
ఒకటి, రెండు.. కాదండోయ్ ఏకంగా 20 దేశాలకు చెందిన లగ్జరీ ఫర్నిచర్.. అందులోనూ 100కు పైగా బ్రాండ్లతో ఫర్నిచర్ ప్రియులను రా..రమ్మంటోంది ఎలివేట్ ఎక్స్! హైదరాబాద్‌లో లగ్జరీ ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్స్‌కు డిమాండ్ పెరగడంతో ఖజానా గ్రూప్ ఎలివేట్ ఎక్స్ పేరిట ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఏడు అంతస్తుల్లోని ఈ షోరూమ్‌లో ప్రతి ఫ్లోర్‌నూ ప్రత్యేక కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దారు. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో 50 వేల చ.అ.ల్లో ఎలివేట్ ఎక్స్ షోరూమ్ ఉంది. జర్మనీ, ఇటలీ, ఇండోనేషియా, వియత్నాం, స్పెయిన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా వంటి 20 దేశాలకు చెందిన సుమారు 100కు పైగా బ్రాండ్లున్నాయి. ఇందులో 12 బ్రాండ్లు ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్. పసిఫిక్ గ్రీన్, ఇండిస్ట్రియా ఎడిషన్, కోంటే, గెయిన్స్‌విల్లీ, డొమెటాలియా, శాంతా లుకియా, ఆర్చ్‌బోన్ వంటి నేషనల్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్‌తో పాటూ నటుజ్సీ ఇటాలియా, జైపూర్ రగ్స్, లా ఫార్మా, పాపాడాటోస్ వంటి రీజినల్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ సోఫా, బెడ్స్, డైనింగ్ టేబుల్ వంటి ఫిక్స్‌డ్ ఫర్నిచర్‌తో పాటూ మాడ్యులర్ కిచెన్స్, వార్డ్‌రోబ్స్, టీవీ సెట్స్ వంటి మాడ్యులర్ ఫర్నీచర్ ఉంటాయి.
సెలబ్రిటీలే కస్టమర్లు..
ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు ఎలివేట్ ఎక్స్ స్టోర్లున్నాయి. ఇప్పటివరకు సుమారు 10 వేలకు పైగా కస్టమర్లకు లగ్జరీ ఫర్నిచర్, ఇంటీరియర్స్‌ను అందించామని ఎలివేట్ ఎక్స్ డైరెక్టర్ శివానీ ఆనంద్ తెలిపారు. మహేశ్ బాబు, రకుల్ ప్రీత్‌సింగ్, అల్లు అర్జున్, మోహన్ బాబు, రాఘవేంద్ర రావు వంటి సెలబ్రిటీలెందరో మాకు కస్టమర్లున్నారు. ఫార్చూన్ ఎస్మెరాల్డ్, అర్బన్ విల్లా, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్, అపర్ణా, ఊర్జితా, డీఎస్‌ఆర్, ల్యాంకో వంటి నిర్మాణ సంస్థలకు విల్లా ప్రాజెక్ట్‌లకు ఫర్నిచర్ అందించాం.
బెడ్ ధర రూ.10 లక్షలు..
హైదరాబాద్‌లో రియల్టీ మార్కెట్‌తో పాటూ లగ్జరీ ఫర్నిచర్‌కు డిమాండ్ పెరిగింది. విదేశాల్లో లభించే ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్స్ కావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కస్టమర్లకు ఫర్నిచర్ గురించి సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా ఒక్కో అంతస్తులో ఒక్కో రకమైన కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దాం. బ్లో, ఇండస్ట్రియల్ ఎడిషన్, ఫ్యూజన్ స్టయిల్, క్లాసికల్ స్టయిల్, ఔట్‌డోర్ ఫర్నిచర్ ఇలా ప్రతి ఫ్లోర్‌లో 30 వరకు ఉత్పత్తులుంటాయి. ధరలు ఫ్యాబ్రిక్ సోఫా రూ.2.5– రూ.6 లక్షలు, లెదర్ సోఫా రూ.6–17 లక్షలు, బెడ్స్ రూ.2–10 లక్షలు, డైనింగ్ టేబుల్ లక్ష నుంచి రూ.8 లక్షలు, కుర్చీలు ఒక్కదానికి రూ.15 వేలు నుంచి రూ.2.5 లక్షలు వరకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment