అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నిరక్షరాస్యులు ఎక్కువైపోయారు. జీతం రూ.50వేల నుంచి రూ.70 వేలు తీసుకుంటున్నా... ఇంగ్లిష్‌లో చిన్న పదం కూడా రాయలేని పరిస్థితి. దీంతో పాలనా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పనుల్లో తీవ్ర జాప్యం
ఎస్కేయూలో దాదాపు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు తమ ‘డిజిగ్నేషన్’ కూడా ఇంగ్లిష్‌లో సరిగా రాయలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం ఒక లెటర్‌ను టైప్ చేసి ఉన్నతాధికారులకు పంపడం కూడా వీరికి చేతకాదు. ఒకప్పుడు డైలీ వేజ్ కింద వారంతా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగాన్ని పరి్మనెంట్ చేసుకుని రికార్డు అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్నారు.
అయితే అందుకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా ఫైల్ డ్రాఫ్టింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపలేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇటీవలే వీరందరికీ ప్రత్యేకంగా కంప్యూటర్ నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇచ్చినప్పటికీ, అభ్యసించలేక వెనుకబడ్డారు. దీంతో వారందరినీ నైపుణ్యం లేని విధుల్లో నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే జూనియర్ అసిస్టెంట్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
(చదవండి: బాబు పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడ?)
Comments
Please login to add a commentAdd a comment