Husband murder
-
సుత్తితో మోదీ.. దుప్పట్లో చుట్టి.. భార్య దారుణ హత్య!
మహబూబాబాద్: కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన తండ సత్తయ్య, రంగమ్మ(65) దంపతులకు ముగ్గురు కుమారులు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుమారుడు మృతి చెందగా మరో ఇద్దరు బతుకుదెరువుకోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈక్రమంలో తండ సత్తయ్యకు మతిస్థితిమితం సరిగా లేకపోవడంతో ఏడు సంవత్సరాలుగా వైద్యం అందించారు. మాములు స్థితికి చేరిన సత్తయ్య తాగుడుకు బానిస అయ్యాడు. గురువారం సత్తయ్య మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య రంగమ్మతో గొడవకు దిగి ఇంట్లో ఉన్న సుత్తితో మెడపై మోదీ హతమార్చాడు. ఎవరికి అనుమానం రాకుండా దుప్పట్లో చుట్టి మంచం పక్కన ఉంచాడు. ఉదయం ఎంతసేపటికీ రంగమ్మ లేవకపోవడంతో చుట్టుపక్కలవారు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి రంగమ్మ విఘతజీవిగా పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రమేష్‌బాబు, సిబ్బంది తొర్రూర్ డీఎస్పీ వెంకటేష్‌బాబుకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రంగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పరిచయాలకు అడ్డుగా ఉన్నాడని.. విషం నింపిన సూదులు గుచ్చి
వైఎస్సార్: తమ పరిచయాలకు అడ్డుగా ఉన్నాడని.. ఆటోలో వెళ్తున్న వ్యక్తికి విషం నింపిన సూదులు గుచ్చి హత్యకు పాల్పడిన ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. నిందితుడి అరెస్టు చూపుతూ విలేకరుల సమావేశంలో సీఐ మోహన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన సుధాకర్ (37) బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. అతడి భార్యతో పీలేరు పట్టణం ఆర్టీసీ నల్లగుట్టలో నివాసముంటున్న తైదులకిషోర్ (32) పరిచయం పెంచుకున్నారు. అయితే సుధాకర్ ఇటీవల కువైట్ నుంచి తిరిగివచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తమ పరిచయాలకు అడ్డుగా ఉన్న సుధాకర్‌ను చంపేందుకు కిషోర్ తిరుపతి, చైన్నెలోని కొందరితో కలిసి కుట్ర చేశారని సీఐ తెలిపారు. ప్రణాళిక ప్రకారం ఆగస్టు 31న ఉదయం 9 గంటలకు ఆటోలో తన కుమార్తెను తీసుకుని సుధాకర్ కోటపల్లె బాలికోన్నత పాఠశాల వెళ్లినట్లు తెలుసుకున్నారు. సుధాకర్ తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బస్టాండ్ వద్ద వదలాలని ఆటో ఎక్కారు. వెనుక వైపు కూర్చున్నట్లు నటించి సుధాకర్ భుజంపై విషం నింపిన సూదులు గుచ్చి వెళ్లిపోయారు. కొద్ది సమయానికి విష ప్రభావంతో సుధాకర్ మరణించాడు. మృతుడి భార్య అశ్వని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితుడైన తైదుల కిషోర్ (32)ను స్థానిక తిరుపతి రోడ్డు మార్గం వద్ద అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. తిరుపతికి చెందిన ఉమ, చందు, సునీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఎస్ఐ నరసింహుడు పాల్గొన్నారు. -
భర్త మృతి... నిందితులుగా భార్య విద్యాభారతీ, వంటవాడు మన్మథ
పర్లాకిమిడి(ఒడిశా): జిల్లా అటవీశాఖ ఏసీఎఫ్(అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) సౌమ్యనంజన్ మహాపాత్రొ 2021 జూలై 21న అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో దర్యాప్తు(సిట్) అధికారులు విఫలమయ్యారు. అయితే మృతుడు తండ్రి అభిరాం మహాపాత్రొ కేసుపై పునః విచారణ చేయాలని పర్లాకిమిడి ఎస్డీజేఎం కోర్టులో కోరారు. దీనిని స్వీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 27కు విచారణకు రావాల్సిందిగా నిందితులకు నోటీసులు పంపారు. కేసులో అప్పటి డీఎఫ్ఓ సంగ్రాంకేసరి బెహరా, భార్య విద్యాభారతీ పండా, వంటవాడు మన్మథ ఖంబలకు నిందితులుగా చేర్చారు. 95శాతం శరీర భాగాలు కాలిన మృతదేహాన్ని ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. -
భార్యతో గొడవ.. ‘కొడుకా’ అని నచ్చచెప్పేందుకు వెళ్తే..
సాక్షి, దేవరకొండ (నల్లగొండ): భార్యతో గొడవెందుకు కొడుకా అని నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. పండుటాకు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదిలా వ్యవహరిస్తూ ఛాతి ఎడమ భాగంలో పొడవడంతో అక్కడికక్కడే కూప్పకూలి ప్రాణాలొదిలింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల పరిధి లోని చింతచెట్టుతండా గ్రామపంచాయతీ జేత్యతండాకు చెందిన మూఢావత్ రవి వ్యవసాయం చేసుకుంటూ భార్య విజయ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. మద్యానికి బానిసై.. రవి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా మద్యం విషయంలోనే దంపతులు గొడవ పడ్డారు. తనను మద్యం తాగనీయకుంటే చస్తానని, కత్తి తీసుకుని ప్రాణం తీసుకుంటానని భార్యను బెదిరించాడు. పెద్దపెట్టున అరుస్తుండడంతో భర్త తీరుకు విసుగుచెందిన విజయ పిల్లలను తీసుకుని తండాలోనే బంధువు ఇంటికి వెళ్లింది. గొడవ పెట్టుకోవద్దని అన్నందుకు.. కాగా, మూఢావత్ రవి ఇంటి ఎదురుగానే ఇస్లావత్ బంగారి(60), భర్త చందుతో కలిసి జీవనం సాగి స్తోంది. వీరికి కుమారుడు, కుమార్తెకు వివాహాలు కావడంతో హైదరాబాద్‌లోనే కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే, రవి తన భార్యతో గొ డవ పెట్టుకుండుడం విన్న బంగారి నచ్చచెప్పేందుకు అతడి ఇంటికి వెళ్లింది. భార్యతో గొడవపెట్టుకోవద్దని, బాగా జీవించాలని చెప్పి ంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి కత్తితో ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. బంగారి ఛాతి ఎడమ భాగంలో బలంగా కత్తితో పొడవడంతో నిల్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. తాళ్లతో బంధించి.. రవి ఘాతుకానికి ఎదురుగా అరుగుపై కూర్చున్న బంగారి భర్తతో పాటు మరికొందరు హతాశులయ్యారు. వెంటనే వారు అక్కడికి వెళ్లే సరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడి బంగారి ప్రాణాలు వది లింది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మరికొందరు తండావాసులు నిందితుడు రవిని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. బంగారి మృతదేహాన్ని రవి ఇంటి ఎదుట ఉంచి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు ఆందోళన చేపట్టారు. బంగారి మృతి వార్త తెలుసుకున్న బంధువులు తండాకు చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. .తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కొండమల్లేపల్లి, గుడిపల్లి, గుర్రపోండు ఎస్ఐలు భాస్కర్‌రెడ్డి, వీరబాబు, శ్రీనయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..
గద్వాల క్రైం: వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడమే ఆమెకు శాపంగా మారింది. కోపం పెంచుకున్న భర్త ఆమె ఉసురుతీశాడు. చిన్నారులకు తల్లి ప్రేమానురాగాలను దూరం చేశా డు. ఈ ఘటన గద్వాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి(26)కి గద్వాలకు చెందిన వెంకటేశ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం మొదటి సంతానం పాప జన్మించింది. ఈ నెల 24న ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) పుట్టారు. దీంతో భార్యపై వెంకటేశ్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న భార్య గొంతు నులిపేస్తుండగా కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు వచ్చి నిలదీయగా ఫిట్స్ వచ్చాయని నమ్మించేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. అతని మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు సోమవారం పోలీసులకు సమాచారమిచ్చారు. గద్వాల సీఐ షేక్ సయ్యద్‌బాషా, తహసీల్దార్ లక్ష్మి, వైద్యుల సమక్షంలో పల్లవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమెను పథకం ప్రకారమే హత్య చేసినట్టు తేలింది. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు అల్లుడు వెంకటేశ్, అతని తల్లి జయమ్మ, బావ జనార్దన్, చెల్లెలు లీలావతిలపై కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. నిందితుడు మల్దకల్ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’) -
తాళ్లతో కట్టేసి..ఊపిరాడకుండా దిండుతో నొక్కి..!
ముంబై: దేశవాణిజ్య రాజధాని ముంబైలోని గోరెగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసై రోజు కుటుంబసభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్న రాజు వాగ్మేర్ అనే వ్యక్తిని గురువారం రోజున తన ఇద్దరు భార్యలు పథకం ప్రకారం హతమార్చారు. రాజు 2006లో సవితను వివాహం చేసుకోగా.. 2010లో సరితను వివాహం చేసుకున్నాడు. వీరిలో సవితకు ముగ్గురు పిల్లలు కాగా.. సరితకి ఒకరు సంతానం. రాజు వాగ్మేర్ తన ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్న వాగ్మేర్ గతకొద్ది రోజులుగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చొని మద్యం తాగుతూ గడిపేవాడు. ఈ క్రమంలో భార్యలిద్దరినీ, పిల్లలను వేధింపులకు, హింసకు గురిచేస్తుండటంతో వారు భర్త ప్రవర్తన పట్ల విసిగిపోయారు. ఎలాగైనా రాజును హతమార్చాలని పథకం వేశారు. సరిత, సవిత గురువారం అర్ధరాత్రి భర్తను హతమార్చడానికి అనువైన సమయంగా ఎంచుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు మద్యం మత్తులో ఉన్న రాజును మంచం మీద పడుకోబెట్టారు. కదలకుండా కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా బిగించారు. దీంతో కొద్ది సేపటిలోనే అతను మృతి చెందాడు. వెంటనే వారు తమకేమీ తెలియనట్టు.. రాజు స్పందించడం లేదని మృతుడి అన్న వినోద్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న వినోద్ హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో వైద్యులు చనిపోయాడని ధ్రువీకరించారు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు భార్యలు కలిసి హతమార్చారని తెలిసింది. వారిని అరెస్టు చేయడంతో పాటు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చదవండి: 9 నెలల చిన్నారిపై మేనమామ అఘాయిత్యం -
భర్తను సజీవదహనం చేసిన భార్య అరెస్ట్
సాక్షి, చెన్నై : భర్తను సజీవదహనం చేసిన భార్యని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కడలూర్ జిల్లా సోళదరం సమీపంలోని పుడైయూర్ గ్రామానికి చెందిన నటరాజన్(48) లారీ డ్రైవర్. ఇతను విదేశాల్లో పనిచేస్తున్నాడు. సంపాదించిన డబ్బును భార్య ఝాన్సీరాణికి (38) పంపిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల నటరాజన్ సొంతూరికి వచ్చాడు. అప్పుడు ఝాన్సీరాణిని డబ్బు అడిగాడు. మొత్తం నగదుని ఖర్చు చేశానని ఆమె బదులిచ్చింది. దీంతో భార్య, భర్తల మధ్య తగాదా ఏర్పడింది. రెండు రోజుల ముందు భార్య, భర్తలకు మధ్య మరలా తగాదా ఏర్పడింది. అనంతరం నటరాజన్ ఇంటి వెనుక భాగంలో స్నానం చెయ్యడానికి వెళ్లాడు. ఆగ్రహంతో ఝాన్సీరాణి గోనె సంచిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి దాన్ని నటరాజన్‌పై విసిరేసింది. దీంతో తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు చికిత్స కోసం చిదంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం పుదుచ్చేరి జిప్మర్ ఆస్పత్రిలో చేర్చారు. సోళదరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం నటరాజన్ మృతి చెందాడు. పోలీసులు ఝాన్సీరాణిని అరెస్టు చేశారు. -
శ్రీవిద్య అరెస్టు.. నవ్వు ముఖంతో పోలీసుల మధ్య..
సాక్షి, గుంటూరు : ప్రేమగా మద్యం పోసి అందులో ప్రియుడి సాయంతో సైనెడ్ కలిపి భర్తను చంపిన శ్రీవిద్య అరెస్టయింది. భర్తను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారీ అయిన ఆమెను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది. ఎవరికి అనుమానం రాకుండా మద్యంలో సైనెడ్ కలిపి తాగించింది. అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రించింది. అందుకుగాను చనిపోయిన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి పునుగుపాడువద్ద ఉన్న కాలువలో పడేసింది. ఈ సంఘటన గత నెల డిసెంబర్ (2017) 19న చోటుచేసుకుంది. అయితే, తల్లిదండ్రుల అనుమానం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవిద్య అతడి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు గుర్తించారు. శుక్రవారం గొట్టిపాటి వీరయ్య చౌదరి, గుంజి బాలరాజు, పూజల చౌడయ్య అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టగా శ్రీవిద్య మాత్రం పరారీలో ఉంది. అయితే, ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ సమయంలో తన భర్తను హత్య చేసినందుకు ఆమె మొఖంలో ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదు. పైగా నవ్వుతూ మీడియా ఎదుటకు వచ్చి అందరినీ షాకయ్యేలా చేసింది. కాగా, ప్రియులతో సంబంధాలు పెట్టుకొని తమ భర్తలను స్వాతి, జ్యోతి అనే గృహిణులు హత్య చేసిన సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసింది. -
భర్తను చంపి 13 ఏళ్లుగా సెప్టిక్ ట్యాంక్‌లో..
సాక్షి, ముంబయి : ఓ సెక్స్ రాకెట్ గుట్టు తేలుద్దామని వెళ్లిన పోలీసులకు అంతకుమించి షాకింగ్ విషయం తెలిశాయి. ఆ వ్యవహారం నడుపుతున్న మహిళ ఓ హంతకురాలు అని కూడా గుర్తించి అవాక్కయ్యారు. గాలింపులు నిర్వహించిన పోలీసులకు అస్తిపంజరం లభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన భర్తను 13 ఏళ్ల కిందటే హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పెట్టినట్లు తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. బోయిసార్ ప్రాంతానికి చెందిన పోలీసులు ఫరిదా భారతీ అనే మహిళ ఇంట్లో వ్యభిచారం నడుస్తుందన్న సమాచారం తెలుసుకొని దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలను ఆ ఊబిలో నుంచి బయటపడేశారు. ఆ తర్వాత మరోసారి గాలింపు చర్యలు చేపట్టగా సెప్టిక్ ట్యాంక్‌లో అస్తిపంజరం లభించింది. దానిపై విచారించగా ఆమె భర్తను హత్య చేసి అందులో పడేసినట్లు తెలిపింది. 'ఫరిదా కేవలం వ్యభిచారం మాత్రమే కాకుండా తన భర్తతో సహా పలువురుని హత్య చేసిందన్న సమాచారం మేరకు మేము మంగళవారం రైడింగ్ నిర్వహించాం. అక్కడ మాకు అస్తిపంజరం లభించింది. ఆమెను విచారించగా సహదేవ్ అనే తన భర్తను 13 ఏళ్ల కిందటే చంపి అందులో పాతిపెట్టినట్లు తెలిపింది. నిద్రపోతున్న భర్తను తలపై కొట్టి చంపినట్లు ఆమె అంగీకరించింది' అని పోలీసులు తెలిపారు. -
భోజనం స్పైసీగా ఉందని చంపేశాడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మధు విహార్ ప్రాంతంలో సుబోధ్ (40) అనే వ్యక్తి.. భోజనం విషయంలో గొడవపడి భార్యను కిరాతకంగా చంపేశాడు. భోజనంలో కారం ఎక్కువగా ఉందని కారణంతో కర్రతో బాదడంతో ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్లంబర్‌గా పనిచేస్తున్న సుబోధ్, అతని భార్య మనీషా తరచూ గొడవపడేవారని పోలీసులు చెప్పారు. సుబోధ్ మునియా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మనీషాకు తెలియడంతో భర్తను నిలదీసింది. సుబోధ్‌కు దూరంగా రోహిణిలో ఉన్న బంధువుల దగ్గరకు వెళ్లింది. ఈ నెల 10న సుబోధ్ నచ్చజెప్పి మనీషాను ఇంటికి రమ్మని చెప్పాడు. ఆ రోజు ఇంట్లో సుబోధ్‌తో కలసి మునియా ఉండటం చూసి మనీషా కోప్పడింది. కాగా మునియా ఇంట్లో ఉండదని, దగ్గరలో మరో చోట ఉంటుందని సుబోధ్ ఆమెకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత మనీషా భోజనం తయారు చేసి భర్తకు వడ్డించింది. భోజనంలో కారం ఎక్కువగా ఉందని గొడవపడిన సుబోధ్ కర్ర తీసుకుని బాదడంతో మనీషా చనిపోయింది. ఆమె ఒంటిపై 22 చోట్ల గాయాలున్నట్టు పోలీసులు చెప్పారు.