Ram Reddy
-
కేడీసీసీబీ చైర్మన్‌గా మాధవరం రామిరెడ్డి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లకు ప్రభుత్వం ఏడుగురు సభ్యుల నాన్ అఫీషియల్ కమిటీలను ఖరారు చేసింది. మంత్రాలయం మండలం మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) సభ్యుడిగా ఉన్న బీసీ నేత మాధవరం రామిరెడ్డిని కేడీసీసీబీ చైర్మన్‌గా, గోస్పాడు మండలం దీబగుంట్ల సొసైటీ త్రీమెన్ కమిటీ చైర్మన్ అయిన పీపీ నాగిరెడ్డిని డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎంపిక చేసింది. వాస్తవానికి జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఏడుగురు సభ్యుల కమిటీ సోమవారమే పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు ఒకట్రెండు రోజులు పట్టే అవకాశముంది. అంతవరకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. వాల్మీకి నేత రామిరెడ్డి కేడీసీసీబీ చైర్మన్‌గా ఎంపికైన మాధవరం రామిరెడ్డి బీసీ సామాజిక వర్గ (వాల్మీకి) నేత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి పదవుల్లోనే కాదు.. నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకు పెద్దపీట వేశారనే విషయం రామిరెడ్డి నియామకంతో స్పష్టమవుతోంది. రామిరెడ్డికి మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మంచి నేతగా గుర్తింపు ఉంది. మాధవరం గ్రామానికి చెందిన ఈయనకు ఊరిపేరే ఇంటిపేరుగా స్థిరపడింది. ఈయన గతంలో రెండు సార్లు మంత్రాలయం ఎంపీపీగా పనిచేశారు. నిజాయితీ కల్గిన నేత పీపీ నాగిరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎంపికైన పీపీ నాగిరెడ్డికి నిజాయితీ కల్గిన నేతగా గుర్తింపు ఉంది. ఈయన 2013 నుంచి డీసీఎంఎస్ చైర్మన్‌గా కొనసాగుతూ... మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షులుగానూ ఉన్నారు. గతంలో ఈయన నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్‌గా, జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్‌గానూ సమర్థవంతంగా పనిచేశారు. డీసీసీబీ నాన్ అఫీషియల్ కమిటీ చైర్మన్‌గా మాధవరం రామిరెడ్డి ఎంపిక కాగా..సభ్యులుగా అహోబిలం లక్ష్మీనరసింహ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు నాసరి వెంకటేశ్వర్లు, నందవరం మండలం ముగితి గ్రామానికి చెందిన విరూపాక్షిరెడ్డి (ఈయన నందివరం సొసైటీలో సభ్యుడు), దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన దాసరి లుమాంబ (దేవనకొండ సొసైటీ సభ్యుడు), వెలుగోడు మండలం రేగడగూడూరు సొసైటీలో సభ్యురాలైన వెంకటేశ్వరమ్మ, సంజామల సొసైటీ త్రీమెన్ కమిటీ చైర్మన్ అయిన గుండం సూర్యప్రకాశ్‌రెడ్డి, కల్లూరు మండలం ఉలిందకొండ సొసైటీ సభ్యుడైన కె.వెంకటరమణారెడ్డి ఎంపికయ్యారు. డీసీఎంఎస్ కమిటీ చైర్మన్‌గా పీపీ నాగిరెడ్డి, సభ్యులుగా కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన కే.వంశీధర్‌రెడ్డి, మహానంది మండలం గాజులపల్లికి చెందిన కె.రామకృష్ణ, డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన డి.వెంకటసుబ్బమ్మ, పెద్దతుంబళం గ్రామానికి చెందిన సుబాన్‌బాష, మద్దూరుగ్రామానికి చెందిన వి.దేవభూషణం. డీసీఎంఎస్‌కు ఖరారు చేసిన కమిటీ ఈ నెల 15న బాధ్యతలు చేపట్టనుంది. -
తెలంగాణ రాంరెడ్డి కన్నుమూత
మన్సూరాబాద్: శతాధిక వృద్ధుడు తెలంగాణ రాంరెడ్డి (101) (గుండా రాంరెడ్డి) మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ తాలుకా గుండ్లపల్లి గ్రామంలో 1919లో రాంరెడ్డి గుండా నర్సిరెడ్డి–అచ్చమ్మలకు మూడవ సంతానంగా జన్మించారు. బీఎస్సీ పూర్తి చేసిన అతను 1945లో కొడంగల్ తాలుకాలో కార్పొరేషన్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. 1949లో హైదరాబాద్ కార్పొరేషన్ ఆఫీసర్‌గా 1951–54 వరకు డిస్ట్రిక్ కార్పొరేషన్ ఆఫీసర్‌గా, 1954 –56 వరకు మహబూబ్‌నగర్‌లో సెల్స్ ట్యాక్స్ ఆఫీసర్‌గా 1957–58 వరకు హైదరాబాద్ సీటీఓగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు నిరసనగా 1958లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తన ఇంటి పేరును తెలంగాణ రాంరెడ్డిగా మార్చుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వరంగల్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మాజీ ప్రధాని పీపీ నర్సింహ్మారావు ఆయనకు సహాధ్యాయి. 1968 తెలంగాణ ఉద్యమ సమయంలో నల్లగొడ జిల్లాలో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 1971లో అప్పటి ముఖ్యమంత్రి పీవీ కౌన్సిల్హాల్లో అతడిని కలిసిన సమయంలో ‘ఏమి రాంరెడ్డి నీకు ఇంకా తెలంగాణ పిచ్చి పోలేదా’ అని ప్రశ్నించడంతో..మీరు చూస్తారో లేదో కాని నేను తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తానని సమాధాన మిచ్చారు. 2013లో ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ కాగానే ఆయన మట్టపల్లి నర్సింహ్మస్వామిని దర్శించుకుని, తన 55 ఏళ్ల కల నిజమైందని ఆనందించారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల చెక్కుతో రాంరెడ్డిని సన్మానించింది. 10న అంత్యక్రియలు తెలంగాణ (గుండా) రాంరెడ్డి అస్వస్తతతో సోమవారం రాత్రి మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఆయన నాగోలు డివిజన్ పరిధిలోని సాయిసప్తగిరికాలనీలో ఉ ంటున్న తన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి వద్ద ఉంటున్నాడు. ఇటీవల అమెరికా వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి 9న నగరానికి వస్తుండటంతో అప్పటి వరకు మృతదేహాన్ని ఎల్బీనగర్లోకి కామినేని ఆసుపత్రిలో భద్రపరిచారు. 10న నాగోలులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. రాంరెడ్డి మృతి వార్త తెలియగానే కాలనీవాసులు మురళీకృష్ణ, వైఎల్‌ఎన్‌రెడ్డి, శంకర్, మహేందర్‌రెడ్డి, జగన్ యశోద ఆసుపత్రికి వెళ్లి రాంరెడ్డికి నివాళులర్పించారు. రాంరెడ్డి మరణం తీరనిలోటు: గోనారెడ్డి సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు జి.రాంరెడ్డి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని జూనియర్ లెక్చరర్ల సంఘం మాజీ అధ్యక్షుడు గోనారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
రెరాతో రేట్లు పెరగవు!
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో ప్రాపర్టీ ధరలు పెరగవు. ఇదొక నియంత్రణ సంస్థ మాత్రమే. ఇందులోని నిబంధనలతో డెవలపర్లలో క్రమశిక్షణ అలవడుతుంది. నాణ్యమైన ఉత్పత్తుల వాడకంతో క్వాలిటీ నిర్మాణాలుంటాయి. పైగా నిబంధనల అతిక్రమణ, నిధుల మళ్లింపు వంటివేవీ లేకుండా నిర్మాణాలు గడువులోగా పూర్తవుతాయని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్. రాంరెడ్డి తెలిపారు. ♦ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కారణంగా స్థిరాస్తి ధరలు పెరిగే అవకాశముంది. సిమెంట్, ఇనుము, రంగులు, టైల్స్ వంటి నిర్మాణ సామగ్రిపై పన్నులు గతంలో కంటే జీఎస్టీలో అధికంగా కేటాయించారు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఫలితంగా చ.అ. ధరలూ పెరుగుతాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్లకు జీఎస్టీని 12 శాతంగా కేటాయించారు. దీన్ని 5 శాతానికి తగ్గించాల్సిన అవసరముంది. ♦ 2008–09లో నగరంలో ఎంతైతే ధరలున్నాయో 2018లోనూ అవే ధరలున్నాయి. కానీ, స్థలాలు, నిర్మాణ సామగ్రి ధరలు కార్మికుల వేతనాలు, అనుమతులు, పన్నులు ఇతరత్రా ఖర్చు లు మాత్రం ఐదింతలు పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుం చి సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో 20% ధరలు పెరిగాయి. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 10–15% వరకు ధరలు పెరుగుతాయి. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కంటే కొత్తగా వచ్చే ప్రాజెక్ట్‌ల్లోనే చ.అ. ధరలు పెరుగుతాయి. ♦ఇన్వెస్టర్లయినా, సామాన్య, మధ్యతరగతి ప్రజలైనా సరే ముందుగా కొనుగోలు చేసేది స్థలాలే. అందుకే అభి వృద్ధి తాలూకు పరిస్థితులు కనిపించగానే ముందుగా పెరిగేవి స్థలాల ధరలే. తర్వాతే నివాస సముదాయాల ధరలు పెరుగుతాయి. హైదరాబాద్‌లో స్థలాల ధరలు పెరిగేందుకు ప్రధాన కారణం.. మౌలిక వసతుల అభివృద్ధి, మెట్రో రైల్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ల అభివృద్ధి. ♦ వచ్చే రెండేళ్లలో నగరంలో 9 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. దీన్లో సుమారు కొత్తగా లక్ష ఉద్యోగాలొస్తాయి. రియల్టీ పరిభాషలో 1 నాణ్యమైన ఉద్యోగి వస్తే దానికి అనుబంధంగా 7–8 ఉద్యోగ అవకాశాలొస్తాయి. దోబీ, డ్రైవర్, అడ్మినిస్ట్రేషన్ స్టాప్ వంటివాళ్లన్నమాట. వీళ్లందరికీ కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా ఇళ్లు కావాలి. అంటే వచ్చే రెండేళ్లలో 4–5 లక్షల ఇళ్లకు డిమాండ్ ఉంటుందని అంచనా. రూ.40 లక్షల్లోపూ అందుబాటు గృహాలే.. రూ.40 లక్షల లోపు ధర ఉండే గృహాలన్నీ అందుబాటు గృహాల పరిధిలోకే వస్తాయి. ఈ తరహా ఇళ్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉం టుందని, ప్రతికూల సమయంలోనూ అమ్మకాలుంటాయి. నగరం లో అనుమతులొచ్చి నిర్మాణంలో ఉన్న గృహాలు సుమారు 45–50 వేల యూనిట్లుంటాయి. వీటిల్లో 50% గృహాలు రూ.40 లక్షల్లోపే. ♦ అమ్ముడుపోకుండా ఇన్వెంటరీ పెరగడానికి కారణం జాయింట్ డెవలప్మెంట్ వెంచర్లే. జేవీ ప్రాజెక్ట్‌లో డెవలపర్ తాలూకు ఫ్లాట్లను విక్రయించేస్తాడు. కానీ, ల్యాండ్ ఓనర్ తాలూకు ఫ్లాట్లలో 30–35% మాత్రమే విక్రయించేస్తాడు. మిగిలిన వాటిని భవిష్యత్తు అవసరాల కోసం తన వద్దే ఉంచుకుంటాడు. -
వైఎస్సార్సీపీలోకి డాక్టర్ రామిరెడ్డి, పేరా సోదరులు
కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జి పేరా రామసుబ్బారెడ్డి, ఆయన సోదరుడు వెంకటసుబ్బారెడ్డితో పాటు వారి కుమారులు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, నారాయణరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రసాదరెడ్డిలు శనివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. డాక్టర్ రామిరెడ్డి 30 ఏళ్లుగా టీడీపీకి సేవలందించారు. అయితే ఆయన సేవలను ఆ పార్టీ గుర్తించకపోగా అడుగడుగునా అవమానాలకు గురిచేయడంతో ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శనివారం కోవెలకుంట్లకు రావడంతో పేరా సోదరులు, రామిరెడ్డితో పాటు, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్, గిరిజన యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసనాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కుమారి, రామిరెడ్డి ముఖ్య అనుచరులు నాగభూషణంరెడ్డి, నాగేష్ తదితరులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్థన్‌రెడ్డి తదితరులున్నారు. -
కాల్‌డేటా పట్టించింది
► మానమ్మ హత్యకేసును ఛేదించిన పోలీసులు ► నగల కోసమే బీరు బాటిల్‌తో పొడిచి హత్య కొందుర్గు: మానమ్మను హత్యచేసిన నిందితుడిని ఫోన్ డేటా ఆధారంగా గుర్తించిన పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 21న మంగన్నగారి మానమ్మ(45) మృతిచెందగా పర్వతాపూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు షాద్‌నగర్ రూరల్ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం... పర్వతాపూర్ గ్రామానికి చెందిన మంగన్నగారి మానమ్మ, అదే గ్రామానికి చెందిన కొంగ రామ్‌రెడ్డి(25) పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా రామ్‌రెడ్డి కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ నెల 19న సాయంత్రం మానమ్మ కొందుర్గు స్వామి వద్దకు వెళ్లొస్తానని ఇంటి నుంచి బయలుదేరింది. ఇరువురు కలిసి కొందుర్గుకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి, ఓ కల్లు ప్యాకెట్, బీరుబాటిల్ వెంటతెచ్చుకున్నారు. ఇంటికి తిరిగి వస్తూ పర్వతాపూర్ శివారులో కూర్చొని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న మానమ్మ ఒంటిపై బంగారు పుస్తెలతాడు, కమ్మలు, వెండి పట్టీలు ఉండటంతో ఆ భరణాలపై ఆశపడ్డ రామ్‌రెడ్డి బీరు బాటిల్ పగలగొట్టి మానమ్మ కడుపులో పొడిచాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను లాక్కున్నాడు. మాన మ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగానే ఆమెను ఎత్తుకొని గ్రామశివారులోని పాడుబడి న బావిలో పడేశాడు. కాల్ డేటాతో నిందితుడి గుర్తింపు మానమ్మ ఫోన్ కాల్స్ డాటా ఆధారంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గురుప్రసాద్, కృష్ణ నింది తుడి ఆధారాలు సేకరిస్తుండగా తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న రామ్‌రెడ్డి సోమవారం గ్రామ రెవెన్యూ అధికారిణి జయమ్మ ఎదుట లొంగిపోయాడు. దీంతో జయమ్మ నిందితుడిని పోలీసులకు అప్పగించా రు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, లింగం పాల్గొన్నారు. -
అమెరికాలో బిక్కు బిక్కు
► వరుస ఘటనలతో బెంబేలెతుత్తున్న ‘మనోళ్లు' ► ఆందోళనలో బాధిత కుటుంబీకులు ► ఫోన్ లో క్షేమసమాచారం తెలుసుకుంటున్న వైనం దాడులు అమానుషం.. ఎదులాపురం : అమెరికాలో మా మనవడు, మనవరాలు కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇటీవల ట్రంప్ విధానాలు చూసి భయందోళనకు గురవుతున్నారు. భారతీయుల్లో ప్రతిభ ఉంటేనే అమెరికాలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. అమెరికాలో ఉన్న ఎంతోమంది భారతీ యులు అమెరికా అభివృద్ధికి తో డ్పడుతున్నారు. అలాంటిది జాతి వివక్షతో దాడులు చేస్తున్నా పట్టిం చుకోకపోవడం సరైంది కాదు. అమెరికాలో ప్రతిభావంతులు లేకపోవడంతోనే మన దేశ పౌరులు అక్కడ ప్రతిభ కనబరుస్తున్నారు. – రాంరెడ్డి, భుక్తాపూర్ ఆదిలాబాద్ : అమెరికాలోని కాన్సర్‌లో బుధవారం హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను ఆ దేశపౌరుడు జాతి వివక్షతో కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్న సంఘటన ఇక్కడి వారిని కలవర పెడుతోంది. అమెరికాలో మనోళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులతో జిల్లా నుంచి అమెరికాలో ఉంటున్న వారి గురించి ఇక్కడి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలని, బయటకు ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఫోన్ లో మాట్లాడి భయందోళనకు గురికావద్దంటూ ధైర్యం చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఈ దాడులు మరింత పెరిగిపోయాయి. ట్రంప్ పాలసీతో భారతీయులకు అమెరికాలో రక్షణ లేకుండా పోతోంది. మత, జాతి, వివక్ష, వలస జీవులపై వ్యతిరేకతతో విద్వేష పూరిత దాడులు జరుగుతున్నాయి. ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ.. వలస జీవులు వెళ్లిపోవాలంటూ దాడులు, కాల్పులకు పాల్పడుతుండడంతో అమెరికాలో భారతీయులు భయంభయంగా ఉంటున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకుండా అక్కడి అమెరికా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. -
దామోదర్ కృషితోనే తెలంగాణ
మునిపల్లి: మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కృషితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నారంటే సోనియాగాంధీ, రాహుల గాంధీ పుణ్యమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాగాంధీ జన్మదినాన్ని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సి ఉండగా కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కనిపించడం లేదన్నారు. రైతులకు పంట నష్టం మంజూరు చేయడం లేదన్నారు. రైతులకు రుణమాఫీని ఒకేసారి అమలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సమావేశంలో సదాశివపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, పిల్లోడి సర్పంచ్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రాల్లో బడా ప్రాజెక్ట్‌లు!
సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల్లోనూ గేటెడ్ కమ్యూనిటీ, విల్లాల సంస్కృతి విస్తరించింది. అందుకే సూర్యాపేటలో ఓ అపార్ట్‌మెంట్‌ను నిర్మించాలని నిర్ణయించామని.. స్థల సేకరణ కోసం చూస్తున్నామని రాంరెడ్డి పేర్కొన్నారు. ♦ టెర్మినల్స్ ఇన్ఫ్రాతో కలిసి కొండాపూర్‌లో జాయింట్ వెంచర్ చేస్తున్నాం. ఎకరం విస్తీర్ణంలో హ్యాంటన్స్ పేరిట ఎక్స్‌క్లూజివ్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. 9 అంతస్తుల్లో మొత్తం 68 ఫ్లాట్లొస్తాయి. ధర చ.అ.కు రూ.4,500. టై స్విమ్మింగ్ పూల్, గార్డెన్, క్లబ్ హౌజ్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులూ ఉంటాయి. 2018 మార్చిలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ♦ కూకట్పల్లి నుంచి గాజులరామారం వెళ్లే మార్గంలో ఎకరన్నర విస్తీర్ణంలో ఏఆర్కే హేమ ప్రాజెక్ట్ రానుంది. జనవరిలో ప్రారంభించనున్న ఈ అపార్ట్మెంట్లో మొత్తం 108 ఫ్లాట్లుంటాయి. 1,050-1,700 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ♦ ఎల్బీనగర్లో ఎకరం విస్తీర్ణంలో మరో ప్రాజెక్ట్ రానుంది. దీన్ని మార్చిలో ప్రారంభించనున్నాం. ఇందులో మొత్తం 80 ఫ్లాట్లు. 1,075-1,700 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. భువనగిరిలో 1,200 గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నాం. ♦ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెండున్నర ఎకరాల్లో క్లౌడ్ సిటీ పేరిట ఆటోమేటెడ్ హోమ్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 165 ఫ్లాట్లొస్తాయి. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతి ఫ్లాట్‌లోని లైట్లు, తలుపులు, గేట్లు అన్నీ ఆటోమేటెడ్‌గానే ఉంటాయి. ధర చ.అ.కు రూ.4 వేలు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 వింగ్స్‌లో పూర్తి చేస్తాం. తొలి 3 వింగ్స్‌ను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. -
ఇంటి యజమాని కన్నేశాడని..
ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత పై ఇంటి యజమాని కన్నేశాడు. ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు అదును చూసి ఆమె పై అత్యాచారయత్నం చేశాడు. దీంతో కేకలు వేసి అక్కడి నుంచి పరారైన మహిళ అనంతరం.. ఇరుగు పొరుగుల సూటి పోటి మాటలు తట్టుకోలేక.. మనసిక వేదనకు గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని నల్లబండ బజార్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సుబ్బరత్నాలు, ఈశ్వరమ్మ(24) దంపతులు కూలి పనులు చేసుకుంటూ.. మొద్దు రాంరెడ్డి(60) ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న రాంరెడ్డి ఈశ్వరమ్మపై కన్నేశాడు. గురువారం ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు లోపలికి వెళ్లి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో.. అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు వేసి పరుగులు తీసింది. అనంతరం గురువారం రాత్రి ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో స్థానికులు ఆమెను సూటి పోటి మాటలతో హింసించడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
అనుమానంతో భార్యను చంపిన వ్యక్తి అరెస్ట్
అనుమానం పెనుభూతమై భార్యను అంతమొందించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక బుద్ధిపోచమ్మ వీధికి చెందిన రాంరెడ్డి, సుజాత(45) భార్యాభర్తలు. ఉపాధి కొరకు ఇరాక్ వెళ్లిన రాంరెడ్డి ఈ మధ్యకాలంలో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో భార్య ఓ పత్రికా విలేకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించి ఆమెను అంతమొందించేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతు నులిమి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రాంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఏసీపీ దుర్మరణం
నల్గొండ : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మెడ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా... మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా... మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ... నాగార్జునాసాగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పంజాగుట్ట రిటైర్డ్ ఏసీపీ రాంరెడ్డి, కానిస్టేబుల్ సంజీవ్ మృతి చెందారు. స్థానికుల వెంటనే గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా కానిస్టేబుల్ తల్లి సంజీవ మృతి చెందింది. క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మృతులు చింతపల్లి మండలం వాజ్మేడు గ్రామానికి చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు. -
ఆస్తి కోసం ఉన్మాదం
తల్లి, భార్య, కూతురిని గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి బాలాపూర్‌లో ఘోరం హైదరాబాద్: ఆస్తిపై పెంచుకున్న మమకారం ముందు రక్త సంబంధం ఓడింది. ఈ క్రమంలోనే ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి తన తల్లి, భార్య, కూతురి గొంతుకోసి ముగ్గురినీ దారుణంగా హత్యచేశాడు. మరో కుమార్తె త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంత బాలాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు సంరెడ్డి బల్వంత్‌రెడ్డి, సుభద్ర(65) దంపతుల కుమారులు గోవింద్‌రెడ్డి, రాంరెడ్డి. 2013లో సాయినగర్‌లో నిర్మించిన కొత్త భవనంలోకి వీరంతా మకాం మార్చారు. మొదటి అంతస్తులో రాంరెడ్డి తన భార్య రాధిక (36), కుమార్తెలు ప్రత్యూష (16), అక్షయ (14)లతో నివాసముంటుండగా రెండో అంతస్తులో ఉంటున్న గోవింద్‌రెడ్డి తల్లిదండ్రులనూ తనవద్దే ఉంచుకున్నాడు. ఇల్లు నచ్చలేదంటూ... ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే రాంరెడ్డి తనకు ఇల్లు నచ్చడం లేదని, వేరే ఇల్లు కట్టుకుంటానంటూ అందరికీ తరచూ చెప్పేవాడు. వారు అతని ప్రతిపాదనను వ్యతిరేకించేవారు. ఇలా అతని ధోరణిలో మార్పు రాకపోవడంతో పాటు ఆస్తికోసం వేధింపులు పెరగడంతో తండ్రి బల్వంత్‌రెడ్డి తనకున్న ఆస్తులన్నింటినీ తన ఇరువురి కోడళ్ల పేరిట రాశాడు. ఇది వారి మధ్య విభేదాలను తీవ్రతరం చేశాయి. సొంత కుటుంబీకులూ అతని తీరును వ్యతిరేకించ డంతో అందరిపైనా రాంరెడ్డి కక్షపెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారు జామున 3.05 గంటలకు నిద్రపోతున్న భార్య రాధిక గొంతును కత్తితో కోసి చంపాడు. అదే విధంగా నిద్రలో ఉన్న తల్లినీ హత్య చేశాడు. ఆమె పక్కనే పడుకున్న కూతుళ్లు అక్షయ, ప్రత్యూషలు పరిస్థితిని గమనించి పారిపోయేందుకు యత్నించగా అక్షయను వెంబడించి వంటగదిలో అంతమొందించాడు. ప్రత్యూష మాత్రం బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకుని కేకలు వేసింది. దీంతో అదే ఇంట్లో పై పోర్షన్లో ఉన్న గోవింద్ కిందికి రాగానే రాంరెడ్డి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఏసీపీ సుదర్శన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా బయటకు వెళ్లిన నిందితుడు సాయిహోమ్స్కాలనీలోని ఓ బావిలోకి దూకి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో రాంరెడ్డి తనకు కారు కొనివ్వాలంటూ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది. -
జుట్టు కత్తిరించి.. బట్టలూడదీసి
- మహిళలపై అకృత్యం - పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం హత్నూర : సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇద్దరు మహిళలను చిత్రహింసలకు గురిచేసి హింసించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు గ్రామానికి చెందిన బాధితులు చాకలి అనసూజ, చాకలి లక్ష్మి (నిందితుల్లో ఒకడైన అశోక్ మేనత్త అనసూజ, పెద్దమ్మ లక్ష్మి) మాటల్లోనే.. ‘ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన బడెంపేట నరసింహులు(40) హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో అదే గ్రామానికి చెందిన చాకలి అడవయ్య, చాకలి అశోక్ కేసులో నిందితులుగా తెలపడంతో అప్పట్లో పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే వారు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చినా గ్రామానికి రాలేదు. అవిడయ్య, అశోక్ ఆచూకీ తెలపాలని హతుడి బంధువులు బెదిరింపులకు దిగారు. అందులో భాగంగానే ఈ నెల 12వ తేదీన మా ఇళ్లకు వచ్చి మమ్ములను కొట్టి ఈడ్చుకుంటూ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అక్కడే మా చీరలు ఊడదీసి వాటితోనే అక్కడి స్తంభానికి కట్టేశారు. అవిడయ్య, అశోక్ ఆచూకీ తెలపాలని రాత్రంతా కొట్టారు. దాహం వేస్తోందంటే కొందరి మూత్రం డబ్బాలో పోసి వాటిని నీరంటూ బలవంతంగా తాపించారు. అంతటితో ఆగక మా జుట్టును కత్తిరించి ఆలయం వెనుక వాటికి నిప్పు పెట్టించారు. ఆ రోజంతా నిందితుల ఆచూకీ తెలపాలంటూ కొడుతూనే ఉన్నారు. అదే రోజు రాత్రి నా భర్త(లక్ష్మి) చాకలి యాదయ్య విషయాన్ని హత్నూర పోలీసులకు సమాచారం అందించారు. అయినా వారిని నుంచి ఎటువంటి స్పందనా లేదు. మరుసటి రోజు ఉదయం(ఆగస్టు 13) మా ఇళ్లకు చేరుకుని ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కుతుంటే సదరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ రోజు మధ్నాహ్నం గ్రామంలో ఎవరి కంటా కనపడకుండా సంగారెడ్డికి చేరుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఇందుకు స్పందించి ఎస్పీ బాధితులపై చర్యలు తీసుకోవాలని హత్నూర పోలీసులను అప్పట్లో ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది. ఈ నెల 13 నుంచి సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 19న జరిగే సమగ్ర సర్వేకు హాజరయ్యేందుకు కొన్యాలకు వెళ్లాలని నిర్ణయించుకుని హత్నూర పోలీసులను సంప్రదించాం. వారు వెళ్లమని సలహా ఇచ్చారు. 18న రాత్రి హత్నూరలోని బంధువుల ఇంటిలో ఉండి 19వ తేదీ ఉదయం కొన్యాలకు వెళ్లాం. మమ్ములను చూసిన గ్రామానికి చెందిన మిహ ళలు బూతులు తిట్టారు’ అని విలేకరులతో తన గోడును వెళ్లబోసుకున్నారు. కేసు నమోదు చేశాం కొన్యాల గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి, చాకలి అనసూజల చిత్ర హింసలకు గురి చేసిన విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు కొసాగుతోంది. - రాంరెడ్డి, సీఐ -
గట్టు శ్రీకాంత్‌రెడ్డికిపితృవియోగం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. నల్లగొండ టుటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి శుక్రవారం ఉదయం గుం డెపోటుతో మరణించారు. ఉదయం బాతురూం లోకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నల్లగొండకు బయలుదేరి వచ్చారు. సావర్కర్‌నగర్‌లోని గట్టు స్వగృహంలో రాంరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలువురు నేతలు నివాళులర్పించారు. వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్, నాయకులు గాదె నిరంజన్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునీల్‌కుమార్, మేడిశెట్టి యాదయ్య, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, ఫయాజ్, వేణుయాదవ్, లక్ష్మీకాంత్ తదితరులు ఉన్నారు. శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. బీజేపీ నేతల పరామర్శ... గట్టు రాంరెడ్డి మృతదేహాన్ని బీజేపీ నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్చించారు. ఆయన మరణం పట్ల వారు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించి ఓదార్చారు. సంతాపం తెలిపిన వారిలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, ఓరుగంటి రాములు, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
నమ్మకం, నాణ్యతలే ముఖ్యం!
నాలుగేళ్లలో 4 మిలియన్ చ.అ.లను అభివృద్ధి చేసిన ఎస్ఎంఆర్ సంస్థ హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరాస్తి రంగంలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. కానీ, ఎస్ఎంఆర్ సంస్థ నాలుగేళ్లలో 4 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో (హైదరాబాద్, బెంగళూరుల్లో కలిపి) పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది. గడువు లోగా నిర్మాణం పూర్తి చేయటం, నమ్మకం, నాణ్యతలే సంస్థ రహస్యమని సంస్థ సీఎండీ రాం రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. 1. బండ్లగూడలో 13 ఎకరాల్లో ఎస్ఎంఆర్ వినయ్ హార్మోనీ కౌంటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మూడు ఫేజుల్లో పూర్తికానున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఫేజ్-1లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 30 నెలల్లో రెండు బ్లాకుల్లో 450 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందిస్తాం. ఫేజ్-2లో 700 ఫ్లాట్ల పనులను మూడు నెలల్లో ప్రారంభిస్తాం. చివరగా ఫేజ్-3లో మరో 150 ఫ్లాట్లను కూడా నిర్మిస్తాం. ఇక ధర విషయానికొస్తే చ.అ.కి రూ.3,200 లుగా నిర్ణయించాం. ఇదే ప్రాంతంలో 30 ఎకరాల్లో 200 లగ్జరీ విల్లాలను కూడా నిర్మించనున్నాం. ఒక్కో విల్లా ఖరీదు రూ.2-3 కోట్లుగా ఉంటుంది. 2. మియాపూర్‌లో 1.7 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ‘ఎస్ఎంఆర్ వినయ్ మెట్రో’ షాపింగ్ విత్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 4 స్క్రీన్ల మల్టిప్లెక్స్ రానుంది. ఇదే ప్రాంతంలో మరో 6 లక్షల చ.అ. విస్తీర్ణంలో మరో భారీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. ఇందులో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తాం. ఇందులో 6 స్క్రీన్ల మల్టిప్లెక్స్ వస్తుంది. 3. అన్ని ప్రాజెక్టుల్లోనూ అధిక శాతం స్థలాన్ని పచ్చదనానికే కేటాయిస్తున్నాం. ఇండోర్, ఔట్ డోర్ ఆట స్థలాలు, క్లబ్ హౌస్, వాకింగ్, స్కేటింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్‌పూల్ వంటి అనేక రకాల ఆధునిక సౌకర్యాలనూ ఏర్పాటు చేస్తున్నాం. -
ప్రధాన పార్టీల నేతలకే తలపోటు
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మండలంలోని అంబాజిపేట ఎంపీటీసీ స్థానం ప్రధాన పార్టీల అధ్యక్షులకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ అభ్యర్థులకన్నా ఆయా పార్టీల అధ్యక్షులకే టెన్షన్ ఎక్కువైంది. అంబాజీపేట ఎంపీటీసీ స్థానం పరిధిలో అంబాజిపేటతోపాటు కామారం గ్రామాలు ఉన్నాయి. అంబాజిపేటలో 728 ఓట్లు, కామారంలో 904 ఓట్లు ఉన్నాయి. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకుడు పూలపల్లి యాదగిరి సతీమణి మంజుల యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈమె గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంపీటీసీ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున అంబాజిపేటకు చెందిన ద్యాప మణెమ్మ పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, అంబాజిపేటకు చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ సమీప బంధువు లతాశ్రీని బరిలో నిలిపారు. బీజేపీ నాయకులు కామారం గ్రామానికి చెందిన జూకోటి లక్ష్మిని అభ్యర్థిగా పోటీలో దింపారు. ప్రధాన పార్టీల నేతలకు సవాల్.. అంబాజిపేట స్థానం నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల మండల అధ్యక్షులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్.రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపయ్యగారి రాంరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పాపయ్యగారి రాజిరెడ్డిలది కామారం గ్రామం. వీరందరిదీ ఒకే గ్రామం కావడంతో ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తంటాలు పడుతున్నారు. అదీగాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సుభాష్‌రెడ్డి స్వయాన సోదరులు. టీఆర్ఎస్, బీజేపీ అధ్యక్షులు కూడా సొంత అన్నదమ్ములు. ఇలా ఆయా పార్టీ నేతల మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అభ్యర్థులు సైతం ఆయా పార్టీ నేతలకు సమీప బంధువులు, అనుచర వర్గమే కావడంతో అభ్యర్థుల కన్నా సదరు పార్టీల నాయకులకే టెన్షన్ ఎక్కువైంది. ఆ మేరకు ప్రచారాన్ని కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. ఓ రకంగా ఇది పార్టీ నేతల మధ్య జరుగుతున్న పోరుగా మారడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. -
రసాయనాల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
మేడ్చల్/మేడ్చల్ రూరల్, న్యూస్‌లైన్: మేడ్చల్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ. కోటికి పైగా ఆస్తి నష్టం జరిగింది. కంపెనీ యాజమాన్యం, మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పారిశ్రామికవాడలోని ఎస్కిటోన్స్ రసాయనాల కంపెనీలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నగరంలోని జీడిమెట్ల, సనత్‌నగర్, ప్యారాడైజ్ ప్రాంతాల నుంచి ఫైరింజన్లు వచ్చాయి. అప్పటికే కంపెనీలో ఉన్న రసాయన పదార్ధాలు, తయారీకి వినియోగించే సాల్వెంట్ రియాక్టర్లు పేలిపోయాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో రూ. కోటికి పైగా ఆస్తినష్టం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కాగా రసాయనాలను కలిపే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, పరిశ్రమల శాఖా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ సీఐ రాంరెడ్డిలు చేరుకొని పరిస్థితిని సమీక్షిచారు. -
తారస్థాయికి కాంగ్రెస్ వర్గపోరు
సాక్షి, కొత్తగూడెం కాంగ్రెస్ వర్గాల మధ్య రాజుకున్న అగ్గి ఇంకా చల్లారలేదు. కత్తులు దూసుకుంటున్న ఇరువురు ప్రధాన నేతలు ఒకరు భాగ్యనగరంలో, మరొకరు హస్తినలో పావులు కదుపుతున్నారు. తెలంగాణవాదంతో జిల్లా నుంచి రేణుకాచౌదరిని సాగనంపాలని మంత్రిరాంరెడ్డి ఎత్తులు వేస్తే.. దీనికి పైఎత్తుగా కల్లూరులో ఫ్లెక్సీ చించివేత వ్యవహారంపై హస్తినలో అధిష్టానం పెద్దలకు రేణుక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఉన్న ఫ్లెక్సీలను మంత్రి రాంరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి వర్గీయులే చించారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె వర్గీయులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆమె ఫ్లెక్సీని చించితే సోనియాగాంధీ ఫ్లెక్సీ చించారని ఫిర్యాదు చేసి యాగీ చేశారనే ఆరోపణలున్నాయి. గతంలో మాదిరిగానే మళ్లీ పావులు కదిపి ఇటు మంత్రిని, అటు పొంగులేటిని అధిష్టానం వ్యతిరేకులుగా చిత్రీకరించే పనిలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంలో ఆమె జిత్తులు తెలిసిన మంత్రి.. ముందే ఆమెపై చేసిన వ్యాఖ్యలతో పాటు, కల్లూరు ఫ్లెక్సీ చించివేత విషయమై మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబుతో చర్చించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈనెల 21న నిర్వహించనున్న తెలంగాణ కృతజ్ఞత సభ విషయమై తెలంగాణ నుంచి ఎవరిని ఆహ్వానించాలని, రేణుక అంశంపై మాట్లాడినట్లు సమాచారం. రేణుక హస్తినలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని, తనకు మద్దతుగా ఉండాలని మంత్రి వారిని కోరినట్లు తెలిసింది. రేణుకపై మంత్రి సోదరుడి ఆగ్రహం.. నాలుగు రోజులుగా ఢీల్లీలో ఉన్న మంత్రి సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి హూటాహుటిన తన సోదరునికి మద్దతు ఇచ్చేందుకు ఖమ్మం చేరుకున్నారు. మంత్రి హైదరాబాద్‌లో ఉండగానే ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేణుకపై విమర్శలు గుప్పించారు. ‘ఎక్కడో... విశాఖపట్నం జిల్లాలో పుట్టిన నీవు... మమ్మల్ని దమ్ముందా అని ప్రశ్నిస్తున్నావా...? మహిళను అని మర్చిపోయి మాట్లాడుతున్నావు... మా దమ్మేందో చూపిస్తాం రా’ అంటూ సవాల్ విసిరారు. ఈ నెల 21న సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపే సభకు వచ్చే అర్హత రేణుకకు లేదన్నారు. ఒకవేళ వస్తే ఈ ప్రాంత ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులను హేళన చేసేలా మాట్లాడిన ఆమె క్షమాపణ చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశానికి పిలవకుండా హాజరయ్యారని, చాలా మంది బహిరంగంగానే ఆమె రాకను వ్యతిరేకించినా.. ఎలా సమావేశంలో కూర్చున్నారు.. అని ఆయన దుయ్యబట్టారు. వ్యూహాత్మకంగానే మంత్రి తన సోదరుడిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అవసరమైతే జిల్లా ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఆమె వ్యవహారంపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని దామోదర్‌రెడ్డి మంత్రి అనుచరులకు భరోసానిచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా రేణుకకు మద్దతిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇలాకా కొత్తగూడెంలో గాంధీపథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డితో విలేకరుల సమావేశం పెట్టించి.. రేణుకపై విమర్శలు చేయించి ఆమె మద్దతుదారులకు మంత్రి రాంరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి సవాల్ విసిరారు. అలాగే పీసీసీ సహాయ కార్యదర్శి మానవతారాయ్.. ‘ రాజ్యసభకు ఇచ్చిన పత్రంలో రేణుక స్వస్థలం విశాఖపట్టణం అని పేర్కొన్నారని..తెలంగాణ ప్రజలను రేణుకాచౌదరి మోసం చేస్తున్నారని’ సత్తుపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా ఇటు మంత్రి, అటు పొంగులేటి అనుచరులు ఎదురుదాడికి దిగడంతో రేణుక అనుచరులు గుంభనంగా ఉంటూ ఆమె ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. పాలేరులో సమావేశం పెట్టే యోచన..? తన అనుంగు అనుచరులతో పాలేరులో సమావేశం పెట్టి మంత్రిని ఇరకాటంలో పెట్టేందుకు రేణుక ఎత్తుకుపైఎత్తువేసే యోచనలో ఉన్నట్లు ఆమె అనుచరులు చర్చించుకుంటున్నారు. ఖమ్మంలో ఉన్న తన అనుచరులందరినీ అక్కడి తరలించి మంత్రికి నియోజకవర్గంలో పట్టు లేదని, తనకే ఉందని అధిష్టానం చెవిలో వేయాలని ఆమె ఆదిశగా కసరత్తుచేస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఖమ్మంలోని తన ముఖ్య అనుచరులతో పాలేరులో సమావేశం సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. విజయదశమి తర్వాత, లేదా తెలంగాణ కృతజ్ఞత సభకు ముందే ఆమె పాలేరులో సమావేశం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ పాలేరు కాని పక్షంలో ఖమ్మంలోనైనా సమావేశం నిర్వహించి తనవెంట ముఖ్య నేతలందరూ ఉన్నారని బలప్రదర్శనకు దిగవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇలా ఇరువర్గాల నేతలు ఎవరికి వారు ఎత్తుకుపైఎత్తులు వేస్తుండడంతో చివరకు తెలంగాణ కృతజ్ఞత సభ జరుగుతుందో లేదోనని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. -
ఆర్ట్ బిల్డర్ జాయింట్ సెక్రెటరి రాంరెడ్డితో సాక్షి వేదిక