Geted community
-
జిల్లా కేంద్రాల్లో బడా ప్రాజెక్ట్‌లు!
సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల్లోనూ గేటెడ్ కమ్యూనిటీ, విల్లాల సంస్కృతి విస్తరించింది. అందుకే సూర్యాపేటలో ఓ అపార్ట్‌మెంట్‌ను నిర్మించాలని నిర్ణయించామని.. స్థల సేకరణ కోసం చూస్తున్నామని రాంరెడ్డి పేర్కొన్నారు. ♦ టెర్మినల్స్ ఇన్ఫ్రాతో కలిసి కొండాపూర్‌లో జాయింట్ వెంచర్ చేస్తున్నాం. ఎకరం విస్తీర్ణంలో హ్యాంటన్స్ పేరిట ఎక్స్‌క్లూజివ్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. 9 అంతస్తుల్లో మొత్తం 68 ఫ్లాట్లొస్తాయి. ధర చ.అ.కు రూ.4,500. టై స్విమ్మింగ్ పూల్, గార్డెన్, క్లబ్ హౌజ్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులూ ఉంటాయి. 2018 మార్చిలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ♦ కూకట్పల్లి నుంచి గాజులరామారం వెళ్లే మార్గంలో ఎకరన్నర విస్తీర్ణంలో ఏఆర్కే హేమ ప్రాజెక్ట్ రానుంది. జనవరిలో ప్రారంభించనున్న ఈ అపార్ట్మెంట్లో మొత్తం 108 ఫ్లాట్లుంటాయి. 1,050-1,700 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ♦ ఎల్బీనగర్లో ఎకరం విస్తీర్ణంలో మరో ప్రాజెక్ట్ రానుంది. దీన్ని మార్చిలో ప్రారంభించనున్నాం. ఇందులో మొత్తం 80 ఫ్లాట్లు. 1,075-1,700 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. భువనగిరిలో 1,200 గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నాం. ♦ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెండున్నర ఎకరాల్లో క్లౌడ్ సిటీ పేరిట ఆటోమేటెడ్ హోమ్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 165 ఫ్లాట్లొస్తాయి. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతి ఫ్లాట్‌లోని లైట్లు, తలుపులు, గేట్లు అన్నీ ఆటోమేటెడ్‌గానే ఉంటాయి. ధర చ.అ.కు రూ.4 వేలు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 వింగ్స్‌లో పూర్తి చేస్తాం. తొలి 3 వింగ్స్‌ను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. -
ఇవి పాటిస్తే గేటెడ్‌లో నిశ్చింతే!
సాక్షి, హైదరాబాద్ : గేటెడ్ కమ్యూనిటీ అయినా లగ్జరీ విల్లా అయినా నివాసితులంతా రోజువారి పనుల్లో బిజీగా ఉంటారు. అసలు పక్కవారి గురించి ఆలోచించే తీరికే ఉండదు. ఈ నేపథ్యంలో నివాసితుల సంక్షేమం కోసం సమయాన్ని వెచ్చించడానికి ముందుకొచ్చేవారిని అభినందించాలి. మంచి పనులు చేస్తే మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవటానికి సలహాలు ఇవ్వాలి. అంతేతప్ప చిన్న పొరపాటునూ భూతద్దంలో చూసి పెద ్దగా చేయకూడదు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆయా సంఘం బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఎవరూ ముందుకురాకపోవచ్చు. కాబట్టి నివాసితులంతా సంఘం పట్ల బాధ్యతగా మెలగాలి. ⇔ ఒక అపార్ట్మెంట్లోని వ్యవహారాలన్నీ సమర్థంగా నడిపించాల్సిన విధివిధానాల గురించి ‘బైలాస్’లో స్పష్టంగా రాసుకోవాలి. ఏయే సందర్భాల్లో నివాసితులెలా స్పందించాలో ముందే పేర్కొనాలి. కాబట్టి, ఇందులో పొందుపరిచే నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా చేసినవారి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రాసుకుంటే మంచిది. ⇔ సంఘ సభ్యులుగా ఎన్నికయ్యేవారు తోటి సభ్యులతో కలసిమెలసి పనిచేయాలి. వ్యక్తిగత వివాదాల జోలికి వెళ్లకూడదు. రాగద్వేషాలకూ తావివ్వకూడదు. నివాసితులందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలి. సంఘంలోని కొందరికే మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు. ⇔ నివాసితుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ఎన్నుకోవాలి. ఆయా అభ్యర్థుల ప్రత్యేకతలు, వివిధ సందర్భాల్లో స్పందించే తీరు, సంఘం మేలు కోసం సమయాన్ని వెచ్చించగలరా? అందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోగలరా? లేక వ్యక్తిగత లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుంటారా? ఇలా పలు అంశాల్ని గమనించాకే నిర్ణయం తీసుకోవాలి. ⇔ కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో కొందరు వ్యక్తులు ‘తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్నట్లుగా వ్యవహరిస్తారు. వాళ్లే కరెక్ట్.. ఇతరులు చెప్పేది తప్పని భావిస్తుంటారు. వాళ్లకు నచ్చిన అంశాన్ని ఇతరులు మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తుం టారు. కాబట్టి ఇలాంటి వారు చెప్పే అంశాన్ని లోతుగా పరి శీలించాకే నివాసితులు అంతి మ నిర్ణయానికి రావాలి. -
ఇంట్లో ఉండగానే దోచేశాడు!
ఫిల్మ్‌నగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో భారీ చోరీ * సీసీ కెమెరాలకు చిక్కకుండా ‘పని’ పూర్తి చేసిన చోరుడు * కేజీకి పైగా బంగారం, రూ.5 లక్షల నగదు తస్కరణ హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ సమీపంలోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ.. దాదాపు ఏరియా మొత్తం కవర్ చేస్తూ 12 సీసీ కెమెరాలు.. కాలనీ చుట్టూ సోలార్ ఫెన్సింగ్‌తో ప్రహరీ గోడ.. భద్రతా విధుల కోసం నలుగురు సెక్యూరిటీ గార్డులు.. వీటన్నింటినీ తప్పించుకుని లోపలికి ప్రవేశించిన చోరుడు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కేజీ బంగారం, రూ.5 లక్షల నగదు తస్కరించాడు. ఇంటి యజమానులు బెడ్రూమ్లో నిద్రిస్తుండగానే ఈ తంతు పూర్తిచేశాడు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో యజమానులు ఉండగానే.. నగరానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి శ్యాంసుందర్ శర్మ ఫిల్మ్‌నగర్‌లోని అపర్ణ సినార్‌వ్యాలీ గేటెడ్ కమ్యూనిటీలోని క్వార్టర్స్ నం.5లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి శర్మ, ఆయన భార్య సువర్ణశర్మ ఇంటికి లోపలి నుంచి తాళం వేసి మొదటి అంతస్తులో ఉన్న బెడ్రూమ్లో నిద్రపోయారు. గురువారం ఉదయం నిద్రలేచిన శర్మ దంపతులు తమ గదిలోని వస్తువులు చిందరవందరగా పడిఉండటం, ఆభరణాల బాక్సులు బెడ్ పక్కన పేర్చి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న 20 నెక్లెస్‌లు, ఒక వడ్డాణం, డైమండ్స్ సెట్, 12 జతల గాజులు, ఉంగరాలు ఇలా దాదాపు కేజీకి పైగా బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు ఎత్తుకుపోయినట్లు శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ.40 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. చోరీ జరిగిన బీరువాలో ఉన్న వన్‌గ్రామ్ బంగారు నగలను మాత్రం దొంగ ముట్టుకోకపోవడం గమనార్హం. ఆధారాల సేకరణకు పోలీసులు క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి పరిశీలించారు. దొంగతనానికి వచ్చింది ఒక్కడేనని నిర్థారిస్తున్నారు. ఆరితేరిన చోరుడిగా అనుమానం.. దొంగతనం జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు పక్కా ప్రొఫెషనల్ చోరుడి పనిగా అనుమానిస్తున్నారు. శబ్దం కాకుండా ‘పని’ పూర్తి చేయడం, శర్మ ప్యాంట్ జేబులోంచి తాళం చెవి తీసి బీరువా తెరవడం.. ఇవన్నీ ప్రొఫెషనల్స్ అనుసరించే పంథాలుగా చెప్తున్నారు. సెక్యూరిటీ గార్డులను విచారించిన పోలీసులు.. శర్మ ఇంట్లో ప్రస్తుతం పనిచేస్తున్న, పాత పనివాళ్లు, డ్రైవర్లను విచారిస్తున్నారు. సంపన్నులు నివసించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో కొంత కాలంగా ఒకే చోరుడు పంజా విసురుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ కోసం ఇంట్లోకి ప్రవేశిస్తున్న దొంగ కిటికీ స్క్రూలు తన వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌తో తొలగిస్తూ గ్రిల్‌ను పక్కన పెడుతున్నాడు. చోరీ చేసిన తర్వాత మళ్లీ గ్రిల్‌ను యథాస్థానంలో బిగిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఈ తరహాలో నాలుగైదు చోరీలు జరిగాయి. పక్కా రెక్కీ.. తర్వాతే చోరీ.. గేటెడ్ కమ్యూనిటీలో 12 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవన్నీ ప్రధాన రహదారులు, బైలైన్స్ను మాత్రమే కవర్ చేస్తున్నాయి. దీనిని చోరుడు రెక్కీ ద్వారా ముందే గమనించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కెమెరాలకు చిక్కకుండా తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో కమ్యూనిటీ వెనుక వైపు రామానాయుడు స్టూడియోకు ఆనుకుని ఉన్న ప్రాంతం నుంచి ఫెన్సింగ్ దాటుకొని లోపలకు ప్రవేశించినట్లు పోలీసు జాగిలాలు గుర్తించాయి. నేరుగా క్వార్టర్స్ నం.5 వద్దకు ప్రవేశించిన దొంగ చాకచక్యంగా మొదటి అంతస్తులోకి వెళ్లాడు. అక్కడి కిటికీ గ్రిల్స్ తొలగించడానికి ప్రయత్నించిన ఆనవాళ్లు ఉన్నాయి. -
అందరిచూపు ‘గేటెడ్’ వైపే!
సాక్షి, హైదరాబాద్: 2016 సంవత్సరం.. భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్ సానుకూలంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో అమ్మకాలు ఊపందుకుంటాయి. నిర్మాణ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు, నూతన పారిశ్రామిక విధానంతో నగరానికొస్తున్న పెట్టుబడులు, కొత్త సంస్థలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఫ్లాట్లు కొనేవారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నగరవాసులకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులపై ఆసక్తి పెరిగింది. అభద్రతాభావం.. ఇతరత్రా కారణాల వల్ల వీటివైపు మొగ్గుచూపుతున్నారు. సింగిల్ అపార్ట్మెంట్ల బదులు.. కమ్యూనిటీలో నివసించాలని చాలా మంది భావిస్తున్నారు. నగరంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు పునరావృతమైతే.. ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో.. కొందరు గేటెడ్ కమ్యూనిటీలవైపు దృష్టి సారిస్తున్నారు. బూమ్ సమయంలో ఆరంభమైన బడా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం కొన్ని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. వీటిలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించని ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో పలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల వద్ద సందర్శకులు సందడి మొదలైంది. ఇక ఆలస్యం చేయడం వృథా అనుకున్నవారు ఫ్లాట్ల కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాజెక్ట్‌ను చూసిన రెండు వారాల్లోగా తుది నిర్ణయానికి వస్తున్నారు. నిన్నటి వరకూ విల్లాల జోలికి వెళ్లనివారు నేడు ఆసక్తి చూపిస్తున్నారని ఓ బిల్డర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో సానుకూల ధోరణి పెరగడంతో ప్రాజెక్టు సందర్శనలు ఆధికమయ్యాయని తెలిపారు. గత నాలుగు నెలల్లో నిజాంపేట ఏరియాలో అత్యధికంగా మా విల్లాలే అమ్ముడుపోయాయి. -
ఇంటి ధర పెంచుకుందాం!
కొనేటప్పుడు కాస్త తక్కువకు రావాలి. అమ్మేటపుడు బాగా ఎక్కువకు పోవాలి!! ఇలా అనుకునేది ఒక్క రియల్టీ విషయంలోనే. ప్రస్తుతం మార్కెట్లో అంత బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే... ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి విక్రయం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీ ఇంటికి విలువ జోడించటం ఎలా? దాన్ని ఆకర్షణీయంగా తయారు చేయటం ఎలా? ఇదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... * కొంచెం నేర్పు.. కాసింత ఖర్చు పెడితే చాలు * ప్రతికూలంలోనూ స్థిరాస్తి అమ్మకం కష్టం కాదు * ఏరియా, సౌకర్యాలు, నిర్వహణ... అన్నీ ముఖ్యమే సదరు స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర... ఇవే ఇంటి ధరను ప్రధానంగా నిర్ణయిస్తాయి. అలాగని పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయిస్తాయని అనుకుంటే పొరపాటే. ధరపై అత్యధిక ప్రభావం చూపించేది నిజానికి మార్కెట్ సెంటిమెంటే. అప్పుడు బూమ్ బాగా ఉంటే ఎక్కువ ధరకు కూడా అమ్ముడుపోతుంటాయి. అదే డీలా పడ్డ పరిస్థితుల్లో ధర తగ్గించినా అమ్ముడుపోవటం కష్టం. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి. నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం కూడా ఉండాలని, అప్పుడే ఇంటి విలువ రెట్టింపవుతుందని చెబుతున్నారు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి. ‘‘సొసైటీ మెంబర్లు సక్రమంగా ఉండాలి. ప్రతి పైసా ఖర్చుకూ లెక్కలుండాలి. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది’’ అని చెప్పారాయన. రిపేర్ల విషయంలో నాణ్యమైన వస్తువులనే వినియోగించాలంటూ... ఇంటి విలువ అనేది కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదని, అందులోని సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారాయన. ఈ మధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులు కూడా ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోందని తెలియజేశారు. ఫుల్లీ ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్లకు ఇంకాస్త ఎక్కువరేటొస్తుందని చెప్పారు. చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలున్నా సరే! ఒక్క విషయంలో చిన్నపాటి తేడా ఉంటే కొనుగోలుదారులు ముందుకురారని గుర్తుంచుకోవాలి. అదే లీగల్ సమస్యలు. మీరు విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందడగు వేస్తాడని గుర్తుంచుకోండి. సౌకర్యాలే ముఖ్యం కాదు.. అయితే ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ-మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరం కావచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇల్లు కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి అంతిమ విలువను లెక్కగడతారని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేమనుకోండి. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉండాలనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఆ ఇంటికొచ్చేందుకు లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటుగా అడ్రస్ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి. వసతులు చాలా కీలకం... ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా నిర్ణయిస్తారు. మొదటిది... ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? అనేది చూసి. రెండోది... ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? అనేది చూసి. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాళ్లు లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందన్న విషయం మరిచిపోవద్దు. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్ సదుపాయాలు కూడా కీలకమే. -
ఇవి పాటిస్తే.. గేటెడ్‌లో నిశ్చింతే!
హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీ అయినా లగ్జరీ విల్లా అయినా నివాసితులంతా రోజువారి పనుల్లో ఒత్తిడితో ఉంటారు. పక్కవారి గురించి ఆలోచించే తీరికే ఎవరికీ ఉండదు. ఈ నేపథ్యంలో నివాసితుల సంక్షేమం కోసం సమయాన్ని వెచ్చించడానికి ముందుకొచ్చేవారిని అభినందించాలి. మంచి పనులు చేస్తే మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి సలహాలివ్వాలి. అంతేతప్ప చిన్న పొరపాటునూ భూతద్దంలో చూసిపెద్దగా చేయకూడదు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆయా సంఘం బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఒక అపార్ట్మెంట్లోని వ్యవహారాలన్నీ సమర్థంగా నడిపించాల్సిన విధివిధానాల గురించి ‘బైలాస్’లో స్పష్టంగా రాసుకోవాలి. ఏయే సందర్భాల్లో నివాసితులెలా స్పందించాలో ముందే పేర్కొనాలి. కాబట్టి ఇందులో పొందుపరిచే నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా చేసినవారి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి రాసుకుంటే ఉత్తమం. సంఘం సభ్యులుగా ఎన్నికయ్యేవారు తోటి సభ్యులతో కలిసిమెలిసి పనిచేయాలి. వ్యక్తిగత వివాదాల జోలికి వెళ్లకుండా రాగద్వేషాలకు తావివ్వకుండా నివాసితులందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలి. నివాసితుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ ్నంగా తెలుసుకున్నాకే ఎన్నుకోవాలి. ఆయా అభ్యర్థుల ప్రత్యేకతలు, వివిధ సందర్భాల్లో స్పందించే తీరు, సంఘం మేలు కోసం సమయాన్ని వెచ్చించగలరా? అందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోగలరా? లేక వ్యక్తిగత లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుంటారా? ఇలా పలు అంశాల్ని గమనించాకే నిర్ణయం తీసుకోవాలి.