పానీ పూరీ: ఈ అనిల్‌ భాయ్‌ లెక్కే వేరు: వైరల్‌ వీడియో | meet anil bhai thakkar gujarat pani puri sellerlooks pm Modi | Sakshi
Sakshi News home page

పానీ పూరీ: ఈ అనిల్‌ భాయ్‌ లెక్కే వేరు: వైరల్‌ వీడియో

Published Sat, Apr 27 2024 4:40 PM | Last Updated on Sat, Apr 27 2024 4:40 PM

meet anil bhai thakkar gujarat pani puri sellerlooks pm Modi

పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే  పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు.   ఆయన పేరే గుజరాత్‌కు చెందిన అనిల్‌ భాయ​ ఠక్కర్‌. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాడు.  స్టోరీ ఏంటంటే.. 

మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్‌స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్‌ స్టయిల్‌ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో  కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్‌లోని ఆనంద్‌లో ‘తులసి పానీ పూరీ సెంటర్‌’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్‌నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. 

ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు  ఆనందంగా అనిల్‌ భాయ్‌. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే  తన స్టాల్‌ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని  అనిల్‌ భాయ్‌ చెప్పుకొచ్చాడు.

 

అనిల్‌ భాయ్‌ వాస్తవానికి జునాగఢ్‌కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన  'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే  నడిపిస్తున్నాడు.   కాగా ముంబైలోని  మలాడ్‌కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో  నిలిచాడు.  గర్భా వాయిస్తున్న వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement