న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రిటైల్‌లో 1,751 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం అని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఎక్స్‌సీ60 మోడల్ ఈ వృద్ధిని నడిపించిందని వెల్లడించింది. మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 35 శాతం ఉందని వివరించింది.
దేశీయంగా అసెంబుల్ అవుతున్న పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ40 రిచార్జ్ మోడల్‌లో 419 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని వోల్వో ప్రకటించింది. ఎక్స్‌సీ40 రిచార్జ్ వాటా 24 శాతం ఉందని తెలిపింది. సంస్థ మొత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల నుంచి 27 శాతం సమకూరుతోంది. ఈ విజయం కస్టమర్ల విశ్వాసాన్ని, భారత మార్కెట్‌కు ప్రీమియం, స్థిర వాహనాలను అందించడంలో కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీకి భారత్‌లో 25 డీలర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment