బీర్‌ సీసాతో భార్యపై దాడి | Man Attacks On His Wife With Beer Bottle In Nizamabad | Sakshi
Sakshi News home page

బీర్‌ సీసాతో భార్యపై దాడి

Published Wed, Jul 15 2020 5:50 PM | Last Updated on Wed, Jul 15 2020 5:55 PM

Man Attacks On His  Wife With Beer Bottle In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలో బోధన్‌ మండలంలోని సాలూరలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తుల్లో కట్టుకున్న భార్యపై ఓ వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు వివరాల్లోకి వెళితే.. సాలూరలో తల్లి ఇంటి వద్ద ఉన్న సవితపై ఆమె భర్త శ్రీనివాస్‌ తాగిన మత్తులో దాడికి పాల్పడ్డాడు. ఆమె శరీరంపై బీరు సీసాతో పైశాచికంగా పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సవితను బంధువులు నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

మరోవైపు ఈ ఘటన అనంతరం శ్రీనివాస్‌.. ఏమి తెలియనట్టు వర్ని మండలం చందూరులోని తన ఇంటికి వెళ్లిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. బార్యపై అనుమానంతో శ్రీనివాస్‌ ఆమెతో పలుమార్లు గొడవ పడినట్టుగా తెలుస్తోంది. ఈ వేధింపులు భరించలేక సవిత ఇటీవల పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, శ్రీనివాస్‌-సవిత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద కుమార్తె రజిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె లావణ్య మూడో తరగతి చదువుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement