ప్రపంచవ్యాప్తంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో లగ్జరీ కార్ల మార్కెట్ 15 శాతం దాకా ఉంటుండగా.. ఇండియాలో మాత్రం ఇది కేవలం ఒక్క శాతంగానే ఉంది. అందుకే దేశీ మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా మొబైల్ టెర్మినల్ తదితర ప్రయోగాలతో కస్టమర్లకు చేరువయ్యేందుకు జర్మనీ కార్ల దిగ్గజం ‘ఆడి’ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపైనా మరింతగా దృష్టి సారిస్తోంది.