
తలకు గాయాలైన దువ్వారి చిట్టమ్మ
శ్రీకాకుళం, పాతపట్నం: మండలంలోని పెద్దలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి చంద్రశేఖర్ తన భార్య చిట్టమ్మపై దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్‌ఐ ఈ.చిన్నంనాయుడు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చంద్రశేఖర్, చిట్టమ్మ గత 25 ఏళ్లుగా విడివిడిగా కాపురం ఉంటున్నారు. వీరి ముగ్గురి కుమారులకు వివాహాలు కాగా, గ్రామంలోనే నివసిస్తున్నారు. ఇటీవల జ్వరం రావడంతో పెద్ద కుమారుడైన ఫాల్గునరావు వద్ద తన భర్త ఉండడంపై భార్య తరచూ తిడుతుండేది.
దీంతో అసహనానికి లోనైన చంద్రశేఖర్.. సోమవారం ఉదయం చెరువుకి స్నానానికి వెళ్తున్న చిట్టమ్మను చెతికర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో బాధితురాలిని హుటాహుటిన పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు కె.మోహన్‌బాబు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. తన తల్లిపై తండ్రి దాడి చేశాడని రెండో కుమారుడు వనజానాథం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment