ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త మోనా పటేల్ మరోసారి తన ఫ్యాషన్ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024కి హాజరైన మోలా పటేల్ వింటేజ్ సిల్వర్ కలర్ కార్సెట్‌ను ధరించింది. అంతేకాదు ఈ డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.
బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చింది మోనా పటేల్. ఈ సందర్బంగా తనదైన ఐకానిక్ స్టైల్లో, వింటేజ్ స్కర్ట్‌లో దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. క్రిస్టియన్ లాక్రోయిక్స్ హాట్ కోచర్ కలెక్షన్‌లోనిది ఈ డ్రెస్. దీన్ని వేలంలో సుమారు రూ. 1.43కోట్లు (169,828.65డాలర్లు) మోనాగానీ, ఆమె స్టైలిస్ట్ గానీ కార్సెట్‌ను కొనుగోలు చేసి ఉంటారని అంచనా.
దీన్ని చేతితో దయారు చేశారు. దీనికి చక్కని ఎంబ్రాయిడరీని కూడా జతచేశారు. వేలకొద్దీ చేతితో కుట్టిన స్ఫటికాలు, భుజంపై ఉన్న సున్నితమైన సిల్క్ ఆర్గాన్జా పూసల సీతాకోకచిలుక, స్వరోవ్‌స్కీ పూసలు, స్ఫటికాలుతో తీర్చి దిద్దారు.మోనా 3డీ సీతాకోక చిలుకలను కైనెటిక్ మోషన్ ఆర్టిస్ట్ కేసీ కుర్రాన్ సహాయంతో స్వయంగా డిజైన్ చేసిందట.
ఈ ఏడాది ప్రారంభంలో మెట్ గాలాలో తొలిసారి పాల్గొన్న మోనా పటేల్ ఐరిస్ వాన్ హెర్పెన్ కోచర్ బటర్ ఫ్లై మోడల్ డ్రెస్‌లో అందర్నీ కట్టిపడేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment