ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం 2024లో ఊపందుకుంది. గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాలను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. 2024లో గూగుల్‌లో కొన్ని పర్యాటక ప్రాంతాలు నిరంతరం ట్రెండింగ్‌లో నిలిచాయి. వీటిలో స్విట్జర్లాండ్, లండన్‌తో పాటు ఐదు దేశాల పేర్లు వినిపించాయి. ఇందులో భారత్‌కు కూడా స్థానం దక్కింది.
అజర్‌బైజాన్
2024లో భారత్‌కు చెందిన పర్యాటకలు అజర్‌బైజాన్‌కు సందర్శించేందుకు గూగుల్‌లో విస్తృతంగా సెర్చ్ చేశారు. దీనిని చూస్తుంటే అజర్‌బైజాన్ భారత పర్యాటకులకు ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్‌గా తెలుస్తోంది. భారతదేశం నుండి అజర్‌బైజాన్‌కు విమాన టిక్కెట్లు అందుబాటు ధరల్లో ఉంటాయి. అజర్‌బైజాన్ వెళ్లాలనుకునేవారు ఈ వీసాను మూడు రోజుల్లో సులభంగా పొందవచ్చు. అజర్‌బైజాన్‌లో చూడదగిన అద్భుతమైన ప్రదేశాలలో బాకు, అస్తారా, షెకి, క్యూబా, గోయ్గోల్ సరస్సు మొదలైనవి ఉన్నాయి.
బాలి
బాలి.. భారతీయులు అమితంగా ఇష్టపడే మరో పర్యాటక ప్రాంతం. బాలి ఇండోనేషియాలోని ఒక ప్రావిన్స్. ఇక్కడ కుటా బీచ్, లోవినా బీచ్‌లను సందర్శించవచ్చు. బాలి బర్డ్ పార్క్, బొటానికల్ గార్డెన్, మంకీ ఫారెస్ట్ ఇక్కడి ఆకర్షణ కేంద్రాలు. ప్రకృతి అందించిన సహజ సౌందర్యంతో పాటు, ట్రెక్కింగ్ తరహా సాహసాలను ఇష్టపడేవారికి బాలి పర్యాటక గమ్యస్థానంగా నిలిచింది.
మనాలి
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి అందమైన హిల్ స్టేషన్‌గా పేరుగాంచింది. మనాలీలో పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఇక్కడి మంచు పర్వతాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పలు సాహస క్రీడలు అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన ఫోటోషూట్ చేసుకునేందుకు బాలి అనువైన ప్రాంతం. శీతాకాలంలో మనాలిని సందర్శిస్తే ఆ అనుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయి. 2024లో లెక్కలేనంతమంది పర్యాటకులు మనాలీని సందర్శించారు.
కజకిస్తాన్
కజకిస్తాన్ ఆసియాలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ఇక్కడ కరెన్సీ చాలా చౌకగా ఉంటుంది. భారత్ నుండి కజకిస్తాన్ చేరుకునేందుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఇది ప్రపంచంలో 9వ అతిపెద్ద దేశం. ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. లోయలు, పర్వతాలు, సరస్సులను అతి దగ్గరి నుంచి చూసే అవకాశం కలుగుతుంది.
జైపూర్
2024లో పర్యాటకులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ప్రాంతాలలోభారత్‌లోని జైపూర్ కూడా ఉంంది. విదేశీ పర్యాటకులను జైపూర్ అమితంగా ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌ను పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. అమెర్ ఫోర్ట్, హవా మహల్, నహర్‌ఘర్ కోట బిర్లా టెంపుల్‌తో సహా అనేక చారిత్రక ప్యాలెస్‌లు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు జైపూర్‌లో అనేకం ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో సంబ్రమాశ్చర్యాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి: మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం
Comments
Please login to add a commentAdd a comment