Microsoft Co Founder Bill Gates Recommends Five Great Books To Read - Sakshi
Sakshi News home page

బిల్‌గేట్స్‌ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా?

Published Wed, Jun 8 2022 11:11 AM | Last Updated on Wed, Jun 8 2022 11:56 AM

Microsoft Co founder Bill Gates recommends five great books to read - Sakshi

ప్రపంచ కుబేరుడిగా సుదీర్ఘ కాలం నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌. సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీకి కొత్త దిశను చూపడమే కాదు ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు గేట్స్‌. బిజినెస్‌ వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటు ఆయన మానుకోలేదు. రెగ్యులర్‌గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సజెస్ట్‌ చేస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు. వాటిని చదవడం ఎంతో మంచిదంటున్నారు.

1) ది పవర్‌ 
ది పవర్‌ పుస్తకాన్ని బ్రిటీష్‌ రచయిత నయోమీ అ‍ల్డర్‌మ్యాన్‌ రాశారు. ఈ నవల ఫిక్షన్‌ విభాగంలో 2017లో రిలీజైన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ పుస్తకం చదవాలంటూ గేట్స్‌కి ఆయన కూతురు సూచించారట. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పైకి కనిపించని ఇబ్బందుతుల తదితర అంశాలను ఇందులో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. 

2) వై వీ ఆర్‌ పోలరైజ్డ్‌
అమెరికన్‌ జర్నలిస్టు రాసిన మరో పుస్తకం వై వీ ఆర్‌ పోలరైజ్డ్‌. అమెరికా రాజకీయలు ప్రధాన ఇతివృత్తంగా ఉండే ఈ ఫిక‌్షన్‌ నవల సైకాలజీ మీద కూడా ఫోకస్‌ చేస్తుంది.

3) ది లింకన్‌ హైవే
అమోర్‌ టవెల్స్‌ రాసిన ది లింకన్‌ హైవే పుస్తకం కూడా చదివి తీరాల్సిందే అంటున్నాడు బిల్‌గేట్స్‌. గతంలో అమెర్‌ టవెల్స్‌ రాసిన ఏ జెంటిల్‌మెన్‌ ఇన్‌ మాస్కోకి కొనసాగింపుగా ఈ పుస్తకం వచ్చింది. మొదటిదాని కంటే రెండోది మరీ బాగుందంటూ కితాబు ఇచ్చారు బిల్‌గేట్స్‌.

4) ది మినిస్ట్రీ ఫర్‌ ది ఫ్యూచర్‌
కిమ్‌ స్టాన్లీ రాబిన్‌సన్‌ రాసిన సైన్స్‌ ఫిక‌్షన్‌ నవల ది మినిస్ట్రీ ఫర్‌ ది ఫ్యూచర్‌. వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తు ఎంత దుర్లభంగా ఉంటుందనే అంశాలను లోతుగా చర్చించిన పుస్తకం ఇది. ప్రకృతి పట్ల మన బాధ్యతను ఈ పుస్తకం గుర్తు చేస్తుందంటున్నారు గేట్స్‌.

5) హౌ ది వరల్డ్‌ రియల్లీ వర్క్స్‌
ప్రముఖ రచయిత వాక్లవ్‌ స్మిల్‌ కలం నుంచి జాలువారిన మరో మాస్టర్‌ పీస్‌ హౌ ది వరల్డ్‌ రియల్లీ వర్క్స్‌. జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి. వాటి ఆధారంగానే మన జీవనశైలి ఏలా మారుతుందనే అంశాలను ఇందులో విపులంగా చర్చించారు.

చదవండి: బిల్‌గేట్స్, ఎలాన్‌ మస్క్‌ మాటల యుద్ధం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement