తులో యువరాజ్ సింగ్‌కు కూడా ఫ్లాట్ ఉంది.