Dandiya dance
-
మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ నీతా అంబానీ దసరా వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు, మనవడు పృథ్వీ, చదువుకుంటున్ నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ (NMAJS)లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతని క్లాస్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిలో బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా , సైఫ్ కుమారుడు జెహ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. దాదీ, మనవళ్ళ డ్యాన్స్ నెట్టింట సందడి చేస్తోంది.అంబానీ కుటుంబం ప్రతీ పండుగను వైభవంగా జరుపుకుంటుంది. తాజాగా నవరాత్రి సంబరాల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, కొత్త కోడలు రాధికా మర్చంట్‌తో ఉత్సాహంగా పాల్గొన్నారు. నీతా కుమార్తె ఇషా అంబానీ కుమారుడు పృథ్వీ స్కూల్లో నిర్వహించిన వేడుకలో చిన్న పిల్లలతో దాండియా స్టెప్పులు వేశారు. మనవడు పృథ్వీరాజ్ అంబానీ కరీనా కపూర్ కొడుకు జెహ్, ఇతర పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. పింక్ టోన్ స్ట్రాపీ హీల్స్,అద్భుతమైన పింక్ కలర్ సల్వార్ సెట్‌ను ధరించి నీతా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే తల్లి పూనమ్ దలాల్‌తో కలిసి గర్భా ఆచారం, అమ్మవారికి హారతి ఇచ్చి దసరా వేడుకను జరుపుకున్నారు. నీతా అంబానీ తన మనవడు, పృథ్వీ ,అతని క్లాస్మేట్లను స్టోరీ సెషన్‌తో ఆశ్చర్యపరిచారు. పెప్పా పిగ్ పుస్తకంనుంచి ఒక కథను వివరించి పిల్లలతో ఉత్సాహంగా కనిపించడం పిల్లలు శ్రద్ధగా వినడం, లంచ్‌లో వారితో ముచ్చటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలను స్కూలు యాజమాన్యం తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. -
దాండియా ఆడిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరో మాస్ యాక్షన్ మూవీతో అభిమానులను అలరించనున్నారు. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా విశ్వక్ సేన్ దసరా పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా గుజరాతీ స్టైల్లో దాండియా ఆడుతూ కనిపించారు. తన సిస్టర్‌తో కలిసి విశ్వక్ సేన్ దాండియా ఆడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. #TFNReels: Mass Ka Das @VishwakSenActor plays dandiya with his sister at Navaratri celebrations!!❤️#VishwakSen #Laila #MechanicRocky #TeluguFilmNagar pic.twitter.com/UuzlCM3ZVP— Telugu FilmNagar (@telugufilmnagar) October 11, 2024 -
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..!
కొందరూ యువకులు వయసు ఎంతో కాకపోయినా వృద్ధులు మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. అదీగాక చురుకుగా ఏ కార్యక్రమంలో పాల్గొనరు. కానీ కొందరు వృద్ధులను చూస్తే చూడముచ్చటేస్తుంది. అబ్బా ఏం ఎనర్జీ అనిపిస్తుంది. వాళ్లను ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనే ఫీల్ వస్తుంది. గర్వంగా కూడా అనిపిస్తుంది. అలాంటి వృద్ధ జంట దాండియా డ్యాన్స్ చేస్తూ అలరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఇద్దరు వృద్దులు చలాకీగా దాండియా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందులో వారితో ఓ యువకుడి కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఏదో నీరసంగా అడుగులు కదపలేదు. యువకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉషారుగా ఇరువురు దాండియా ఆడారు. ఇద్దరు ఎంత లయబ్ధంగా స్టెప్పులు కదిపారంటే..కనురెప్ప వాల్చ బుద్ధి కాదు. అంత అద్భుతంగా చేశారు ఇద్దరు. నవరాత్రి ఉత్సవాలతో దేశంలోని నలుమూలలు గార్బా, దాండియా వంటి నృత్యాలతో సందడిగా ఉంది. మరొకొన్ని చోట్ల మహిళలు ఇంధోని జ్వాలని మోస్తూ గార్బాని ప్రదర్శించారు. ఈ నృత్యం చేస్తున్న దృశ్యం ఎవ్వరినైనా మంత్రముగ్దుల్ని చేసి కట్టిపడేస్తుంది. View this post on Instagram A post shared by Tanish Shah (@theghotalaguy) (చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..) -
సికింద్రాబాద్ : దాండియా జోష్...స్టెప్పులు అదరహో (ఫొటోలు)
-
దసరా ఉత్సవాల కోసం దాండియా సన్నాహక ఈవెంట్లో సినీ తారలు, మోడల్స్(ఫొటోలు)
-
అటు దాండియా.. ఇటు మెహందీ.. కలర్ఫుల్గా అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో దాండియా ఆడుతున్న హామ్స్టిక్ విద్యార్థులు (ఫొటోలు)
-
కేరళలో దాండియా నృత్యం.. శశి థరూర్ పోస్ట్ వైరల్!
ప్రస్తుతం ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఒకే పండుగను చాలా భిన్నమైన పద్ధతుల్లో చేసుకుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా దాండియా నృత్యం చేస్తుంటారు. అయితే ఇతర రాష్ట్రాల్లోని గుజరాతీలు సైతం దాండియాను ఎంతో సంతోషంగా ఆడుతూ నవరాత్ర ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు. నవరాత్రుల సందర్భంగా కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. 'అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టెల్లో దాండియా నృత్యం' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Attention Gujarati sisters! This Navaratri, check out dandiya Kerala style! pic.twitter.com/tjNcmNd7oN — Shashi Tharoor (@ShashiTharoor) October 16, 2023 -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్‌తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. -
విజయవాడ : గార్బా అండ్ దాండియా 2023 ప్రీ ఈవెంట్ (ఫోటోలు)
-
వైరల్ వీడియో: కేకలు వేస్తూ హుషారుగా డ్యాన్స్.. ఇంతలోనే కుప్పకూలి..
-
కేకలు వేస్తూ హుషారుగా డ్యాన్స్.. ఇంతలోనే కుప్పకూలి..
దేవుడు గీసిన నుదుటి రాతను ఎవరూ మార్చలేరు అంటారు. విధి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుందంటారు పెద్దలు. విధి ఆడిన వింత నాటకంలో ఓ మనిషి సెకన్లలో ప్రాణం వదిలాడు. పండుగ పూట కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతున్న వేళ.. అతడి ప్రాణం గాలిలో కలిసిపోతుందని వారు ఊహించిఉండరు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, పండుగ సందర్భంగా ఇంట్లోని సభ్యులందరూ ఎంతో ఆనందంగా దాండియా ఆడుతున్నారు. పెద్దలు కేకలు వేస్తూ.. చిన్నారులు ఈలలు వేస్తూ.. కర్రలతో దాండియా ఆడుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి దాండియా ఆడుతూ.. సెకన్ల వ్యవధిలో కింద కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడి వద్దకు పరిగెత్తుకువచ్చారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్టు నిర్ధారించారు. దీంతో, ఎంతో ఆనందంగా ఉన్న వారి ఇంట్లో ఒక్కసారిగి విషాదఛాయలు అములుకున్నాయి. కాగా, దాండియా ఆడుతూ అతను గుండెపోటు కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఇక, ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. -
నగరంలో దాండియా సందడి
-
దాండియా.. దిల్ దియా
-
దాండియా.. దునియాలో డ్యాన్సుల హోరు !
బెంగళూరు: దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన దాండియా.. దునియా కార్యక్రమంలో గుజరాతీలు చేత రెండు చిన్న కర్రలు పట్టి ప్రత్యేక దుస్తులతో ఆడి.. పాడి అందర్నీ అలరించారు. చిన్న పిల్లల దగ్గర నుంచి అన్నీ వయస్సుల వారు డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ కార్యక్రమం శనివారం రాత్రి సుమారు రెండు గంటలపాటు సాగింది. వైట్‌ఫీల్డ్ పరిధిలోని ఫోరమ్ నైబర్‌హుడ్ మాల్లో ఈ దాండియా.. దునియా పేరుతో ఏర్పాటు చేశారు. ఈ దాండియా డ్యాన్సులకు ప్రత్యేక పాటలను రూపొందించింది. గాయనీగాయకులు, సంగీత వాయిద్యాల మధ్య ఈ డ్యాన్సుల జోరు కనువిందు చేసింది. మాల్‌కు వచ్చిన వారు నృత్యాలను చూస్తూ.. వారుకూడా మైమరిచి.. స్టెప్పులు వేయడం కనిపించింది. గుజరాతీ సంప్రాదాయ నృత్యాలైన ఈ దాండియా ఫీవర్ బాగా పెరుగుతోందనడానికి ఈ కార్యక్రమానికి లభించిన విశేష స్పందన చెబుతోంది. -
నవరాత్రుల్లో...వెలుగుపూల కోలాటం
దేశమంతా ఎదురుచూసే నవరాత్రి సంబరాలు నేటి నుంచే మొదలు. ఈ తొమ్మిది రాత్రులను అత్యంత వైభవంగా మార్చేసి, శక్తిస్వరూపిణి అయిన దుర్గామాతను నృత్యోల్లాసాలతో కొలవడానికి స్త్రీలతో పాటూ పురుషులూ పోటీపడుతుంటారు. ఈ సందర్భంగా గర్బా, దాండియా నృత్యాలుపత్యేక ఆకర్షణగా నిలుస్తుంటే వీటికి మరింత వన్నెలద్దుతున్నవి వస్త్రాలంకరణలే! గుజరాతీల సంప్రదాయ వైభవం తెలుగురాష్ట్రాలలోనూ సందడి చేయడంతో ఇక్కడా గర్బా, దాండియా నృత్యాల ఆనందహేల ప్రతి మదిని తట్టి లేపుతోంది. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగుల్లో మరింత దేదీప్యమానంగా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయే స్త్రీ, పురుషులు ఈ తొమ్మిది రాత్రులకు కొత్త భాష్యం చెప్పనున్నారు. దాండియా, గ ర్బా నృత్యాలలో సందడి చేయడానికి మీ వేషధారణను సరికొత్తగా మార్చుకునే సమయం ఇదే! గర్బా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ‘గర్భ’, ‘దీపం’ అనే సంస్కృత పదాల నుంచి ఈ పేరు పుట్టింది. గర్బా పాటలలో శ్రీకృష్ణుడి లీలను కీర్తిస్తూ, తొమ్మిది మంది దేవతామూర్తులను కొలిచే ప్రక్రియ కనపడుతుంది. ఈ నృత్యం మొట్టమొదట శ్రీకృష్ణుని పట్టమహిషి అయిన రాణీ రుక్మిణీ దేవి ద్వారకలో నవరాత్రి ఉత్సవాల సందర్భం గా చేసిందని అంటారు. అతివలు వలయాకా రంగా చేరి చేతులతో చప్పట్లు తడుతూ తిరుగు తారు. దీనిని దేవతకు ఇచ్చే హారతిగా భావిస్తారు. కోలాటం కర్రలతో స్త్రీ, పురుషులిరువురూ ఆడేది దాండియా! మహిళల అలంకరణ గర్బా, దాండియా నృత్యానికి మహిళలు రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరిస్తారు. దీంట్లో ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ.. వంటి కాంతిమంతమైన రంగు దుస్తులను ఎంచుకుంటారు. పూసలు, పెద్ద పెద్ద అద్దాలు, గవ్వలను ఉపయోగిస్తూ చేసిన ఎంబ్రాయిడరీ అంచులతో ఈ దుస్తులను ఆక ర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇది పూర్తిగా గుజరాతీ సంప్రదాయ కట్టు. దీంతో పాటూ సంప్రదాయ ఆభరణాలైన మెరిసే గాజులు, జుంకాలు, రెండు-మూడు హారాలు, నడుము పట్టీలు, కాళ్లకు గజ్జెలు.. మేని అలంకరణకు ఉపయోగిస్తారు. నవరాత్రులలో మీ అలంకరణ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వీటన్నింటి ఎంపిక అవసరం. ప్రయోగం ఎంత సంప్రదాయ దుస్తులైనా మీదైన ప్రత్యేకత మీరు ధరించే దుస్తుల్లో కనబరచాలి. ఇందుకు ప్రసిద్ధ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ అస్మితా మార్వా, అనితా అరోరా, రాహుల్ మిశ్రా.. వంటి వారి డిజైన్స్‌తో మీ దుస్తుల్లోనూ వైవిధ్యం తీసుకురావచ్చు. కాటన్ ప్రధానం దాండియా ఆటలో చెమట అధికంగా పడుతుంది. ఇలాంటప్పుడు చెమటను పీల్చుకునే దుస్తులు సరైన ఎంపిక. మగవారి ముస్తాబు జీన్స్, టీ షర్ట్స్‌తో విసుగెత్తిపోయిన వారు దాండియా రాత్రులను మరచిపోలేరు. దీనికి కారణం మగవారి వేషధారణ ఎంతో వైవిధ్యంగా, సంప్రదాయబద్ధంగా ఉండటమే! దాండియా ఆటలో మగవారు ‘కెడియు’ అనే సంప్రదాయ దుస్తులను దరిస్తారు. చిన్న కుర్తా, కుచ్చుల బాటమ్, తలపై పెట్టుకునే టోపీ (టర్బన్)తో ప్రత్యేకంగా కనిపిస్తారు. బాందీనీ ప్రింట్ కుర్తాకి అద్దాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. షేర్వాణీ ‘కెడియా’ ధరించ డానికి ఇబ్బంది పడేవారు వదులుగా ఉండే పైజమా, లాల్చీ/ ధోతీ, షేర్వాణీ ధరించవచ్చు. బెనారస్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ చేసిన షేర్వాణీ దాండియాను శోభాయమానం చేస్తుంది. రాజ్‌పుత్ కుర్తా కూడా ఈ వేడుకలో వైవిధ్యం కనబరచడంతో పాటు సంప్రదాయపు కళను ఉట్టిపడేలా చేస్తుంది. మేకప్ ఎంత అలంకరణ అయినా బాగుంటుందని అతిగా మేకప్ చేసుకోకూడదు. దాండియా నృత్యంలో పట్టే చెమట వల్ల మేకప్ ముఖమంతా అలుక్కుపోయే ఆస్కారమూ ఉంటుంది. అసౌకర్యంగానూ ఉంటుంది. అందుకని పెద్దగా మేకప్ లేకుండా కళ్లకు మస్కారా, ఐ షాడో తీర్చిదిద్దుకుంటే చాలు. నుదుటన ఆకట్టుకునే బిందీ, చుబుకం పైన చిన్న కాటుక చుక్కలే వీటికి సింగారం. బరువు తగ్గచ్చు క్రమం తప్పకుండా చేసే యోగా, జిమ్,వ్యాయామాలు విసుగు పుట్టిస్తాయి. అదే దాండియా మనోల్లాసాన్ని కలిగిస్తుంది. నవరాత్రు లకు ముందు నెల రోజుల ముందుగా దాండియా సాధన చేయడం వల్ల దాదాపు 4 కేజీల బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఫిట్నెస్ ట్రైనర్లు. గర్బా డ్యాన్స్ వల్ల శరీర మంతా కదులుతుంది. భావోద్వేగా లను అదుపు చేసుకోగలుగుతాం. గంట సేపు చేసే ఈ నృత్యం వల్ల సుమారు 500-700 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. నడుము పై భాగం, పిరుదులు, పాదాలకు మంచి వ్యాయామం అవుతుంది. మనసు, శరీరం ఉత్తేజం పొందుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. బృందావనంలో రాధాకృష్ణుల ప్రణయగీతాల మధురిమలను దాండియా నృత్యం గర్తుచేస్తుంటుంది. ఓ వైపు నృత్యం, సంగీతంతో ఆధ్యాత్మికత ఊపిరిపోసుకుంటుంది. మరోవైపు ఎటు చూసినా ఆనందం తాండవం చేస్తుంది. ఇలాంటి అపురూప సమయాలను పూర్తిగా ఆస్వాదించడానికీ.. శరీరానికి, మనసుకు కొత్త ఉల్లాసాన్ని అందించడానికి ఇప్పుడే సిద్ధం కండి. దాండియా అడుగులు వేయడానికి కోలాటం కర్రలు చేత పట్టండి. సంగీతానికి అనుగుణంగా పాదాలు కదపండి. లయబద్ధమైన నృత్యంలో దుస్తుల మెరుపులలో మైమరచిపోండి. - నిర్మలారెడ్డి -
కరీంనగర్లో దాండియా నృత్యాలు