SCCL Recruitment 2022 Notification: Singareni Junior Assistant, And Clerk Jobs, Apply Online - Sakshi
Sakshi News home page

SCCL Recruitment 2022 Notification: సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published Fri, Jun 17 2022 12:59 AM | Last Updated on Fri, Jun 17 2022 2:37 PM

Singareni Junior Assistant 177 Notification 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో ఖాళీగా ఉన్న 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 (క్లర్కు) పోస్టుల భర్తీకి గురువారం సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్స్‌/ ఐటీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్‌ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు కంప్యూటర్స్‌లో డిగ్రీ/ డిప్లొమా/6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు చేసిన వారు అర్హులు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది.

ఈ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్‌ (ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాలకు చెందిన) అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్‌ రిజర్వుడ్‌ కోటా కింద ఓపెన్‌ టు ఆల్‌ (తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థుల)కు అవకాశం కల్పిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తామని సంస్థ డైరెక్టర్‌  ఎన్‌.బలరామ్‌ తెలిపారు. ఈ నెల 20 నుంచి జూలై 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఠీఠీఠీ. టఛిఛి ఝజీn్ఛట. ఛిౌఝ పోర్టల్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement