వయనాడ్‌ విషాదం.. వివాదంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ | Shashi Tharoor Trolls On Wayanad Landslide Tweet | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విషాదం.. వివాదంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌

Published Sun, Aug 4 2024 11:42 AM | Last Updated on Sun, Aug 4 2024 12:11 PM

Shashi Tharoor Trolls On Wayanad Landslide Tweet

తిరువనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. దీంతో దైవ భూమి కేరళ ఇప్పుడు మరుభూమిలా మారింది. అటవీ, కొండ ప్రాంతమైన వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో తాజా మరణాలు ఆదివారం (ఆగస్ట్‌4) ఉదయం 10.30 గంటల సమయానికి 357కి చేరుకున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.

మరోవైపు కొండ చరియలు విరుచుకుపడడంతో సర్వం కోల్పోయి, తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య సహాయం కొనసాగుతుంది. వారికి అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు నేరుగా సహాయ కేంద్రాలను సందర్శిస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కావాల్సిన నిత్య సరాల్ని తీరుస్తున్నారు.

మండక్కై జంక్షన్, చూరాల్‌మల ప్రాంతాలు భవనాలు, బురద నిందిన వీధులు, రాళ్లతో మృత్యు దిబ్బులుగా మారాయి. ఆ రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిపోక ముందు సుమారు 450 నుంచి 500 పైగా ఇళ్లుండేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. భారీ రాళ్లే దర్శనమిస్తున్నాయి. భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మురం చేస్తున్నాయి. 1300 మందికి పైగా ఆర్మీ జవానులు జాడ తెలియని వారికోసం అన్వేషిస్తున్నారు. 

ఈ తరుణంలో కేరళ రాజధాని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్‌ వయనాడ్‌ బాధితుల్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  తాత్కాలికంగా వారికి కావాల్సిన బెడ్‌ షీట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజా ప్రతినిధులందరూ వయనాడ్‌కు సహాయం చేయాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.

ఇదే విషయంపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. వయనాడ్‌ విషాదంపై మరపురాని రోజు కొన్ని జ్ఞాపకాలు అంటూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై వివాదం నెలకొంది.

 

ఇలాంటి విషాదాన్ని వివరించినందుకు ఆయన మెమరబుల్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని బీజేపీ నేతలతో సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణిస్తే జ్ఞాపకం ఎలా అవుతుందని  ప్రశ్నిస్తున్నారు.

శశి థరూర్‌కి విపత్తులు, మరణాలు చిరస్మరణీయం చెప్పడం సిగ్గుగా ఉందని మరో  యూజర్‌ ట్వీట్‌ చేశారు.  

బీజేపీ ఐటి సెల్ చీఫ్ ,బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా..‘శశి థరూర్ మరణాలు, విపత్తులు చిరస్మరణీయం’ అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ వివాదంపై శశిథరూర్‌ మరో ట్వీట్‌ చేశారు. ట్రోలర్స్‌  అందరికి అంటూ మెమొరిబుల్‌పై నా ఉద్ద్యేశ్యం వేరే ఉంది.  పలు సందర్భాలలో ఊహించని సంఘటనల్ని, విషాదాల్ని గుర్తుచేసుకునే విధంగా నిలుస్తుందని అర్థం అంటూ వివరణిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement