
గట్టు శ్రీకాంత్‌రెడ్డికిపితృవియోగం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.
నల్లగొండ టుటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తండ్రి రాంరెడ్డి శుక్రవారం ఉదయం గుం డెపోటుతో మరణించారు. ఉదయం బాతురూం లోకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నల్లగొండకు బయలుదేరి వచ్చారు.
సావర్కర్‌నగర్‌లోని గట్టు స్వగృహంలో రాంరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలువురు నేతలు నివాళులర్పించారు. వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్, నాయకులు గాదె నిరంజన్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునీల్‌కుమార్, మేడిశెట్టి యాదయ్య, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, ఫయాజ్, వేణుయాదవ్, లక్ష్మీకాంత్ తదితరులు ఉన్నారు. శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు.
బీజేపీ నేతల పరామర్శ...
గట్టు రాంరెడ్డి మృతదేహాన్ని బీజేపీ నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్చించారు. ఆయన మరణం పట్ల వారు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించి ఓదార్చారు. సంతాపం తెలిపిన వారిలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, ఓరుగంటి రాములు, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.