సాక్షి, చెన్నై : భర్తను సజీవదహనం చేసిన భార్యని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కడలూర్ జిల్లా సోళదరం సమీపంలోని పుడైయూర్ గ్రామానికి చెందిన నటరాజన్(48) లారీ డ్రైవర్. ఇతను విదేశాల్లో పనిచేస్తున్నాడు. సంపాదించిన డబ్బును భార్య ఝాన్సీరాణికి (38) పంపిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల నటరాజన్ సొంతూరికి వచ్చాడు. అప్పుడు ఝాన్సీరాణిని డబ్బు అడిగాడు. మొత్తం నగదుని ఖర్చు చేశానని ఆమె బదులిచ్చింది. దీంతో భార్య, భర్తల మధ్య తగాదా ఏర్పడింది. రెండు రోజుల ముందు భార్య, భర్తలకు మధ్య మరలా తగాదా ఏర్పడింది.
అనంతరం నటరాజన్ ఇంటి వెనుక భాగంలో స్నానం చెయ్యడానికి వెళ్లాడు. ఆగ్రహంతో ఝాన్సీరాణి గోనె సంచిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి దాన్ని నటరాజన్‌పై విసిరేసింది. దీంతో తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు చికిత్స కోసం చిదంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం పుదుచ్చేరి జిప్మర్ ఆస్పత్రిలో చేర్చారు. సోళదరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం నటరాజన్ మృతి చెందాడు. పోలీసులు ఝాన్సీరాణిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment