ప్రతి నెలా విద్యుత్ బిల్లు తీసేందుకు స్పాట్ బిల్లర్ మన ఇంటికి రావడం..మీటర్‌లో రీడింగ్ చూసి బిల్లు కొట్టడం. అందులో తప్పులు తడకలు రావడం..వినియోగదారులు బిల్లు ఎక్కువ వచ్చిందని గగ్గోలు పెట్టడం..ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎదురవుతున్న విద్యుత్ కష్టాలు. ఇకపై ఇలాంటి కష్ట, నష్టాలకు చెక్ పెట్టేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు సన్నద్ధమయ్యూరు. నూతన సాఫ్ట్‌వేర్‌తో ఐఆర్‌డీఏ పోర్టు విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు నడుం బిగించారు. దశల వారీగా ఈ విధానం అమలుతో కచ్చితమైన బిల్లింగ్‌కు శ్రీకారం చుట్టారు.
గురజాల : గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రస్తుతం వాడుతున్న పాత విద్యుత్ మీటర్ల స్థానంలో ఐఆర్‌డీఏ పోర్టు మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటర్లు మార్చుకునేందుకు వినియోగదారులపై ఎలాంటి భారం పడదు. మీటర్ల ఏర్పాటు తర్వాత జీపీఆర్‌ఎస్ టెక్నాలజీతో సాఫ్టవేర్‌ను ప్రస్తుతం బిల్లింగ్ చేస్తున్న మిషన్‌లకు అనుసంధానం చేస్తారు. ఈ మిషన్‌లో సిమ్ కార్డు వేస్తారు. ఇలా స్పాట్ బిల్లింగ్ ఏజెంట్ ఐఆర్‌డీఎ పోర్ట్ మీటర్ వద్దకు వెళ్లి రీడింగ్ నమోదు చేసే అవసరం లేకుండా స్విచ్ నొక్కగానే ఎంత వినియోగించారో తెలుస్తుంది. కచ్చితమైన రీడింగ్ వస్తుంది.
కొనసాగుతున్న ప్రక్రియ...
గురజాల విద్యుత్ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం ఐఆర్‌డీఏ పోర్టు మీటర్లు బిగిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వాణిజ్య, గృహ అవసరాలకు సుమారుగా 10 లక్షల 47 వేల విద్యుత్ మీటర్లున్నాయి. వాటిలో సుమారుగా 80 శాతం మేర పోర్టు మీటర్లు బిగించినట్లు విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. మిగిలిన 20 శాతం జనవరి నెలాఖరుకల్లా ఏర్పాటు చేస్తామన్నారు.
లాభాలు ఇవి..
వినియోగదారులకు బిల్లులు లెక్కింపులో తప్పిదాలు వచ్చే అవకాశం ఉండదు.
కార్యాలయాలు చూట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవాల్సిన పని లేదు.
వినియోగదారులు కరెంట్ బిల్లుల సమాచారాన్ని సత్వరమే సర్వర్‌లో పొందుపరిచే అవకాశం ఉంటుంది.
మానవ ప్రమేయం తక్కువ..
మీటర్లుకు ఐఆర్‌డీఏ పోర్టు అనుసంధానం చేయడంతో కచ్చితమైన బిల్ రీడింగ్ వస్తుంది. ఇప్పటి వరకు మీటర్ ఎంత తిరిగిందో చూసి బిల్లు నమోదు చేసే వారు. ఈ క్రమంలో కొన్ని సార్లు పొరబాట్లు దొర్లుతున్నారుు. ఐఆర్‌డీఏ పూర్తి సాంకేతిక పరమైంది కావడంతో మానవ తప్పిదాలు ఉండవు.
పఠాన్ హుస్సేన్ ఖాన్,
అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీరు
ఐఆర్‌డీఏతో బిల్లింగ్ పక్కా
Published Tue, Dec 22 2015 12:48 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement