Nokia 3310
-
ఈ నోకియా ఫోన్ ధర ఎంతో తెలిస్తే...
నోకియా ఫీచర్ ఫోన్‌ను తిరిగి లాంచ్ చేసి ఫోన్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసిన నోకియాసంస్థ ఇపుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుది. 'పుతిన్-ట్రంప్ సమ్మిట్' స్పెషల్ ఎడిషన్ గా నోకియా 3310 (2017)ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ ఫోన్లలో ఒకటిగా నిలిచిన ఈ ఫీచర్ ఫోన్ ఇపుడు అతి విలాసవంతమైన ఫోన్‌గా అవతరించింది. జీ20 అంతర్జాతీయ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశానికి గౌరవంగా దీన్ని రూపొందించింది. రష్యన్ ఫోన్ కస్టమైజర్ కావియర్ నోకియా 3310 పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్‌ను సృష్టించింది. నోకియా 3310 'పుతిన్-ట్రంప్ సమ్మిట్' ఎడిషన్ ధర 2,468డాలర్ల (రూ. 1.6 లక్షలు) ప్రీమియం ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇక ఈ స్పెషల్ నోకియా 3310 ఫీచర్ల విషయానికిస్తే మిగితా ఫీచర్లన్నీ రెగ్యులర్ వేరియంట్ ఫీచర్లే ఉన్నాయి. అయితే బంగారం పూత పూసిన పుతిన్-ట్రంప్ ఫోటో, 'బ్లాక్ వెల్వెట్' విలాసవంతమైన కవరే దీని ప్రత్యేకత. వీటి-23 గ్రేడ్ స్వచ్చమైన టైటానియంతో డమస్క్ స్టీల్ పూత తో ఈ కవర్‌ను ప్రత్యేకంగా రూపొందించారట. ప్రపంచ నాయకులిద్దరూ ఒక దేశగా చూస్తూ ఉన్న చిహ్నంలో ట్రంప్, పుతిన్ రష్యా-అమెరికా సంబంధాల పురోగతి కాంక్షను సూచిస్తోందని కావియార్ ప్రకటించింది. దీంతోపాటు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ల పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్లను అందిస్తున్నప్పటికీ, నోకియా 3310 (2017) తో పోలిస్తే వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాలి. -
నోకియా 3310కు మైక్రోమ్యాక్స్ గట్టిపోటీ
న్యూఢిల్లీ : హెచ్ఎండీ గ్లోబల్ కొన్ని రోజుల కిందటే నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310 మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ కు ఇప్పటికే మైక్రోమ్యాక్స్ నుంచి గట్టి పోటీ నెలకొంది. మైక్రోమ్యాక్స్ కొత్త ఫీచర్ ఫోన్ ఎక్స్1ఐ2017, నోకియా ప్రస్తుత మోడల్ కు గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అచ్చం నోకియా 3310 ఫోన్ మాదిరే ఉండే ఈ ఫోన్, కేవలం పేరు, ధరల్లో మార్పుతో వినియోగదారుల ముందుకు వచ్చింది. నోకియా 3310 మోడల్ కంటే తక్కువ ధరకు మైక్రోమ్యాక్స్ ఎక్స్1ఐ2017 ఫీచర్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. కంపెనీ సొంత వెబ్ సైట్లో ఇది లిస్టు అవడం మాత్రమే కాక, అమెజాన్ ఇండియాలోనూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర కేవలం 1399 రూపాయలే. అదే నోకియా 3310 ఫీచర్ ఫోన్ ఖరీదు 3310గా హెచ్ఎండీ గ్లోబల్ నిర్ణయించింది. మైక్రోమ్యాక్స్ కొత్త ఫీచర్ ఫోన్ ఫీచర్లు... 2.4 అంగుళాల క్యూవీజీఏ టీఎఫ్టీ డిస్ ప్లే 58 గ్రాములు 0.8 ఎంపీ రియర్ కెమెరా 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీకార్డు ద్వారా 8జీబీ వరకు విస్తరణ మెమరీ 1300ఎంఏహెచ్ బ్యాటరీ(234 గంటల పాటు స్టాండ్ బై టైమ్, 11.5 గంటల టాక్ టైమ్) -
నోకియా 3310 సేల్ నేటి నుంచే..
నోకియా బ్రాండు ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310 నేటి నుంచే అమ్మకానికి వస్తోంది. దేశంలోని అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ గురువారం నుంచి విక్రయానికి ఉంచుతోంది. ఈ వారం మొదట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ వార్మ్ రెడ్, ఎల్లో, డార్క్ బ్లూ, గ్రే రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. మోడల్ పేరునే ఈ ఫోన్ ధరగా నిర్ణయించి హెచ్ఎండీ గ్లోబల్ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో దీన్ని హెచ్ఎండీ గ్లోబల్ విడుదల చేసింది. అనంతరం మే 16న భారత్ లోకి అధికారికంగా లాంచ్ చేసింది. 2జీ మొబైల్ డేటా నెట్ వర్క్ ను మాత్రమే ఈ ఫోన్ సపోర్టు చేస్తోంది. వై-ఫైను ఇది సపోర్టు చేయదు. ఒరిజినల్ ఫోన్ లో మాదిరిగానే స్నేక్ గేమ్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. 2017 నోకియా 3310 ఫీచర్లు.. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే 1200ఎంఏహెచ్ బ్యాటరీ(22.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్) రేడియో, మ్యూజిక్ ప్లేయర్, నోకియా మైక్రోయూఎస్బీ ఛార్జర్ 16ఎంబీ ఫోన్ స్పేస్ 32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డుతో వాడుకోవచ్చు 2ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ బ్రౌజింగ్ ఆప్షన్ ఉంటుంది కానీ యాప్స్ డౌన్ లోడ్ కు అవకాశం లేదు -
నోకియా 3310 వచ్చేసింది..ధరెంతో చెప్పుకోండి!
నోకియా బ్రాండు ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310 ఎట్టకేలకు భారత్ లోకి అధికారికంగా వచ్చేసింది. నోకియా కొత్త ఓనర్ హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్ ను అధికారికంగా భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. 2017 మే 18 నుంచి ఈ ఫోన్ భారత్ లోని అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ ఫోన్ ధరవింటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఫోన్ మోడల్ పేరునే, ధరగా హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. అంటే నోకియా 3310 ఫోన్ ను 3,310 రూపాయలకే విక్రయానికి ఉంచనుంది. హెచ్ఎండీ గ్లోబల్ రూపొందించిన తొలి ఫోన్ ఇదే. అంతేకాక విక్రయానికి తీసుకొస్తున్న దేశాల్లో కూడా భారత్ కే మొదటి స్థానం కల్పించింది ఆ కంపెనీ. డార్క్ బ్లూ, గ్రే, రెడ్, ఎల్లో నాలుగు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. పాత నోకియా 3310కి చాలా మార్పులనే చేసి, ప్రస్తుత వెర్షన్ ను హెచ్ఎండీ గ్లోబల్ తీసుకొచ్చింది. దీనిలో అతిపెద్ద మార్పు డిస్ ప్లే, డిజైన్. 2.4 అంగుళాల కలర్ డిస్ ప్లే, స్క్రీన్ పై కర్వ్డ్ గ్లాస్ ను ఈ ఫోన్ కు కల్పించింది. 2017 నోకియా 3310 ఫీచర్లు.. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే 1200ఎంఏహెచ్ బ్యాటరీ(22.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్) రేడియో, మ్యూజిక్ ప్లేయర్, నోకియా మైక్రోయూఎస్బీ ఛార్జర్ 16ఎంబీ ఫోన్ స్పేస్ 32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డుతో వాడుకోవచ్చు 2ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ బ్రౌజింగ్ ఆప్షన్ ఉంటుంది కానీ యాప్స్ డౌన్ లోడ్ కు అవకాశం లేదు. -
భారత్ లో నోకియా 3310 ధరెంతో రివీల్!
నోకియా ఐకానిక్ మోడల్ 3310.. సరికొత్త ఫీచర్లతో అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరణైంది. సరికొత్త ఫీచర్లతో బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ కొత్త నోకియా 3310 ను హెచ్ఎండీ గ్లోబల్ ఆవిష్కరించింది. మరో మూడు రోజుల్లో ఈ ఫోన్ జర్మనీ, ఆస్ట్రియాలో అమ్మకానికి వస్తోంది. ఆసక్తికరంగా భారత్ కు చెందిన ఓ రిటైలర్ సైట్ ఈ ఫోన్ ధర దేశీయంగా ఎంత ఉండబోతుందో రివీల్ చేసేసింది. ఇండియన్ రిటైలర్ ఓన్లిమొబైల్స్.కామ్ నోకియా 3310(2017) ఫోన్ ను కంపెనీ వెబ్ సైట్లో పొందుపరిచి, ధర 3,899 రూపాయలని పేర్కొంది. ''కమింగ్ సూన్'' అని కూడా లిస్ట్ చేసింది. స్పెషిఫికేషన్లను పక్కనపెడితే, మొత్తం నాలుగు రంగుల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్టు వెబ్ సైట్ తెలిపింది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే రంగుల ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుందట. అయితే ఇప్పటివరకు భారత్ లో దీని ధర వివరాలు, అందుబాటులోకి తీసుకురాబోతున్న వివరాలను హెచ్ఎండీ గ్లోబల్ అధికారికంగా వెల్లడించలేదు. నోకియా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల కంటే కాస్త ముందుగానే ఈ 3310 మోడల్ ను క్యూ2లో భారత్ లోకి తీసుకురాబోతుందని మాత్రమే తెలిసింది. అయితే ఓన్లిమొబైల్ లిస్ట్ చేసిన ధర వివరాలను అనధికారికమైనవని కంపెనీ ధృవీకరించింది. ఇక ఫీచర్ల సంగతికి వస్తే కలర్ డిస్ప్లే, 2.4 అంగుళాల స్ర్కీన్, రెండు మైక్రో సిమ్ స్లాట్స్, 2 మెగా పిక్సల్ కెమెరా, 16ఎంబీ స్టోరేజ్, 32జీబీ వరకు విస్తరణ మెమరీ, 22 గంటల టాక్‌టైమ్, 31 రోజుల స్టాండ్‌బై కలిగివుంటుందని సంస్థ తెలిపింది. అప్పటి మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్చుచేర్పులతో రాబోతోన్న ఈ ఫోన్‌కు హైపర్ రిసెస్టింగ్ హౌసింగ్ ప్రధాన ఆకర్షణ కానుంది. -
నోకియా 3310 వస్తోంది..
నెలరోజుల్లో అందుబాటులోకి హైదరాబాద్, బిజి నెస్ బ్యూరో: కింగ్ ఆఫ్ ద ఫీచర్ ఫోన్‌గా నోకియా అభివర్ణిస్తున్న 3310 మోడల్ త్వరలో భారత్‌లో దర్శనమీయబోతోంది. ఏప్రిల్ చివరకు లేదా మే తొలివారంలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఈ మోడల్ ధర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ రూ.3,000–3,500 మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. 2.4 క్యూవీజీఏ డిస్ప్లే, 2 ఎంపీ కెమెరా, సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ వంటి ఫీచర్లున్నాయి. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. ఇందులోని స్నేక్ గేమ్ అదనపు ఆకర్షణ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 3310 తయారవుతోంది. ఫోన్ విడుదలైన ఒకటిరెండు నెలల్లోనే 15 లక్షల యూనిట్లు అమ్మాలని లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. అన్ని మొబైల్ షాపుల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పాత తరం 3310 అందుబాటులో ఉన్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన బేసిక్ ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక కంపెనీ నుంచి ఆన్‌డ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లు అయిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 జూన్ తొలివారంలో కస్టమర్ల చేతుల్లోకి రానున్నాయి. హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా 120 దేశాల్లో నోకియా కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. -
నోకియా బుల్లి ఫోన్ కమింగ్ సూన్...
అప్పట్లో మొబైల్ ప్రపంచానికి ఐకానిక్ బ్రాండు. ఎప్పటికీ చెక్కుచెదరని డిజైన్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యత గల ఫోన్ గా మధ్యతరగతి ప్రజలతో ఎక్కువగా మమేకమైన నోకియా 3310, మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. బెర్సీలోనాలో జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ) 2017లో దీన్ని ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తుందట. ఈ ఫోన్ ను 2000లో మొదటిసారి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తీసుకురాబోతున్న ఈ ఫోన్ ధర సుమారు రూ.4173గా ఉండనున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లోకి రాబోతున్న ఫోన్లను ముందస్తుగా లీక్ చేసే ఇవాన్ బ్లాస్ ఈ విషయాన్ని తెలిపారు. నోకియా ఫోన్లను ఉత్పత్తి చేయడానికి లైసెన్సు హక్కులను రాబట్టుకున్న హెచ్ఎండీ గ్లోబల్, ఫిన్నిస్ కంపెనీ దీన్ని ప్రవేశపెట్టబోతుందని పేర్కొన్నారు. నోకియా 3310 ఫోన్ అంటే అప్పట్లో ఎక్కువగా క్రేజ్ ఉండేది. దానికి గల కారణం, అది అందించే ఫీచర్లే. ఎస్ఎంఎస్ క్యారెక్టర్ కంటే ఎక్కువగా మెసేజ్ లు చేసుకునే సామర్ధ్యం, 84 x 48 పిక్సెల్ మోనోక్రోమ్ స్క్రీన్, స్క్రీన్ సేవర్స్, క్యాలిక్యులేటర్, గేమ్స్, ఏడు రింగ్ టోన్స్, వెనుక, ముందు వైపు ఎప్పడికప్పుడూ కవర్ మార్చుకుంటూ ఎప్పుడు కొత్త ఫోన్ లా మెరిసిపోయేలా చేసుకోవడం దీన్ని ప్రత్యేకతలు. అంతేకాక 55 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయగల ఫోన్ గా ఇది తెగ గుర్తింపు పొందింది. దీంతో మళ్లీ ఈ ఫోన్ ను తీసుకొచ్చి లో ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తుందట.ఈ ఏడాది జనవరిలో నోకియా మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హెచ్ఎమ్డీ గ్లోబల్ నోకియా 6 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. రిలీజ్‌కు ముందే 14 లక్షల బుకింగ్స్ రావడం విశేషం. చైనా ఈకామర్స్ వెబ్సైట్ జేడీ.కామ్ ద్వారా ఈ ఫోన్లు విక్రయానికి ఉంచారు.