మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కృషితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి అన్నారు.
మునిపల్లి: మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కృషితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నారంటే సోనియాగాంధీ, రాహుల గాంధీ పుణ్యమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాగాంధీ జన్మదినాన్ని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సి ఉండగా కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎక్కడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కనిపించడం లేదన్నారు. రైతులకు పంట నష్టం మంజూరు చేయడం లేదన్నారు. రైతులకు రుణమాఫీని ఒకేసారి అమలు చేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సమావేశంలో సదాశివపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, పిల్లోడి సర్పంచ్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.