శ్లోకా మెహతా వాచ్‌ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు! | Shloka Mehta Wearing Rs 4 Crore Luxury Watch | Sakshi
Sakshi News home page

శ్లోకా మెహతా వాచ్‌ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

Published Tue, Mar 5 2024 10:44 AM | Last Updated on Tue, Mar 5 2024 11:18 AM

Shloka Mehta Wearing Rs 4 Crore Luxury Watch - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నీతా అంబానీల పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం వారి రేంజ్‌ తగ్గట్టుగానే లగ్జరీయస్‌గా ఉంటారు. ఇటీవలే ముంఖేశ్‌ నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్‌-రాధికల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో శ్లోకా మెహతా అంబానీల లెవల్‌కి తగ్గట్టు తనదైన ఫ్యాషన్‌ బ్రాండ్స్‌తో తళుక్కుమన్నారు. ఇంతfరకు అంబానీల కుటుంబంలోని మగవాళ్లు అత్యంత లగ్జరీయస్‌ వాచ్‌లు ధరించడం గురించి విని ఉన్నాం. ఆ కుటుంబంలోని మహిళలు కూడా అలాంటివి ధరిస్తారని శ్లోకా మెహతా ప్రూవ్‌ చేశారు.

నిజానికి ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో  అంబానీ కుటుంబం తొమ్మిది పేజీల మెనులో ఏయే రోజులు సెలబ్రెటీలు, అతిథులు ఎలాంటి డ్రెస్‌ కోడ్‌ ధరించాలనే రూల్స్‌ పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, విదేశీ ప్రముఖులు  వరకు అందరూ ఈ వేడుకలకు తగ్గ వస్త్రధారణతో సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో శ్లోకా మెహతా డైమండ్స్‌తో పొదిగిన నెక్లెస్‌, జూకాలతో అందర్నీ ఆకర్షించారు.

ఈ వేడుకల్లో ఆమె ఎరుపురంగు వేలెంటినో డ్రస్‌తో అంబానీ కోడలు అంటే ఇది అనేంత రేంజ్‌లో గ్లామరస్‌ లుక్‌లో కనిపించారు. డైమండ్స్‌ అంటే ఇష్టపడే శ్లోకా ఈ వేడుకల్లో చేతికి పటేక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్‌ డైమండ్‌ వాచ్‌ని ధరించింది. మొత్తం వాచ్‌ అంతా ట్రాన్స్‌పరెంట్‌ వజ్రాలతో పొదగబడి ఉంటుంది. ఎంత దూరాన ఉన్న చేతికి ఉన్న వాచ్‌ ఆకర్షణ కనిపించడమే దీని ప్రత్యేకత. అయితే ఈ వాచ్‌ ఖరీదు వింటే కళ్లు బైర్లుకమ్మడం గ్యారంటీ. ఇంతకీ ఈ వాచ్‌ ధర ఎంతంటే అక్షరాల రూ. 4.8 కోట్లు. అమ్మ బాబోయే! జస్ట్‌ వాచ్‌కే అన్ని కోట్లా..! అని నోరెళ్లబెట్టకండి. అందులోనూ అంబానీ పెద్ద కోడలు ఆ మాత్రం రేంజ్‌ మెయింటెయిన్‌ చేయాల్సిందే కదూ.

(చదవండి: అనంత్‌-రాధికా ప్రీ వెడ్డింగ్‌: ఇవాంకా ట్రంప్‌ డ్రస్‌ స్టయిల్‌ అదిరిందిగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement