నోకియా 3310 వచ్చేసింది..ధరెంతో చెప్పుకోండి!
నోకియా 3310 వచ్చేసింది..ధరెంతో చెప్పుకోండి!
Published Tue, May 16 2017 11:07 AM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM
నోకియా బ్రాండు ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310 ఎట్టకేలకు భారత్ లోకి అధికారికంగా వచ్చేసింది. నోకియా కొత్త ఓనర్ హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్ ను అధికారికంగా భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. 2017 మే 18 నుంచి ఈ ఫోన్ భారత్ లోని అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ ఫోన్ ధరవింటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఫోన్ మోడల్ పేరునే, ధరగా హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. అంటే నోకియా 3310 ఫోన్ ను 3,310 రూపాయలకే విక్రయానికి ఉంచనుంది.
హెచ్ఎండీ గ్లోబల్ రూపొందించిన తొలి ఫోన్ ఇదే. అంతేకాక విక్రయానికి తీసుకొస్తున్న దేశాల్లో కూడా భారత్ కే మొదటి స్థానం కల్పించింది ఆ కంపెనీ. డార్క్ బ్లూ, గ్రే, రెడ్, ఎల్లో నాలుగు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. పాత నోకియా 3310కి చాలా మార్పులనే చేసి, ప్రస్తుత వెర్షన్ ను హెచ్ఎండీ గ్లోబల్ తీసుకొచ్చింది. దీనిలో అతిపెద్ద మార్పు డిస్ ప్లే, డిజైన్. 2.4 అంగుళాల కలర్ డిస్ ప్లే, స్క్రీన్ పై కర్వ్డ్ గ్లాస్ ను ఈ ఫోన్ కు కల్పించింది.
2017 నోకియా 3310 ఫీచర్లు..
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే
1200ఎంఏహెచ్ బ్యాటరీ(22.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్)
రేడియో, మ్యూజిక్ ప్లేయర్, నోకియా మైక్రోయూఎస్బీ ఛార్జర్
16ఎంబీ ఫోన్ స్పేస్
32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డుతో వాడుకోవచ్చు
2ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
బ్రౌజింగ్ ఆప్షన్ ఉంటుంది కానీ యాప్స్ డౌన్ లోడ్ కు అవకాశం లేదు.
Advertisement
Advertisement