Attack with a knife
-
రూ.1.50 లక్షలు ఇస్తే దుర్గను వదిలేస్తా
సాక్షి, శ్రీకాళహస్తి : అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 1వ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వెంకటేష్‌కు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఏకసిరి గ్రామానికి చెందిన దుర్గ (18)తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. నాలుగు నెలలుగా దుర్గ అమ్మగారింట్లోనే కాపురం ఉంటున్నారు. రెండు నెలల క్రితం శ్రీకాళహస్తి వచ్చారు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు రాజీ చేయడానికి ప్రయత్నించగా రూ.1.50 లక్షలు ఇస్తే దుర్గను వదిలేస్తానని వెంకటేష్ చెప్పినట్టు అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం కూడా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున తీవ్ర ఆగ్రహం చెందిన వెంకటేష్ కత్తితో దుర్గపై దాడి చేశాడు. చెయ్యి, కాలుకు తీవ్రం గాయాలయ్యాయి. బంధువులు ఆమెను వెంటనే శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వెంకటేష్ పోలీసులకు లొంగిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వెంకటేష్‌పై హత్యాయత్నం, వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. -
మైసూరులో ఎమ్మెల్యేపై హత్యాయత్నం
సాక్షి, బెంగళూరు: మైసూరులో ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. మాజీ మంత్రి, మైసూరు నగరంలోని నరసింహరాజ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ శేఠ్‌ని ఆదివారం అర్ధరాత్రి ఫర్హాన్‌పాషా అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. మైసూరులోని పంజినా మైదానంలో బంధువుల నిశ్చితార్థానికి ఎమ్మెల్యే హాజరైన సమయంలో గౌసియానగరకు చెందిన ఫర్హాన్‌పాషా ఆయన మెడపై కత్తితో దాడి చేశాడు. ఎమ్మెల్యే మెడ నుంచి ధారగా రక్తం కారింది. భద్రతా సిబ్బంది దుండగుడిని అడ్డుకున్నారు. గాయపడిన ఎమ్మెల్యేని సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఉద్యోగం ఇప్పించలేదనే దాడి.. ఎమ్మెల్యేపై దాడి అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే తనకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించడంతో దాడి చేసినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఫర్హాన్‌పాషా ఎస్డీపీఐ అనే పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఎమ్మెల్యేపై దాడి నేపథ్యంలో నగరంలో పోలీసులు బందోబస్తు పెంచారు. అల్లర్లు జరగకుండా పహారా కాస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను పలువురు నాయకులు పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం యడియూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
నన్ను డబ్బులు అడుగుతావా.. ఎంత ధైర్యం?
సాక్షి, కర్నూలు : డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి..బాధితులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నంద్యాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. నంద్యాల సీఎస్ఐ చర్చిలో గతంలో సెక్రటరీగా పనిచేసిన పట్టణానికే చెందిన గంగూ ఆనంద్ చర్చికి సంబంధించిన సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏడాది కిందట 300 మంది నిరుద్యోగుల వద్ద దాదాపు రూ.7 కోట్లు దండుకున్నాడు. బాధితుల్లో అధికంగా జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, తిరుపతి, మైలవరం ప్రాంతాల వారు ఉన్నారు. బాధితులు న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల కిందట గంగూ ఆనంద్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఆనంద్‌పై టూటౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదు కావటంతో సెక్రటరీ పదవి నుంచి తప్పించారు. అలాగే కొంత కాలంగా బాధితులు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించలేదు. గంగూ ఆనంద్ టీడీపీ ప్రధాన నాయకులకు ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు. వారి అండదండలతోనే గత ఏడాది నిరుద్యోగులను మోసం చేసి కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. సోమవారం మధ్యాహ్నం దాదాపు 32 మంది బాధితులు గంగూ ఆనంద్ ఇంటి వద్దకు వెళ్లి డబ్బులను తిరిగి ఇవ్వాలని నిలదీశారు. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన సోమశేఖర్‌రెడ్డి, సురేంద్రనాయుడు అనే బాధితులు ఆనంద్‌ను ఇంట్లో నుంచి బయటికి రావాలని కేకలు వేశారు. దీంతో అతను ఆవేశంతో కత్తి తీసుకొచ్చి ఇంటి వద్ద నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే అందరినీ ఇక్కడే పొడిచి చంపేస్తానని బెదిరించాడు. తమ డబ్బు చెల్లిస్తేనే ఇక్కడి నుంచి వెళతామని బాధితులు భీష్మించారు. సహనం కోల్పోయిన ఆనంద్ కత్తితో దాడికి తెగబడ్డాడు. సోమశేఖర్‌రెడ్డి పొట్ట భాగంలో పొడవడంతో తీవ్ర గాయమైంది. అలాగే సురేంద్రనాయుడు చేతికి స్వల్ప గాయమైంది. అడ్డుకోబోయిన మరికొంత మంది బాధితులపైనా దాడికి దిగాడు. బాధితులు భయంతో పరుగులు తీసినా గంగూ ఆనంద్ వదలకుండా వెంటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సోమశేఖర్‌రెడ్డిని తోటి బాధితులంతా కలిసి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. టూటౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డి బాధితులను పరామర్శించి.. సంఘటన గురించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గంగూ ఆనంద్‌కోసం గాలింపు మొదలుపెట్టారు. -
అనుమానమే పెనుభూతమై..
సాక్షి, మొగల్తూరు: కట్టుకున్న భార్యపై అనుమానంతో భర్త దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సంఘటన శని వారం మొగల్తూరు మండలం పేరుపాలెంలో జరిగింది. ఎస్సై కె.గురవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పేరుపాలెం నార్త్ పంచాయతీ కవురువారిపాలెంకు చెందిన గుబ్బల నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గుబ్బల ఏడుకొండలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల గల్ఫ్ నుంచి తిరిగివచ్చిన ఏడుకొండలు భార్యపై అనుమానం పెం చుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క త్తితో భార్యపై దాడి చేయడంతో మెడపైన, కుడికాలు, కుడి చేతిపై బలమైన గాయాలయ్యాయి. కుటుంబ స భ్యులు హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తరలిం చారు. బాధితురాలు తల్లి కట్టా సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గురవయ్య తెలిపారు. -
అప్పు తీర్చాల్సి వస్తుందని.. అంతమొందించాడు
► 15రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు ► నిందితుడి అరెస్టు, రిమాండ్ అయిజ : అప్పు తీర్చాల్సి వస్తుందని ఏకంగా యజమానినే ఓ వ్యక్తి తుదముట్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును 15రోజుల్లో ఛేదించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ సురేష్, ఎస్ఐ రమేష్ అయిజ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. పులికల్‌కు చెందిన కె.చంద్రశేఖర్ (40) మూడేళ్లుగా అయిజ పట్టణంలో రెస్టారెంట్ నిర్వహించేవారు. అందులో కర్నాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా ఉప్పలపాడుకు చెందిన చరణబస్వ అలియాస్ చరణ్ వంటమనిషిగా పనిచేసేవాడు. సుమారు ఆరునెలల క్రితం గల్లాపెట్టెలోని రూ.1.6లక్షలు దొంగలించాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో దీనిపై పంచాయితీ పెట్టిస్తే రూ.1.1లక్షలు మాత్రమే ఇస్తానని అంగీకరించాడు. అలాగే గతంలో అప్పుగా తీసుకున్న రూ.42వేలు కలిపి ఉగాది పండగ వరకు చెల్లిస్తానన్నాడు. అయితే యజ మానిని తుదమిట్టిస్తే ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదని పథకం పన్నా డు. అందులోభాగంగా గత నెల 30వ తేదీ అర్ధరాత్రి భరత్‌నగర్‌కాలనీలోని ఇంటి మిద్దెపై ఒంటరిగా నిద్రిస్తున్న చంద్రశేఖర్‌ను కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. ఈ ఘటనపై మరుసటిరోజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా ఈ విషయం బయటపడింది. నిందితుడు చరణ్‌ను బుధవారం అరెస్టు చేసి గద్వాల కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. -
సినీఫక్కీలో యువకుడి వీరంగం
నాటు తుపాకీతో బెదిరింపు పోలీస్‌ల అదుపులో నిందితుడు విడవలూరు : ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఇరువర్గాలు మోహరించడంతో అందులో ఓ యువకుడు నాటు తుపాకీతో సినీఫక్కీలో వీరంగం సృష్టించాడు. ఉద్రిక్తతలకు దారి తీసిన , సంచలనం సృష్టించిన ఈ సంఘటన మండలంలోని చౌకచెర్లలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన కొమ్మిరెడ్డి నరేంద్రరెడ్డికి చౌకచెర్లలో 19 ఎకరాల పట్టా భూమి ఉంది. దీన్ని గ్రామంలోని తన బంధువైన కొమ్మిరెడ్డి మురళీకృష్ణారెడ్డికి 2004లో కౌలు కింద అప్పగించారు. ఆ సమయంలో నరేంద్రరెడ్డి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 12 ఏళ్ల కిత్రం తీసుకున్న అప్పు నేడు వడ్డీతో కలిపి దాదాపు రూ.50 లక్షల వరకు పెరిగి పోయింది. ప్రస్తుతం ఉన్న అప్పులో రూ.30 లక్షలు అయినా చెల్లించాలని మురళీకృష్ణారెడ్డి పలు మార్లు నరేంద్రరెడ్డిని కోరాడు. దీనికి ఆయన సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం నరేంద్రరెడ్డికి ఉన్న 19 ఎకరాల పొలం కోత దశకు చేరుకుంది. దాన్ని కోసేందుకు వారం రోజులుగా నరేంద్రరెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మురళీకృష్ణారెడ్డి, స్థానికులతో కలిసి తన అప్పులో కొంతభాగమైన చెల్లించి వరి కోసుకోవచ్చునని అడ్డుపడుతున్నారు. దీంతో నరేంద్రరెడ్డి ఎలాగైనా పంట కోసుకుపోవాలని పూర్తి బందోబస్తుతో శుక్రవారం పొలం వద్దకు చేరుకున్నాడు. మూడు వరికోత యంత్రాలను, ఇందుకూరుపేట మండలం మైపాడు, కుడితిపాళెం, నెల్లూరుకు చెందిన దాదాపు 100 మంది యువకులను తీసుకువచ్చాడు. వీరిలో నెల్లూరుకు చెందిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఉండటం గమన్హారం. విషయం తెలుసుకున్న మురళీకృష్ణారెడ్డి, గ్రామస్తులు దాదాపు 150 మంది సంఘటన స్థలం వద్దకు చేరుకుని వరి కోత యంత్రాలను అడ్డుకున్నారు. దీంతో నరేంద్రరెడ్డి తనతో వచ్చి యువకులను రెచ్చగొట్టి గ్రామస్తులపైకి ఉసిగొల్పాడు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. అదే సమయంలో నరేంద్రరెడ్డితో వచ్చిన యవకుల్లో నెల్లూరుకు చెందిన బాబు అనే వ్యక్తి తన వద్దనున్న నాటు తుపాకీ, కత్తిని బయటకు తీసి గ్రామస్తులను బెదిరించాడు. కత్తితో దాడికి పాల్పడడంతో తప్పించుకునే ప్రయత్నంలో గ్రామానికి చెందిన స్టాలిన్ అనే వ్యక్తి చొక్కా చినిగిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కాల్చిచంపుతానంటూ సినీఫక్కిలో, మాఫియా తరహాలో స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. అయితే స్థానికులు ధైర్యంగా నిలబడటంతో అతను వెనక్కితగ్గాడు. గ్రామస్తులు పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ వెంకట్రావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పరారయ్యారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో నరేంద్రరెడ్డి కారణంగా అలజడి రేగడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌లు తెలిపారు.