నోకియా 3310కు మైక్రోమ్యాక్స్ గట్టిపోటీ
నోకియా 3310కు మైక్రోమ్యాక్స్ గట్టిపోటీ
Published Tue, May 23 2017 6:19 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM
న్యూఢిల్లీ : హెచ్ఎండీ గ్లోబల్ కొన్ని రోజుల కిందటే నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310 మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ కు ఇప్పటికే మైక్రోమ్యాక్స్ నుంచి గట్టి పోటీ నెలకొంది. మైక్రోమ్యాక్స్ కొత్త ఫీచర్ ఫోన్ ఎక్స్1ఐ2017, నోకియా ప్రస్తుత మోడల్ కు గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అచ్చం నోకియా 3310 ఫోన్ మాదిరే ఉండే ఈ ఫోన్, కేవలం పేరు, ధరల్లో మార్పుతో వినియోగదారుల ముందుకు వచ్చింది. నోకియా 3310 మోడల్ కంటే తక్కువ ధరకు మైక్రోమ్యాక్స్ ఎక్స్1ఐ2017 ఫీచర్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. కంపెనీ సొంత వెబ్ సైట్లో ఇది లిస్టు అవడం మాత్రమే కాక, అమెజాన్ ఇండియాలోనూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర కేవలం 1399 రూపాయలే. అదే నోకియా 3310 ఫీచర్ ఫోన్ ఖరీదు 3310గా హెచ్ఎండీ గ్లోబల్ నిర్ణయించింది.
మైక్రోమ్యాక్స్ కొత్త ఫీచర్ ఫోన్ ఫీచర్లు...
2.4 అంగుళాల క్యూవీజీఏ టీఎఫ్టీ డిస్ ప్లే
58 గ్రాములు
0.8 ఎంపీ రియర్ కెమెరా
32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్
మైక్రో ఎస్డీకార్డు ద్వారా 8జీబీ వరకు విస్తరణ మెమరీ
1300ఎంఏహెచ్ బ్యాటరీ(234 గంటల పాటు స్టాండ్ బై టైమ్, 11.5 గంటల టాక్ టైమ్)
Advertisement