కేరళలో దాండియా నృత్యం.. శశి థరూర్ పోస్ట్ వైరల్! | Congress MP Shashi Tharoor Shares Dandiya Dance In Kerala Style | Sakshi
Sakshi News home page

Dandiya Dance: కేరళలో దాండియా నృత్యం.. శశి థరూర్ పోస్ట్ వైరల్!

Published Tue, Oct 17 2023 4:18 PM | Last Updated on Tue, Oct 17 2023 4:32 PM

Congress MP Shashi Tharoor Shares Dandiya Dance In Kerala Style - Sakshi

ప్రస్తుతం ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఒకే పండుగను చాలా భిన్నమైన పద్ధతుల్లో చేసుకుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా దాండియా నృత్యం చేస్తుంటారు. అయితే ఇతర రాష్ట్రాల్లోని గుజరాతీలు సైతం దాండియాను ఎంతో సంతోషంగా ఆడుతూ నవరాత్ర ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు.

నవరాత్రుల సందర్భంగా కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ట్వీట్ చేశారు. 'అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టెల్లో దాండియా నృత్యం' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement