
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరో మాస్ యాక్షన్ మూవీతో అభిమానులను అలరించనున్నారు. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా విశ్వక్ సేన్ దసరా పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా గుజరాతీ స్టైల్లో దాండియా ఆడుతూ కనిపించారు. తన సిస్టర్‌తో కలిసి విశ్వక్ సేన్ దాండియా ఆడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
#TFNReels: Mass Ka Das @VishwakSenActor plays dandiya with his sister at Navaratri celebrations!!❤️#VishwakSen #Laila #MechanicRocky #TeluguFilmNagar pic.twitter.com/UuzlCM3ZVP
— Telugu FilmNagar (@telugufilmnagar) October 11, 2024
Comments
Please login to add a commentAdd a comment