నోకియా ఫీచర్ ఫోన్‌ను తిరిగి లాంచ్ చేసి ఫోన్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసిన నోకియాసంస్థ ఇపుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుది. 'పుతిన్-ట్రంప్ సమ్మిట్' స్పెషల్ ఎడిషన్ గా నోకియా 3310 (2017)ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ ఫోన్లలో ఒకటిగా నిలిచిన ఈ ఫీచర్ ఫోన్ ఇపుడు అతి విలాసవంతమైన ఫోన్‌గా అవతరించింది.
జీ20 అంతర్జాతీయ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశానికి గౌరవంగా దీన్ని రూపొందించింది. రష్యన్ ఫోన్ కస్టమైజర్ కావియర్ నోకియా 3310 పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్ను సృష్టించింది. నోకియా 3310 'పుతిన్-ట్రంప్ సమ్మిట్' ఎడిషన్ ధర 2,468డాలర్ల (రూ. 1.6 లక్షలు) ప్రీమియం ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఇక ఈ స్పెషల్ నోకియా 3310 ఫీచర్ల విషయానికిస్తే మిగితా ఫీచర్లన్నీ రెగ్యులర్ వేరియంట్ ఫీచర్లే ఉన్నాయి. అయితే బంగారం పూత పూసిన పుతిన్-ట్రంప్ ఫోటో, 'బ్లాక్ వెల్వెట్' విలాసవంతమైన కవరే దీని ప్రత్యేకత. వీటి-23 గ్రేడ్ స్వచ్చమైన టైటానియంతో డమస్క్ స్టీల్ పూత తో ఈ కవర్‌ను ప్రత్యేకంగా రూపొందించారట. ప్రపంచ నాయకులిద్దరూ ఒక దేశగా చూస్తూ ఉన్న చిహ్నంలో ట్రంప్, పుతిన్ రష్యా-అమెరికా సంబంధాల పురోగతి కాంక్షను సూచిస్తోందని కావియార్ ప్రకటించింది. దీంతోపాటు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ల పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్లను అందిస్తున్నప్పటికీ, నోకియా 3310 (2017) తో పోలిస్తే వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాలి.
ఈ నోకియా ఫోన్ ధర ఎంతో తెలిస్తే...
Published Fri, Jul 7 2017 6:57 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
Advertisement