Junior Assistants
-
26 నుంచి రైతు భరోసా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా వర్తింపజేస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పథకం కోసం రూ.8,400 కోట్లను వెచ్చించడానికి ప్రాథమికంగా అంచనా వేశామని వెల్లడించారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎన్పిడీసీఎల్)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన 92 మందికి శనివారం సాయంత్రం సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. భూమి లేని రైతుకూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మి య భరోసా పథకం కింద ఈ నెల 26వ తేదీ తర్వాత మొదటి విడత వాయిదా (ఇన్స్టాల్మెంట్) డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. అబద్ధాల పార్టీ.. పదేపదే అబద్ధాలు అబద్ధాల మీద పుట్టిన రాజకీయ పార్టీవాళ్లు పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు భ్రమలు కల్పించి బతికారని, ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు ఇస్తామని గత పాలకులు హామీ ఇచ్చి గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దావోస్ వెళ్లారని భట్టి తెలిపారు. యాసంగిలో నాణ్యమైన విద్యుత్: తుమ్మల యాసంగి సీజన్ రైతులు పండిస్తున్న వరి పంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 35 శాతం నిధులు కేటాయించామని చెప్పారు. పంటలసాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, వరుణ్ రెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు డీఏ విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ డీఏను మంజూరు చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను సభా వేదికగా భట్టి విక్రమార్క విడుదల చేశారు. 11.78% నుంచి 14.074 శాతానికి పెరిగిన డీఏను గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపజేయనున్నారు. విద్యుత్ ఉద్యోగులకు వేతన అడ్వాన్స్‌లు, రుణాల చెల్లింపుల కోసం విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 28 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కోసం రూ.8,729 కోట్లను అందజేస్తున్నామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.148.5 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.1,485 కోట్ల బిల్లులను చెల్లించిందని తెలిపారు. రాష్ట్రంలో 25 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ గ్రామాలుగా మార్చబోతున్నామని, వ్యవసాయ పంపు సెట్లకు, గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తామని వివరించారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ ఉద్యోగులు
ఆదోనిఅర్బన్/ఆదోనిటౌన్: లంచం తీసుకుంటూ ఆదోని మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మున్సిపల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరణ్ నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకుని, వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం అరుంజ్యోతినగర్ ఆదిఆంధ్ర మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు గతంలో కొన్ని కారణాలతో సస్పెండ్ అయ్యాడు. వేతనం రాకపోవడంతో నాన్–డ్రాయల్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ భాస్కర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరణ్‌ను ఆశ్రయించాడు. సర్టిఫికెట్ కోసం రూ.30 వేలకు డీల్ కుదుర్చుకున్నాడు. మొదట విడతగా రూ.5 వేలు ఇచ్చి, రెండో విడత సోమవారం రూ.10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐలు తేజేశ్వర్రావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్, ఇంతియాజ్‌బాషా, క్రిష్ణయ్య, ఎస్ఐ సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో కమిషనర్ రఘునాథ్‌రెడ్డి వచ్చి అక్కడి నుంచి వెంటనే తిరిగి తప్పించుకొని వెళ్తుండగా ఏసీబీ అధికారులు చూసి ఆయన వాహనాన్ని వెంబడించారు. మున్సిపల్ కమిషనర్‌ను పిలుచుకొని కార్యాలయంలోని చాంబర్లో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే తమకు సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇందుకోసం 14400 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. దొంగ సర్టిఫికెట్తో ఉద్యోగంలో.. ఆదిఆంధ్ర మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు దొంగ సర్టిఫికెట్తో ఉద్యోగం సంపా దించాడనే ఆరోపణలతో సంబంధిత అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. అంతేగాకుండా ఆయన ఉద్యోగం చేసినప్పటి నుంచి ఆయనకు వచ్చిన జీతం రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు జీతం రావడం లేదని, మరలా జీతం పొందేందుకు అవసరమైన క్లియరెన్స్ కోసం నాన్–డ్రాయల్ సర్టిఫికెట్ పొందేందుకు మున్సిపల్ అధికారులతో ఆయన రూ.30 వేలు డీల్ కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.5 వేలు అందజేశాడు. రెండో విడతలో డబ్బు ఇచ్చే సమయంలో అవినీతి అధికారులను ఆశ్రయించాడు. -
‘సింగరేణి’ నియామకాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు ఊరటనిచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష ఫలితాలను వెల్లడించి, నియామక ప్రక్రియ చేపట్టవచ్చని చెప్పింది. అభ్యర్థులను ఎంపిక చేయ వచ్చని చెబుతూ.. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూని యర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022 లో సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 98,882 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2022, సెప్టెంబర్ 4న రాష్ట్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్షకు 79, 898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవ కతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేశారు. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. కాగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ పరీ క్ష రాసిన పలువురు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ జె.అనిల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సింగరేణి తరఫున స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమా ర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ని యామక ప్రక్రియకు అనుమతించింది. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని చెబుతూ విచారణను వాయిదా వేసింది. కాగా, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్.బలరామ్ తెలిపారు. త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. -
వీఆర్వోలు ‘వెనక్కి’?
సాక్షి, హైదరాబాద్: జీతం లేదు.. సీనియారిటీ లేదు.. పదోన్నతులు రావు... పనిచేసేందుకు వెళ్లిన శాఖలో వివక్ష... ఉన్నచోట ఒక్కరికే పది పనులు.. లేనిచోట ఎలాంటి పనీ లేదు.. పేరుకే జూనియర్ అసిస్టెంట్... చేయాల్సింది మాత్రం తోటమాలి, వాచ్‌మన్, అటెండర్ పనులు.. ఇవీ ఇతర శాఖల్లోకి వెళ్లిన ‘గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల)’పరిస్థితి. సర్దుబాటులో భాగంగా ఇతర శాఖల్లోకి వెళ్లినవారు ఆయా చోట్ల కష్టాలు, సమస్యలను తట్టుకోలేక.. తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కొన్నినెలలుగా చర్చ సాగుతున్నా.. వీఆర్ఏల సర్దుబాటు నేపథ్యంలో బలంగా తెరపైకి వస్తోంది. వీఆర్ఏలను సర్దుబాటు చేసిన తరహాలోనే తమకు కూడా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలనే డిమాండ్ వస్తోంది. దీనికి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వీఆర్వోలకు పేరు మార్చి, రెవెన్యూశాఖలోనే భూసంబంధిత పనులు కాకుండా ఇతర విధులు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక ఇబ్బందితో.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో.. సుమారు 5,400 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సి వచ్చింది. విద్య, మున్సిపల్, వైద్యం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇలా పలు ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వారిని సర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖల్లోకి రావడంతో వారి సీనియారిటీని కోల్పోయారు. ఆరేళ్ల నుంచి గరిష్టంగా 20ఏళ్లవరకు సీనియారిటీని కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. పేరుకు జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఇతర శాఖల్లో చేరినా.. ఆయాచోట్ల రికార్డు అసిస్టెంట్‌గా, తోటమాలిగా, అటెండర్‌గా పనిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా వెళ్లిన వారికి కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవని చెప్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఓ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా చేరిన ఓ వీఆర్వోకు శక్తికి మించిన బాధ్యతలు ఇచ్చారని.. లీగల్ సెల్, ఇళ్లు కూలగొట్టడం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, చెట్ల పెంపకం, పార్కుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ఆసరా పింఛన్లలో వేలిముద్రల గుర్తింపు పనులు అప్పగించారని వీఆర్వో వర్గాలు చెప్తున్నాయి. అన్ని పనులు చేయలేక మానసిక వేదనతో సదరు వీఆర్వో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని అంటున్నాయి. పని లేక.. జీతాలు రాక.. ఇక సొసైటీలు, కార్పొరేషన్లు, కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వెళ్లిన వీఆర్వోలకు స్థానిక నిధుల నుంచే వేతనం ఇస్తుండటంతో.. కొందరికి నాలుగైదు నెలలుగా జీతాల్లేవని అంటున్నారు. కొన్నిజిల్లాల్లో అవసరమైన ఉద్యోగుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్)కు మించి పోస్టింగులు ఇచ్చారని, ఐదుగురు సిబ్బంది అవసరమైన చోటకు 10 మందిని పంపారని, అక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది నుంచి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని, తమకు పదోన్నతులు రాకుండా చేయడానికి వచ్చారా? అంటూ మండిపడుతున్నారని చెప్తున్నారు. సొంత శాఖలో సమస్యలు కూడా పరిష్కారం కాక మాజీ వీఆర్వో లు రెవెన్యూ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీసు వ్యవహారాల ఫైళ్లు సీసీఎల్ఏ, రెవెన్యూ కార్యదర్శి పేషీల్లో పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రత్యేక, సాధారణ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వర్తింపు అంశాల్లో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తమకు సమస్యగా మారిందని వీఆర్వోలు వాపోతున్నారు. సంఘాలకు అతీతంగా సమావేశమై.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రంలోని 33 జిల్లా లకు చెందిన మాజీ వీఆర్వోలు బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. సంఘాలకు అతీతంగా ‘సమస్యలపై చర్చ–ప్రభుత్వానికి నివేదన’అనే నినాదంతో తమ ఉద్యోగ హక్కులకు భద్రత కల్పించాలని.. లేదంటే మాతృశాఖకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్వోలను ఇతర శాఖల్లో కలపడం వల్ల సీనియారిటీ దెబ్బతింటుందని, వేల మంది ఇబ్బందిపడుతున్నారని టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసుకు భద్రత లేక వారంతా ఆందోళనలో కూరుకుపోయారన్నారు. అయితే.. వీఆర్వోల సమావేశం నిర్వహణ వెనుక ప్రభుత్వంలో కీల క హోదాలో ఉన్న కొందరు నాయకులు ఉన్నారని, వారి సలహా మేరకే ఈ సమావేశం నిర్వహించారని సమాచారం. భూసంబంధిత అంశాలు మినహా మిగతా రెవెన్యూ వ్యవహారాల ను చూసుకునేందుకు వీఆర్వోల పేరు మార్చి మళ్లీ రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీఆర్‌ఏలతోనే తంటా! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీఆర్ఏ సర్దుబాటు ప్రక్రియ వీఆర్వోలలో అలజడికి కారణమైంది. తమకంటే కింది కేడర్‌లో పనిచేసిన వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయడంతోపాటు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ.. రెవెన్యూ శాఖల్లోనే కొనసాగిస్తున్నారని, అదే పద్ధతిని తమ విషయంలో ఎందుకు పాటించలేదని వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు. సర్వీసు వ్యవహారాలు పెండింగ్‌లో ఉండటంతో చాలా జిల్లాల్లో వేతనాలు రావడం లేదని, ప్రతి విషయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోందని అంటున్నారు. రెవెన్యూలో మరిన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, తమను వెనక్కి తీసుకోవడమే ఏకైక పరిష్కారమని పేర్కొంటున్నారు. -
జీతం రూ.70 వేలు ..చదవ లేరు..రాయలేరు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నిరక్షరాస్యులు ఎక్కువైపోయారు. జీతం రూ.50వేల నుంచి రూ.70 వేలు తీసుకుంటున్నా... ఇంగ్లిష్‌లో చిన్న పదం కూడా రాయలేని పరిస్థితి. దీంతో పాలనా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనుల్లో తీవ్ర జాప్యం ఎస్కేయూలో దాదాపు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు తమ ‘డిజిగ్నేషన్’ కూడా ఇంగ్లిష్‌లో సరిగా రాయలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం ఒక లెటర్‌ను టైప్ చేసి ఉన్నతాధికారులకు పంపడం కూడా వీరికి చేతకాదు. ఒకప్పుడు డైలీ వేజ్ కింద వారంతా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగాన్ని పరి్మనెంట్ చేసుకుని రికార్డు అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్నారు. అయితే అందుకు తగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా ఫైల్ డ్రాఫ్టింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపలేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇటీవలే వీరందరికీ ప్రత్యేకంగా కంప్యూటర్ నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇచ్చినప్పటికీ, అభ్యసించలేక వెనుకబడ్డారు. దీంతో వారందరినీ నైపుణ్యం లేని విధుల్లో నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే జూనియర్ అసిస్టెంట్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. (చదవండి: బాబు పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడ?) -
తెలంగాణ, ఏపీ, డిగ్రీ.. ఇవి అభ్యర్థుల పేర్లట!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శ్రీరాంపూర్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎస్సెస్సీ, డిగ్రీ.. ఇవేంటో తెలుసా? ఇటీవల సింగరేణి జూనియర్ అసిస్టెంట్ హాల్టికెట్లలో అభ్యర్థుల పేర్లు. వినడానికి, చదవడానికి ఇవి నవ్వు పుట్టిస్తున్నా.. ఇది నిజమే. ఇటీవల సెప్టెంబర్ 4న జరిగిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలు ఈ నెల 10న విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 98,882 మంది దరఖాస్తు చేసుకోగా 77,898 మంది హాజరయ్యారు. వీరిలో 49,328 మంది అనర్హులవగా 28,570 మంది అర్హత సాధించారు. ఈ క్రమంలో ఆదివారం ఫలితాలను గమనించిన అభ్యర్థులు నిర్వహణతీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. హాల్‌టికెట్లపై అక్షరదోషాలకు బదులు అచ్చుతప్పులు ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు.. వి.శ్రీధర్ అనే అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 7709069) పేరు స్థానంలో ‘తెలంగాణ’అని ఉంది. బి.మణికంఠ అనే అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 2204302) పేరు స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని, బి.లలిత అనే అభ్యర్థి(హాల్‌టికెట్ నంబర్ 2218581) పేరు ‘డిగ్రీ’అని ఉంది. ఆంధ్రప్రదేశ్ అని ప్రచురించిన హాల్‌టికెట్ మరో అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 3308978) పేరుకు బదులుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని రాసి ఉంది. అసలే పరీక్ష నిర్వహణపై ముందు నుంచీ పలు రకాల వదంతులు చెలరేగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హాల్టికెట్లలో తప్పులు దొర్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సింగరేణి తీరును ఎండగడుతూ సోషల్ మీడియాలో మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. -
గురుకులాల్లో మరో 1,000 కొలువులు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా మరో వెయ్యి కొలువుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ బోధన విభాగానికి సంబంధించినవే. తాజాగా మరో వెయ్యి బోధనేతర ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అనుమతులు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఉద్యోగ ఖాళీల వివరాలను సంబంధిత గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా గుర్తించిన ఖాళీలన్నీ జూనియర్ అసిస్టెంట్ కేడర్‌కు చెందినవే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నప్పుడు కేటగిరీల వారీగా పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 10 వేల ఉద్యోగాలను మూడేళ్ల క్రితం భర్తీ చేయగా..ఇప్పుడు మరిన్ని ఖాళీల భర్తీకి ఉపక్రమించింది. అత్యధికంగా బీసీ గురుకులంలో.. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిం చనున్న వెయ్యి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీలోనే ఉన్నాయి. దాదాపు 450 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేవలం బీసీ గురుకుల సొసైటీలోనే భర్తీ కానున్నాయి. ఆ తర్వాత 300 పోస్టులు మైనార్టీ, 150 పోస్టులు ఎస్సీ, మరో 100 పోస్టులు ఎస్టీ గురుకుల సొసైటీలో భర్తీ కానున్నట్లు సమాచారం. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఉన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ బాధ్యతలు టీఎస్పీఎస్సీకే ప్రభు త్వం అప్పగించింది. దీంతో ఈ పోస్టులు కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. వారాంతంలో ట్రిబ్ సమావేశం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఈ వారాంతంలో సమావేశం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన 9,096 ఉద్యోగాలకు గురుకుల సొసైటీల ద్వారా ఇండెంట్లు గురుకుల బోర్డుకు చేరుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అన్ని సొసైటీల నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత సమావేశమై పోస్టుల భర్తీకి రిజర్వేషన్లు, రోస్టర్, జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్ల వారీగా పోస్టుల వివరాలను సరిచూసుకోనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 (క్లర్కు) పోస్టుల భర్తీకి గురువారం సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్స్/ ఐటీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్స్‌లో డిగ్రీ/ డిప్లొమా/6 నెలల సర్టిఫికెట్ కోర్సు చేసిన వారు అర్హులు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. ఈ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ (ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన) అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్ రిజర్వుడ్ కోటా కింద ఓపెన్ టు ఆల్ (తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థుల)కు అవకాశం కల్పిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎన్.బలరామ్ తెలిపారు. ఈ నెల 20 నుంచి జూలై 10 వరకు ఆన్లైన్ ద్వారా ఠీఠీఠీ. టఛిఛి ఝజీn్ఛట. ఛిౌఝ పోర్టల్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. -
టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు, సవరించిన ర్యాంకులను జిల్లా/సర్కిళ్ల వారీగా ప్రకటించినట్లు సంస్థ యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలను సంస్థ వెబ్సైట్ www. tssouthernpower. cgg. gov. in లేదా www. tssouthernpower. com చూసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. నోటిఫికేషన్ నిబంధనల మేరకు ఆర్టిజన్లు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ మార్కులను ఇచ్చినట్లు తెలిపింది. -
32 మంది రెవెన్యూ ఉద్యోగుల బదిలీ
కాకినాడ సిటీ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లోనూ, కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలోనూ పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు 32 మంది బదిలీ అయ్యారు. పరిపాలన సౌలభ్యం కోసం వీరిని బదిలీ చేస్తూ కలెక్టర్ అరుణ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో సీనియర్ అసిస్టెంట్లు 8 మంది ఉండగా.. జూనియర్ అసిస్టెంట్లు 24 మంది ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్లలో కలెక్టరేట్లో ఏ సెక్షన్లో పనిచేస్తున్న ఎ.నయోమి పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి, కలెక్టరేట్ ఇ సెక్షన్లో పనిచేస్తున్న ఎంఎంఎల్ సరోజని పెదపూడి తహశీల్దార్ కార్యాలయానికి, జీ సెక్షన్లో పనిచేస్తున్న ఎస్కే పద్మవేణి కరప తహశీల్దార్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. అలాగే రాజమండ్రి ఇరిగేషన్ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న బి.వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎల్ఎంసీ యూనిట్-1 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న పి.సర్వేశ్వరమూర్తి, మామిడికుదురు, కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయాల్లో ఎంఆర్‌ఐలుగా పనిచేస్తున్న కట్టా సత్యనారాయణమూర్తి, కె.వీరబాబు, రాజానగరం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వి.శ్రీనివాస్‌రావులను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. -
తమాషా చేస్తున్నారా..!
► ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ► మూడు రోజుల్లో పరిష్కరించి నివేదికలు ఇవ్వాలి ►ప్రజావాణికి క్లర్కులు.. జూనియర్ అసిస్టెంట్లను పంపడంపై కలెక్టర్ అసహనం మహబూబ్‌నగర్ టౌన్: ప్రజలకు అందించడం ఇష్టం లేదా, లేక మాకెందుకులే అనుకున్నారా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఫిర్యాదులను పరిష్కరించకుండా తమాషాలు చేస్తున్నారా అంటూ జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో ‘ పరిష్కారం’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఫిర్యాదుదారులు తాము తరచూ ఫోన్ చేస్తూనే ఉన్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఫిర్యాదులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న శాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పరిష్కారం’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించకుండా పెండింగ్ లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న హౌసింగ్, అర్డబ్ల్యూఎస్, మైనార్టీ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ శాఖల అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. దీనికితోడు సమావేశానికి ఆయూ శాఖల అధికారులకు బదులుగా జూనియర్ అసిస్టెంట్లను పంపడంపై కలెక్టర్ మరింత అగ్రహానికి లోనయ్యారు. సంబంధిత అధికారులు వెంటనే రావాలని ఆదేశిస్తూ వారిని హాల్ నుంచి బయటకు పంపించారు. ఇకపై అధికారులకు బదులుగా ప్రతినిధులను పంపితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు రోజుల్లో పరిష్కరించాలి. ఫోన్లో వచ్చే ఫిర్యాదులకు సంబంధించి అన్ని శాఖల అధికారులు మూడు రోజుల్లో పరిష్కరించి బాధితుడికి సమాచారం ఇస్తూ పరిష్కారం ఇన్‌చార్జీకి నివేదిక అందజేయూలనానరు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం ఫిర్యాదులను స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. సిడిపిఓపై అగ్రహం ప్రజావాణి కార్యక్రమానికి ఐసిడిఎస్ పిడి ఇందిర హాజరుకావాల్సి ఉండగా, ఆమెకు బదులుగా సిడిపిఓను పంపించారు. కలెక్టర్‌కు ఎదురుగా కూర్చున్న సీడిపిఓ న్యూస్‌పేపర్ చదువుతుండటాన్ని గమనించిన కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి ఎందుకొచ్చావ్, ఏం చేస్తున్నావ్, న్యూస్‌పేపర్, ఫోన్లో మాట్లాడటం చేసేందుకు వచ్చావా అంటూ నిలదీశారు. వెంటనే బయటకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. -
జెడ్పీలో పదోన్నతులకు బ్రేక్!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్‌లోని ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియ ర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేం దుకు కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆమోదం తెలి పినా జెడ్పీ అధికారులు ఉత్తర్వులు వెలువరించకుండా జాప్యం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జిల్లా పరిషత్ బాధ్యతలు చేపట్టనున్న ప్రజాప్రతినిధి బంధువు అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఉత్తర్వుల జారీ నిలిచిపోవటానికి కారణమని సమాచారం. వాస్తవానికి, ఈ పదోన్నతుల ఫైల్ ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కారణంగా దీని పరిశీలన వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నికల హడావుడి ముగియటంతో రెండు రోజుల క్రితం కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఈ ఫైల్‌కు ఆమోదం తెలుపుతూ పదోన్నతులు పొందినవారికి సీట్లను సైతం కేటాయించినట్టు తెలిసింది. అయితే ఉత్తర్వులు ఇంకా జారీ కాకపోవటంతో పదోన్నతులు పొందనున్న ఉద్యోగులు శుక్రవారం జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతులు పొందనున్నవారిలో కొందరు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి తమ స్థానాలకు మార్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బాధ్యతలు చేపట్టకముందే ప్రజాప్రతినిధి తరపు బంధువులు అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని వారు తప్పుపట్టారు. కలెక్టర్ ఆమోదించిన మేరకు స్థానాలను కేటాయించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా పదోన్నతుల ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామన్నారు. పదోన్నతులు, బదిలీలపై ఆంక్షలు విధించారని తెలియడంతో నిలుపుదల చేశామని చెప్పారు. తమపై ఎవరు ఒత్తిడి తెచ్చినప్పటికీ ఉన్నతాధికారులు ఆమోదించిన జాబితాను మార్చలేమని పేర్కొన్నారు. -
ఆర్టీఏలో నిబంధనలు హుష్‌కాకి!
యూనిట్ కేంద్రాల్లో తిష్టవేసిన ఉద్యోగులు బదిలీ వద్దంటూ పైరవీలు అసంతృప్తిలో డీటీసీ ఆఫీసు సిబ్బంది తిమ్మాపూర్, ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో నిబంధనలు అమలు కావడం లేదు. ఉద్యోగుల బదిలీల విషయంలో అధికారులు సైతం వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యూనిట్ కేంద్రాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయకపోవడమే దీనికి నిదర్శనంగా చూపుతున్నారు. డీటీసీ కార్యాలయంలో సాధారణంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు యూనిట్ కేంద్రాలకు బదిలీ కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాతుకుపోతున్న ఉద్యోగులు స్థానిక ఆర్టీఏ కార్యాలయం యూనిట్ కేంద్రాల్లో ఉద్యోగులు ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. నిబంధనల మేరకు బదిలీలు జరగడం లేదు. యూనిట్ కేంద్రాల్లో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ఏడాదికోసారి బదిలీ చేయాలనేది నిబంధన. అది ఇక్కడ తుంగలో తొక్కుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లిలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు మూడేళ్లకుపైగా ఒకే చోట పాతుకుపోయినట్లు సమాచారం. వీరిలో సంఘ నాయకులు ఉండడంతోనే ఇలా జరుగుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండాలని కోరుకునే సంఘం నాయకులు దూరంగా ఉండే యూనిట్ కేంద్రాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాసుల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటూ జిల్లా కేంద్రంలోని డీటీసీ ఆఫీసుకు రాకుండా బదిలీలను ఆపుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రానికి సంబంధించిన డీటీసీ కార్యాలయంలో అధికారుల ఒత్తిడి, దరఖాస్తుదారుల తాకిడి తట్టుకోలేక యూనిట్ కేంద్రాలకే పరిమితమవుతున్నారని తెలుస్తోంది. బదిలీపై ఉన్నతాధికారులను అడగలేక పనిఒత్తిడిని తట్టుకోలేక తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఉద్యోగులు సతమతమవుతున్నారు. కార్యాలయంలో అటెండర్లు సైతం ఇదే గోడును వెళ్లబోసుకుంటున్నారు. -
జిల్లా న్యాయస్థానాల్లో 261 పోస్టుల భర్తీ
=జనవరి 5న పరీక్షలు =మచిలీపట్నంలో 35 కేంద్రాల్లో నిర్వహణ =హైకోర్టు ఉత్తర్వులతో నియామకాలు =జిల్లాకు మరో ఐదు కొత్త న్యాయస్థానాలు =జిల్లా చీఫ్ జస్టిస్ చక్రధరరావు వెల్లడి సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని న్యాయస్థానాల్లో ఏడు విభాగాల్లో 261 పోస్టులను భర్తీ చేయనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావు తెలిపారు. మచిలీపట్నంలోని తన చాంబర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూనియర్ అసిస్టెంట్లు 52, ఫీల్డ్ అసిస్టెంట్లు 31, ఎగ్జామినర్లు 12, పర్సనల్ అసిస్టెంట్లు (స్టెనోగ్రాఫర్) 15, టైపిస్టులు 20, కాపీయిస్టులు 16, అటెండర్లు 115 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. మొత్తం పోస్టులకు సుమారు 60 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిశీలించి, అనర్హులను మినహాయించి అర్హులకు పరీక్ష పెడుతున్నట్టు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందన్నారు. జనవరి ఐదున మచిలీపట్నంలో 35 కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మిగిలిన పోస్టులవారికి ఆ తర్వాత స్క్రీనింగ్ టెస్టులు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తామని వివరించారు. ఇప్పటివరకు హాల్‌టిక్కెట్లు అందని అభ్యర్థులు జనవరి 3, 4 తేదీల్లో డూప్లికేట్వి పొందవచ్చని, ఇందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామని తెలిపారు. వివరాలకు 08672 223089, 231335 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పారదర్శకంగా పోస్టుల భర్తీ... న్యాయస్థానాల్లో పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో 1,110 మంది పనిచేస్తున్నారని, ఇంకా 30 శాతం వరకు సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ఈ విషయమై హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఆగస్టు 8 వరకు మొదట గడువిచ్చామన్నారు. అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా చాలామంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించామని చెప్పారు. జిల్లాకు ఇటీవల ఐదు కోర్టులు మంజూరయ్యాయని, విజయవాడలో రెండు, మచిలీపట్నం, నూజివీడు, గన్నవరంలలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా న్యాయస్థానాలు ప్రారంభించాల్సి ఉందని ఆయన వివరించారు.