కొందరూ యువకులు వయసు ఎంతో కాకపోయినా వృద్ధులు మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. అదీగాక చురుకుగా ఏ కార్యక్రమంలో పాల్గొనరు. కానీ కొందరు వృద్ధులను చూస్తే చూడముచ్చటేస్తుంది. అబ్బా ఏం ఎనర్జీ అనిపిస్తుంది. వాళ్లను ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనే ఫీల్ వస్తుంది. గర్వంగా కూడా అనిపిస్తుంది. అలాంటి వృద్ధ జంట దాండియా డ్యాన్స్ చేస్తూ అలరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
ఆ వీడియోలో ఇద్దరు వృద్దులు చలాకీగా దాండియా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందులో వారితో ఓ యువకుడి కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఏదో నీరసంగా అడుగులు కదపలేదు. యువకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉషారుగా ఇరువురు దాండియా ఆడారు. ఇద్దరు ఎంత లయబ్ధంగా స్టెప్పులు కదిపారంటే..కనురెప్ప వాల్చ బుద్ధి కాదు. అంత అద్భుతంగా చేశారు ఇద్దరు.
నవరాత్రి ఉత్సవాలతో దేశంలోని నలుమూలలు గార్బా, దాండియా వంటి నృత్యాలతో సందడిగా ఉంది. మరొకొన్ని చోట్ల మహిళలు ఇంధోని జ్వాలని మోస్తూ గార్బాని ప్రదర్శించారు. ఈ నృత్యం చేస్తున్న దృశ్యం ఎవ్వరినైనా మంత్రముగ్దుల్ని చేసి కట్టిపడేస్తుంది.
(చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..)
Comments
Please login to add a commentAdd a comment