దేవుడు గీసిన నుదుటి రాతను ఎవరూ మార్చలేరు అంటారు. విధి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుందంటారు పెద్దలు. విధి ఆడిన వింత నాటకంలో ఓ మనిషి సెకన్లలో ప్రాణం వదిలాడు. పండుగ పూట కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతున్న వేళ.. అతడి ప్రాణం గాలిలో కలిసిపోతుందని వారు ఊహించిఉండరు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, పండుగ సందర్భంగా ఇంట్లోని సభ్యులందరూ ఎంతో ఆనందంగా దాండియా ఆడుతున్నారు. పెద్దలు కేకలు వేస్తూ.. చిన్నారులు ఈలలు వేస్తూ.. కర్రలతో దాండియా ఆడుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి దాండియా ఆడుతూ.. సెకన్ల వ్యవధిలో కింద కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడి వద్దకు పరిగెత్తుకువచ్చారు.
కుటుంబ సభ్యులు అందరూ కలిసి అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్టు నిర్ధారించారు. దీంతో, ఎంతో ఆనందంగా ఉన్న వారి ఇంట్లో ఒక్కసారిగి విషాదఛాయలు అములుకున్నాయి. కాగా, దాండియా ఆడుతూ అతను గుండెపోటు కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఇక, ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment